Hair Wash: చలికాలంలో జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. విపరీతమైన చలి కారణంగా చాలా మంది జుట్టును వేడి నీటితో వాష్ చేయడం ప్రారంభిస్తారు. అయితే, వేడి నీటితో తలస్నానం చేయడం జుట్టుకు హానికరం. ఇలా చేస్తే.. జుట్టు పొడిగా మారుతుంది. అంతే కాకుండా మెరుపును కోల్పోతుంది. జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి వింటర్ సీజన్‌లో జుట్టును ఎలాంటి నీటితో వాష్ చేయాలి. వేడి నీళ్లతో తలస్నానం చేస్తే కలిగే నష్టాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా శీతాకాలంలో వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టు వెచ్చగా ఉంటుందని అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల మీ జుట్టుకు హాని కలుగుతుంది. చాలా వేడిగా ఉండే నీరు మీ జుట్టులోని సహజ తేమను తీసివేసి, పొడిగా, నిర్జీవంగా మారుస్తాయి.
తలస్నానానికి ఎలాంటి నీటిని ఉపయోగించాలి ?
గోరువెచ్చని నీరు ఉత్తమం: చలికాలంలో తలస్నానానికి ఎప్పుడూ గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. మరీ వేడిగానీ,మరీ చల్లటి నీటినిగానీ ఉపయోగించకూడదు.
చల్లటి నీటితో ప్రయోజనం: మీరు మీ జుట్టు యొక్క మెరుపును పెంచుకోవాలనుకుంటే, చివర్లో మీ జుట్టును చల్లటి నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్ తగ్గి జుట్టు మెరిసిపోతుంది.
నూనె రాయండి: తలస్నానానికి ముందు, కొద్దిగా నూనెను జుట్టుకు రాయండి. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె ఇందుకు ఉత్తమం. ఆయిల్‌తో జుట్టు మూలాలకు బాగా మసాజ్ చేసి 30 నిమిషాలు లేదా గంట పాటు అలాగే ఉంచండి.
షాంపూ : శీతాకాలంలో సల్ఫేట్ , పారాబెన్ ఫ్రీ షాంపూ ఉపయోగించండి. ఈ షాంపూలు మీ జుట్టుకు తేమను అందిస్తాయి. అంతే కాకుండా జుట్టు పొడిబారకుండా నిరోధిస్తాయి.
కండీషనర్ వాడకం: షాంపూ చేసిన తర్వాత ఖచ్చితంగా కండీషనర్ వాడండి. కండీషనర్ మీ జుట్టును మృదువుగా , మెరిసేలా చేస్తుంది.
హెయిర్ మాస్క్: వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ వేయండి. హెయిర్ మాస్క్‌లు మీ జుట్టుకు లోతైన పోషణను అందిస్తాయి.
టవల్ తో రుద్దకండి: జుట్టు కడిగిన తర్వాత, టవల్‌తో రుద్దకండి. కానీ నీటిని తొలగించడానికి టవల్ సున్నితంగా ఉపయోగించండి.
హీట్ స్టైలింగ్ ఉత్పత్తులను నివారించండి: వీలైనంత వరకు హీట్ స్టైలింగ్ సాధనాలను నివారించండి. మీరు హీట్ స్టైలింగ్ సాధనాలను ఉపయోగిస్తుంటే మాత్రం హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేని తప్పకుండా ఉపయోగించుకోండి.
హెయిర్ సీరమ్: జుట్టును విడదీయడానికి హెయిర్ సీరమ్ ఉపయోగించండి.
Also Read: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. ఇది ఒక్క సారి వాడండి చాలు
ఇతర చిట్కాలు:
శీతాకాలంలో వారానికి 2-3 సార్లు మాత్రమే జుట్టును వాష్ చేయండి. ఎక్కువగా జుట్టు వాష్ చేయడం వల్ల జుట్టు పొడిగా మారుతుంది. రాత్రి పడుకునే ముందు జుట్టుకు నూనె తప్పకుండా రాయండి.