ఉరుకుల పరుగుల జీవితం, టెన్షన్ ఉద్యోగాలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది శృంగార సంతోషాన్ని పొందలేకపోతున్నారు. అయితే, కొన్ని దేశీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బెడ్ రూమ్ లో హ్యాపీగా జాలీగా గడిపే అవకాశం ఉంది. అశ్వగంధ మొదలుకొని ఖర్జూర పండ్ల వరకు లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో సాయపడుతాయి. సహజ పద్దతుల్లో లైంగిక సంతోషాన్ని పెంచడంలో సాయపడే ఫుడ్స్ గురించి ఇప్పుడు మరిన్ని విషయాలను తెలుసుకుందాం..
❂ అశ్వగంధ
భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో అశ్వగంధ ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్నో ఆరోగ్య సమస్యలను అడ్డుకోవడంతో పాటు లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్రపోషిస్తుంది. అశ్వగంధ స్త్రీ, పురుషులలో స్టామినాను పెంచడంలో రా రాజులా ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి లైంగిక సత్తువను పెంచడంలో అశ్వగంధ సాయపడుతుంది.
❂ బాదం
బాదం పప్పులు లైంగిక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతాయి. బాదంలోని విటమిన్లు, హెల్తీ ఫ్యాట్స్ పడక గదిలో రెచ్చిపోయేలా చేస్తాయి. అందుకే, పడక గదికి వెళ్లే ముందు బాదం పప్పులు తీసుకోవడం మాంచి సత్తువను అందిస్తాయి.
❂ పుచ్చకాయ
పుచ్చకాయ వేసవిలో చల్లదనం కలిగించడంతో పాటు పడకగదిలో ఒంట్లో సెగలు రేపడంలో ఉపయోగపడుతాయి. పుచ్చకాయ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఫలితంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. బెడ్రూంలో హాయిగా ఎంజాయ్ చేసేలా సాయపడుతుంది.
❂ కుంకుమపువ్వు
కుంకుమ పువ్వుతో ఎన్నో లాభాలున్నాయి. అత్యంత ఖరీదైన ఈ కుంకుమ పువ్వు కామోద్దీపనలను పెంచడంలో అత్యంత కీలకగా పని చేస్తుంది. ఆ పనికి ముందు పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగడం వల్ల లైంగిక హర్మోర్లు పెరుగుతాయి. ఫలితంగా శృంగారంలో ఆహ్లాదాన్ని పొందే అవకాశం ఉంటుంది.
❂ డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్లు రుచితో పాటు శృంగార సంతోషాన్ని పెంచుతాయి. డార్క్ చాక్లెట్స్ లో బోలెడు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పురుషులలో డార్క్ చాక్లెట్స్ అదనపు స్టామినాను అందిస్తాయి. చాలా సేపు శృంగార సంతోషాన్ని పెంచడంలో సాయపడుతాయి.
❂ దానిమ్మ
దానిమ్మ పండును పవర్ హౌస్ గా పిలుస్తారు. ఈ పండు చక్కటి శృంగార ఆనందానికి కలిగిస్తుంది. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని, మనసును మరింత ఉత్తేజ పరుస్తాయి. చాలా సేపు సత్తువను అందించడంలో దానిమ్మ సాయపడుతుంది. సంపూర్ణ లైంగిక ఆనందాన్ని కలిగించడంలో దానిమ్మ ఉపయోగపడుతుంది.
❂ మెంతి గింజలు
మెంతులు లైంగిక సంతోషాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. లైంగిక శక్తిని పెంచే మిటమిన్లు మెంతులలో పుష్కలంగా ఉంటాయి. మెంతులలోని మినరల్స్ ఎక్కువ శక్తిని అందించడంలో సాయపడుతాయి. లైంగిక సంతోషాన్ని పెంచడంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయి.
❂ ఖర్జూర పండ్లు
ఖర్జూర పండ్లు రుచితో పాటు లైంగిక శక్తిని పెంచుతాయి. శరీరంలో ఇన్ స్టంట్ శక్తిని పెంచడంలో ఉపయోగపడుతాయి. ఖర్జూర పండ్లలోని విటమిన్లు, ఖనిజాలు లైంగిక హార్మోన్ల ఉత్పత్తిని పెంచడంలో సాయపడుతాయి. రాత్రిపూట పడక గదిలో రేసు గుర్రంలా రెచ్చిపోవడంలో సాయపడుతాయి.
Read Also: మగాళ్లలో టెస్టోస్టెరాన్ పెరగాలంటే, సింఫుల్ గా ఈ పని చేయండి!