IRCTC Tickets Cancellation: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ద్వారా నిత్యం లక్షలాది మంది రైల్వే టికెట్లు బుక్ చేసుకుటారు. ఆయా కారణాలతో వేలాది మంది టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే, టికెట్ రద్దుకు సంబంధించిన కీలక నియమాలు, మార్గదర్శకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కన్ఫామ్ టికెట్ల రద్దు
⦿ కన్ఫామ్ చేయబడిన టికెట్ల రద్దు ఛార్జీలు టిక్కెట్ క్లాస్, క్యాన్సిలేషన్ టైమ్ ఆధారంగా మారుతూ ఉంటాయి. ప్రయాణానికి 48 గంటల ముందు రద్దు చేసినప్పుడు ఛార్జీలు ఎలా ఉంటాయో చూద్దాం.
⦿ సెకండ్ క్లాస్ కోసం రూ. 60, AC 2 టైర్/ఫస్ట్ క్లాస్ కోసం రూ. 200, AC 3 టైర్/AC చైర్ కార్/AC 3 ఎకానమీకి రూ.180, స్లీపర్ క్లాస్ కోసం రూ.120, AC ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోసం రూ.240 ఛార్జీలు వసూళు చేస్తారు.
⦿ టికెట్ క్యాన్సిల్ చేయడంతో పాటు రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు TDR ఆన్‌లైన్‌లో ఫైల్ చేయకుంటే ఎలాంటి ఛార్జీ రీఫండ్ చేయబడదు. RAC టిక్కెట్ క్యాన్సిల్ చేసి, రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు TDR ఆన్‌లైన్‌లో సబ్ మిట్ చేయకుండా ఛార్జీ రీఫండ్ ఇవ్వరు.
48 నుండి 12 గంటలలోపు రద్దు ఛార్జీలు
⦿ రైలు ప్రయాణానికి 48 నుంచి 12 గంటల ముందు రద్దు చేసుకున్నప్పుడు టికెట్ ఛార్జీలో 25% నుంచి 50% వరకు తీసుకుంటారు. ప్రయాణీకులకు టికెట్ ఛార్జీలో కొంత శాతాన్ని క్యాన్సిల్ ఛార్జ్ గా వసూళు చేస్తారు.
⦿ టికెట్ ఛార్జీలో 25% లేదా 50%గా క్యాన్సిలేషన్ ఛార్జ్ ఉంటుంది. వీటిలో ఏది ఎక్కువ మొత్తంలో ఉంటే దాని ప్రకారం తీసుకుంటారు. లేదంటే, ఇది గతంలోని కనీస ఛార్జీకి సమానంగా ఉంటుంది.
చార్ట్ తయారీ తర్వాత రద్దు చేసుకుంటే?
⦿ మరికొద్ది గంటల్లో రైలు ప్రయాణం ప్రారంభం అవుతుందనగా చార్ట్ ను సిద్ధం చేస్తారు. ఈ సమయంలో క్యాన్సిల్ అనేది ఉండదు. అప్పుడు, ప్రయాణీకులు IRCTC వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా TDRను సబ్ మిట్ చేసుకోవచ్చు.
⦿ నిర్ధారించబడిన రిజర్వేషన్లను రద్దు చేయకున్నా, రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు TDRని ఆన్‌లైన్‌లో ఫైల్ చేయకున్నా రీఫండ్ ఉండదు.
రద్దు చేసిన టికెట్లకు సంబంధించి రీఫండ్ ప్రక్రియ
⦿ క్యాన్సిల్ చేసిన టికెట్లకు సంబంధించి రీఫండ్ ను IRCTC పలు రకాలుగా అందిస్తుంది. చార్టుల తయారీకి ముందు, చార్టుల తయారీ తర్వాత క్యాన్సిలేషన్ ఆధారంగా రీఫండ్ ఇస్తుంది.
⦿ సాధారణంగా 5 నుంచి 7 వర్కింగ్ డేస్ లోగా ఛార్జీలను తీసివేసిన తర్వాత రీఫండ్ ప్రాసెస్ చేయబడుతాయి. బుకింగ్ ప్రక్రియలో ఉపయోగించిన చెల్లింపు విధానం ఆధారంగా టైమ్ మారే అవకాశం ఉంటుంది.
⦿ IRCTC నిబంధనల ప్రకారం ప్రయాణీకులు నిర్ణయించిన వ్యవధిలో రీఫండ్ పొందుతారు.
రద్దు ప్రక్రియ, ఛార్జీలు
⦿ IRCTC ద్వారా టికెట్ల రద్దు అనేది ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా అందించబడుతుంది. చార్ట్ తయారీకి ముందే క్యాన్సిలేషన్ పూర్తి చేయాలి.
⦿ ఈ టికెట్ క్యాన్సిలేషన్ సర్వీస్ రైల్వే కౌంటర్లలో అందుబాటులో లేదు.
⦿ టిక్కెట్ క్లాస్, బయలుదేరే ముందు టికెట్ క్యాన్సిల్ చేసిన టైమ్ ను బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి. కన్ఫామ్ చేసిన టిక్కెట్ల కోసం ఒక్కో ప్రయాణికుడికి రూ. 60 నుంచి రూ. 240 వరకు వసూలు చేస్తారు.
తత్కాల్ టిక్కెట్ క్యాన్సిల్ రీఫండ్ పాలసీ
⦿ కన్ఫామ్ చేసిన తత్కాల్ టిక్కెట్ల రద్దుకు ఎలాంటి రీఫండ్ ఉండదు. RAC, వెయిట్ లిస్ట్ టిక్కెట్ల కోసం రూపొందించబడిన నిర్దిష్ట మార్గదర్శకాలతో రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
⦿ నిర్ధారిత, వెయిటింగ్ లిస్ట్ స్టేటస్ తో కూడిన పార్టీ, కుటుంబ తత్కాల్ టిక్కెట్లను కలిగి ఉన్న ప్రయాణీకులు, బయలుదేరే ముప్పై నిమిషాల ముందు తత్కాల్ టిక్కెట్ రద్దు చేయడానికి సరెండర్ చేసినట్లయితే, రీఫండ్ పొందే అవకాశం ఉంది.
⦿ చార్ట్ ప్రిపరేషన్ వరకు RAC, వెయిట్ లిస్ట్ చేసిన టిక్కెట్ హోల్డర్‌లకు అందించే కన్ఫామ్ రిజర్వేషన్లు సంబంధిత క్యాన్సిల్ ఛార్జీలకు లోబడి ఉంటాయి.