E-Paper
Advertisement

ఇంటర్నెట్ స్పీడ్‌లో ఎయిర్‌టెల్ హవా.. జియో వెనకబడినా, బీఎస్ఎన్ఎల్ మాత్రం గట్టి పోటీ ఇచ్చింది!

ఇంటర్నెట్ స్పీడ్‌లో ఎయిర్‌టెల్ హవా.. జియో వెనకబడినా, బీఎస్ఎన్ఎల్ మాత్రం గట్టి పోటీ ఇచ్చింది!
Advertisement

Airtel Broadband: ఇంట్లో వైఫై వాడేవాళ్లకు నెట్ స్పీడ్, కనెక్షన్ స్టెబిలిటీ చాలా ముఖ్యం. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, ఓటీటీలు, ఆన్‌లైన్ గేమింగ్ పెరిగిపోవడంతో ఏ బ్రాడ్‌బ్యాండ్ తీసుకుంటే బెస్ట్ అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే నెట్‌వర్క్ అనలిటిక్స్ సంస్థ ఓపెన్‌సిగ్నల్ (Opensignal) మన దేశంలోని హోమ్ ఇంటర్నెట్ సర్వీసులపై ఒక తాజా రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో ఎయిర్‌టెల్ తమ ప్రత్యర్థులైన రిలయన్స్ జియో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌లను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది.

అన్ని విభాగాల్లో Airtel టాప్:

ఓపెన్‌సిగ్నల్ రిపోర్ట్ ప్రకారం.. ఓవరాల్ బ్రాడ్‌బ్యాండ్ అనుభవంలో ఉన్న మొత్తం ఐదు విభాగాల్లోనూ ఎయిర్‌టెల్ విజేతగా నిలిచింది. డౌన్‌లోడ్ స్పీడ్, అప్‌లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీ, రిలయబిలిటీ (నెట్‌వర్క్ నమ్మకం) ఇలా అన్నింట్లోనూ ఎయిర్‌టెల్ హవా కొనసాగింది. 1000 పాయింట్ల స్కేల్‌పై జరిగిన రిలయబిలిటీ టెస్ట్‌లో ఎయిర్‌టెల్ 486 పాయింట్లు సాధిస్తే.. జియో 423 పాయింట్ల వద్దే ఆగిపోయింది.

BSNL గట్టి పోటీ:

Advertisement

ఓవరాల్ స్పీడ్ విషయంలో జియో కంటే ఎయిర్‌టెల్ దాదాపు 26 నుండి 27 శాతం ముందుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ స్పీడ్ విషయంలో ఎయిర్‌టెల్‌కు చాలా దగ్గరగా వచ్చి రెండో స్థానంలో నిలిచింది. డౌన్‌లోడ్ స్పీడ్‌లో కేవలం 0.5 Mbps, అప్‌లోడ్ స్పీడ్‌లో 0.8 Mbps తేడాతో మాత్రమే బీఎస్ఎన్ఎల్ వెనుకబడింది.

Also Read: మడత కనిపిస్తే ఒట్టు.. 200MP గింబల్ కెమెరాతో ఒప్పో తెస్తున్న కొత్త ఫోల్డబుల్ ఫోన్ వివరాలు లీక్!

ఎయిర్‌ఫైబర్ లోనూ అదే జోరు:

Advertisement

వైర్లు లేకుండా గాలి ద్వారా అందించే ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) కేటగిరీలో కూడా ఎయిర్‌టెల్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇందులో ఎయిర్‌టెల్ సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 32.4 Mbpsగా నమోదైతే, జియో 25.7 Mbps స్పీడ్ ఇచ్చింది. క్వాలిటీ కన్సిస్టెన్సీలోనూ ఎయిర్‌టెల్ 66.2 శాతం స్కోరుతో జియో (55 శాతం) కంటే చాలా మెరుగ్గా ఉందని రిపోర్ట్ స్పష్టం చేసింది.

సబ్‌స్క్రైబర్ల లెక్కలు ఇలా:

క్వాలిటీ, స్పీడ్ పరంగా ఎయిర్‌టెల్ టాప్‌లో ఉన్నప్పటికీ.. కస్టమర్ల సంఖ్యలో మాత్రం జియోనే ముందుంది. ఆగస్టు 2026 నాటి ట్రాయ్ (TRAI) డేటా ప్రకారం దేశవ్యాప్తంగా జియోకు 1.48 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు ఉన్నారు. ఆ తర్వాత ఎయిర్‌టెల్ 1.14 కోట్ల మందితో రెండో స్థానంలో, బీఎస్ఎన్ఎల్ 46 లక్షల మంది యూజర్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

Also Read: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే కొత్త ఫోన్‌లోకి eSIM ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

Tags

Related News

స్పామ్ కాల్స్ లొల్లి.. జియో vs ఎయిర్‌టెల్ vs వీఐ.. ట్రాయ్ షాకింగ్ రిపోర్ట్!

మడత కనిపిస్తే ఒట్టు.. 200MP గింబల్ కెమెరాతో ఒప్పో తెస్తున్న కొత్త ఫోల్డబుల్ ఫోన్ వివరాలు లీక్!

ఏడాదంతా ఫ్రీ కాల్స్.. ఎయిర్‌టెల్, జియో, వీఐలో.. అత్యంత చౌకైన ప్లాన్లు ఇవే!

జియోలో దుమ్మురేపే ఫ్యామిలీ ప్లాన్.. రూ.749కే 100GB, అపరిమిత 5G, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్!

23 ఏళ్లకే రూ.40 వేల కోట్ల సామ్రాజ్యం.. ఇద్దరు కుర్రాళ్ల ప్రపంచ రికార్డు!

ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకోండి..కేవలం నిమిషాల్లో పని పూర్తి!

సీసీ కెమెరా కాకుండా ఇంటి సేఫ్టీ కోసం..ఈ స్మార్ట్ గాడ్జెట్లు బెస్ట్

Big Stories

Advertisement
×