E-Paper
Advertisement

కొండ మీద నుంచి జారిపడిన యువకుడు.. 6 రోజులు ఎండలో కాలిపోతూ ఆకలి తట్టుకోలేక ఎలా బయటపడ్డాడంటే

కొండ మీద నుంచి జారిపడిన యువకుడు.. 6 రోజులు ఎండలో కాలిపోతూ ఆకలి తట్టుకోలేక ఎలా బయటపడ్డాడంటే
Advertisement

Teen Fallen From Cliff Survive| ఒక 17 ఏళ్ల టీనేజ్ కుర్రాడు అడవిలో వెళ్లి కాలు జారిపడి కొండమీద నుంచి పడ్డాడు. కానీ చుట్టూ దట్టమైన అడవి, కనుచూపుమేరలో మనుషులు లేరు. చేతిలో ఫోన్ లేదు.. తినడానికి సరిపడా ఆహారం కూడా లేదు. అయినప్పటికీ ఆ యువకుడు ధైర్యంగా ఆ కష్టాలను ఎదుర్కొన్నాడు. జీవించడానికి విధితో పోరాడి గెలిచాడు. ఈ ఘటన ఇటీవలే ఆస్ట్రేలియా దేశంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది.

స్నేహితుడితో క్యాంపింగ్‌కు వెళ్లి దారితప్పిన యువకుడు

ఆస్ట్రేలియాకు చెందిన విలియం అనే 17 ఏళ్ల యువకుడు నవంబర్ 6న తన ఫ్రెండ్‌తో కలిసి క్యాంపింగ్‌కు వెళ్లాడు. మెల్‌బోర్న్‌ నగరానికి తూర్పున సుమారు 180 కిలోమీటర్ల దూరంలోని వాల్హల్లా సమీపంలో ఇద్దరూ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ క్యాంపింగ్ సామగ్రి తీసుకురావడానికి విలియం బయటకు వెళ్లాడు. అయితే ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీంతో అతడి స్నేహితుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాడు. అయినప్పటికీ విలియం ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

6 రోజుల పాటు కొనసాగిన గాలింపు చర్యలు

Advertisement

విలియం కోసం పోలీసులు భారీ గాలింపు చర్యలు ప్రారంభించారు. హెలికాప్టర్లు, పోలీస్ కుక్కలు, డైవర్లతో పాటు అత్యవసర సహాయక బృందాలను రంగంలోకి దించారు. 100 మందికి పైగా సిబ్బంది, వాలంటీర్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో ఎత్తైన కొండలు, రాతి మార్గాలు, దట్టమైన చెట్లు ఉండటంతో గాలింపు కష్టంగా మారింది. విలియం దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదు. అతడు షార్ట్స్, వర్క్ బూట్లు మాత్రమే ధరించి ఉన్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతడు ఎత్తైన వాలు ప్రాంతం నుంచి కిందపడిపోయాడు. దీంతో ఒక మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోయాడు.

చిప్స్ తింటూ 6 రోజులు గడిపిన విలియం

అడవిలో చిక్కుకున్న విలియం సమీపంలోని వాగు నుంచి నీళ్లు తాగుతూ ప్రాణాలు కాపాడుకున్నాడు. తన దగ్గర ఉన్న ఒక ప్యాకెట్ పొటాటో చిప్స్‌ కొద్దికొద్దిగా తింటూ ఆరు రోజులు గడిపాడు.
చలిని తట్టుకోవడానికి రెండు టవల్స్‌ కలిపి దుప్పట్లుగా ఉపయోగించాడు. చివరి రెండు రోజులు ఎండిపోయిన వాగు సమీపంలోనే గడిపాడు. జారి పడడం వలన అయిన గాయాలు, కష్టమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా అతడు ఎక్కువగా కదలలేకపోయాడు.

Advertisement

Also Read: ముఖం చూడగానే మనసులో ఏముందో పట్టేస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు ఫేస్ రీడింగ్‌లో దిట్ట

హెలికాప్టర్ కనిపించగానే ఆనందంతో గాల్లోకి పంచ్‌లు

గాలింపు సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న పోలీస్ సిబ్బందికి విలియం తీసుకెళ్లిన ఫిషింగ్ బాక్స్ కనిపించింది. వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించగా.. సమీపంలోని రాతిపై నిద్రిస్తున్న విలియం కనిపించాడు. హెలికాప్టర్ శబ్దం విని నిద్రలేచిన విలియం సహాయకులకు చేతులు ఊపాడు. అనంతరం ఆనందంతో గాల్లోకి పంచ్‌లు విసిరాడు. విక్టోరియా పోలీసులు ఈ రెస్క్యూ వీడియోను విడుదల చేశారు. సహాయకులు అతడిని సురక్షితంగా హెలికాప్టర్‌లోకి తీసుకెళ్లారు. అనంతరం చికిత్స కోసం లాట్రోబ్ రీజినల్ ఆసుపత్రికి తరలించారు. ఎండ తీవ్రత కారణంగా చర్మం కాలిపోవడంతో పాటు కాళ్లకు గాయాలు, శరీరంపై గీతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం విలియంకు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు.

Also Read: ఇంటింటికీ తిరిగి పుట్టగొడుగులు అమ్మిన వ్యక్తి.. నేడు వందల కోట్ల బిజినెస్‌కు అధిపతి

కొడుకు క్షేమంగా తిరిగి రావడంతో తల్లికి ఆనందం

విలియం తల్లి ఎలిజబెత్ తన కుమారుడి కోసం ఆందోళనగా ఎదురుచూశారు. 6 రోజుల తర్వాత అతడు క్షేమంగా తిరిగి రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తన కుమారుడు ఇకపై ఒంటరిగా క్యాంపింగ్‌కు వెళ్లనిచ్చేది లేదని ఆమె చెప్పారు. సహాయక సిబ్బంది, పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Related News

చిన్నపిల్లల్లో మధుమేహం.. తల్లిదండ్రులు ఈ లక్షణాలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు

పాతదే మళ్లీ ఫ్యాషన్.. Vintage Cultureకి ఫిదా అవుతున్న Gen Z!

టెన్షన్ ఎక్కువైతే ప్రాణాల మీదకి వస్తుంది!ఒత్తిడి వల్ల దెబ్బతినే అవయవాలు ఇవే!

పిల్లల ముఖాల్లో నవ్వులు పూయించే హోమ్‌మేడ్ పొటాటో స్మైలీ.. చాలా సులువుగా చేసేయండిలా!

ఇంట్లో ఉండే మసాలాలతోనే పైకి క్రిస్పీగా, లోపల జ్యూసీగా కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ ఫ్రైస్!

వెల్లుల్లి పచ్చడి తిన్నా నోరు వాసన రాకూడదా? 99% మందికి తెలియని సీక్రెట్ టిప్ ఇదే!

మఖానా తింటే లాభమే కాదు నష్టం కూడా ఉంది.. ఈ 5 రకాల సమస్యలు ఉన్నవాళ్లు పొరపాటున కూడా తినొద్దు!

Big Stories

Advertisement
×