Numerology| తల్లిదండ్రులందరూ తమ కూతురికి మంచి భర్త లభించాలని కోరుకుంటారు. అయితే అల్లుడు కూడా తమను సొంత తల్లిదండ్రుల్లా చూసుకోవాలని కూడా ఆశిస్తారు. కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మెలిగే అల్లుడు దొరకడం నిజంగా అదృష్టమే. న్యూమరాలజీ ప్రకారం కొన్ని మూలాంకాల అబ్బాయిల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు భార్యతో పాటు అత్తమామల బాగోగులను కూడా పట్టించుకుంటారు. మరి ఆ ప్రత్యేక మూలాంకాలు ఏవో తెలుసుకుందాం.
ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 2 అవుతుంది. అంకశాస్త్రం ప్రకారం ఈ సంఖ్యకు చంద్రుడు అధిపతి. ఈ మూలాంకం ఉన్న అబ్బాయిలు ప్రశాంతంగా, సున్నితమైన మనస్తత్వంతో ఉంటారు. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చిన్న విషయాలకే గొడవపడకుండా ఓపికగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తారు. వివాహం తర్వాత భార్య కుటుంబ సభ్యులతో కూడా ఆప్యాయంగా ఉంటారు. అత్తమామలను సొంత తల్లిదండ్రుల్లా గౌరవిస్తారని నమ్ముతారు. కుటుంబంలో అందరితో మంచి సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు. అందుకే వీరిని మంచి అల్లుళ్లుగా భావిస్తారు.
5, 14, 23 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 5 అవుతుంది. ఈ సంఖ్యకు బుధుడు అధిపతి. ఈ మూలాంకం ఉన్నవారు తెలివైనవారు, చురుకైనవారు, కలుపుగోలుగా ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. ఇతరులతో మాట్లాడటంలో వీరు మంచి నైపుణ్యం చూపిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలను వినడంతో పాటు తమ ఆలోచనలను స్పష్టంగా చెబుతారు. అత్తవారింట్లో కూడా అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతారు. కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తమ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండేలా చూసుకుంటారని చెబుతారు.
Also Read: పిల్లలు పబ్లిక్ ప్లేస్‌లో మొండి చేస్తున్నారా? ఈ టిప్స్‌తో సులభంగా హ్యాండిల్ చేయండి
7, 16, 25 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 7 అవుతుంది. అంకశాస్త్రం ప్రకారం ఈ సంఖ్యకు కేతువు అధిపతి. ఈ మూలాంకం ఉన్నవారు ఆలోచనాపరులు, పరిణతితో వ్యవహరించేవారు, నమ్మకమైన వ్యక్తులు. అనవసరమైన ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. తమ బాధ్యతలను గుర్తుంచుకుని నడుచుకుంటారు.
అత్తమామలకు అవసరమైనప్పుడు సహాయం చేసేందుకు ముందుంటారు. కుటుంబంలో ఎలాంటి కష్టాలు వచ్చినా వెనకడుగు వేయకుండా అండగా నిలుస్తారు. మాటలకంటే చేతల ద్వారా ప్రేమను చూపిస్తారు. అందుకే అత్తమామలకు వీరు సొంత కొడుకులా కనిపిస్తారు.
Also Read: ఇల్లు, పెళ్లి, కారు.. మీ సంపాదనతో ముందుగా దేనికి ఖర్చు చేయాలి?
ఈ కథనంలోని వివరాలు అంకశాస్త్రం.. సంప్రదాయ నమ్మకాల ఆధారంగా అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఒక వ్యక్తి స్వభావాన్ని లేదా కుటుంబ సంబంధాలను కేవలం పుట్టిన తేదీతో నిర్ణయించలేం. వీటిని కేవలం సాధారణ సమాచారంగా మాత్రమే పరిగణించాలి.