Nindu Noorella Saavasam Serial Today Episode : మిస్సమ్మ ఎంత అడిగినా నాకు ఏం గుర్తు రావడం లేదు మిస్సమ్మ అంటుంది అంజు. ఇంతలో నిర్మల ఆ మంత్రగాడు ఏదో చేసి ఉంటాడు అని చెప్తుంది. రామ్మూర్తి కూడా అదే అంటాడు. డాక్టర్ అంజు పాపను రెస్ట్ తీసుకోమన్నాడు.. నవ్వు ఇబ్బంది పెట్టకమ్మా అని రామ్మూర్తి చెప్పగానే.. అంజును పడుకోబెడుతుంది మిస్సమ్మ.
గార్డెన్‌లో నిలబడ్డ ఆరు ఇంటి వైపు చూస్తుంది. గుప్త వచ్చి ఏదో అనబోతూ.. ఆగిపోగానే.. ఏదో అనబోయారు గుప్త గారు అనండి.. అంటుంది.. మేము అనుటకు నీవు వినుటకు ఏమీ లేదు బాలిక.. నేను చెప్పదలిచిందో ఏమిటో నీకు బాగా తెలియును అంటాడు గుప్త. దీంతో నేను ఓడిపోయాను గుప్తగారు. మళ్లీ మనోహరి చేతిలో విధి చేతిలో నేను పూర్తిగా ఓడిపోయాను గుప్త గారు. ఈరోజుతో నాకు వచ్చిన శక్తిని ఉపయోగించి మనును ఆయన జీవితంలోంచి శాశ్వతంగా దూరం చేయాలనుకుని చేయలేకపోయాను అంటూ బాధపడుతుంది.
ఆ ఘోరా నుంచి తప్పించుకోవడం కూడా విజయమే బాలిక.. ఆ ఘోరా నిన్ను బంధించి ఉంటే ఎంతటి ప్రమాదం జరిగి ఉండేదో అర్థం అవుతుందా..? అంటాడు గుప్త.. మనును ఇంట్లోంచి పంపించకుండా నేను వెళ్లిపోతే ఏం జరుగునో మీకు తెలుసు కదా గుప్తగారు అంటుంది. ఆరు. ఏమి జరుగవలెనని లిఖించిబడి ఉండునో అదియే జరుగును బాలిక. దీనిని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదియే నిజం అటాడు గుప్త. నువ్వు ఉన్నా లేకున్నా జరిగేది జరుగుతుంది అని గుప్త చెప్తాడు.
మీరు అనుకున్నంత సులువుగా నేను అనుకోలేకపోతున్నాను అంటూ ఆరు ఎమోషనల్ అవుతుంది. గుప్త ఎంత కన్వీన్స్ చేసినా ఆరు వినదు. ఈ ఒక్క రాత్రి అయినా ప్రశాంతంగా నీ కుటుంబంతో గడుపు.. అని గుప్త చెప్పగానే.. నేను ఎక్కడికి వెళ్లను.. నేను కొలిచే దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నా కథ ఇంకా పూర్తి కాలేదు అంటుంది ఆరు. నీ కథ ఎప్పుడో పూర్తి అయింది బాలిక అంటాడు గుప్త.. అయినా వినకుండా ఆరు ఇంట్లోకి వెళ్తుంది.
మిస్సమ్మ, రామ్మూర్తికి పాలు తీసుకెళ్లి ఇస్తుంది. రామ్మూర్తి పాలు అక్కడ పెట్టమని చెప్పగానే సరే మీతో కాసేపు మాట్లాడి పడుకుంటాను నాన్నా అంటూ రామ్మూర్తి పక్కన కూర్చుంటుంది. దీంతో రామ్మూర్తి అమ్మా నువ్వు సంతోషంగానే ఉన్నావు కదమ్మా అని అడుగుతాడు. అయ్యో చాలా సంతోషంగా ఉన్నాను నాన్నా ఒక కుటుంబం తోడు ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. అంటూ ఆరు చెప్పగానే.. నువ్వు సంతోషంగా ఉన్నావు నాకు అదే చాలు తల్లి అంటాడు రామ్మూర్తి… నా సంతోసం సరే మీ బాధ గురించి చెప్పండి నాన్నా అని మిస్సమ్మ అడగ్గానే..
నాకు బాధేంటి అమ్మా .. నువ్వు సంతోషంగా ఉన్నావు.. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలమ్మా అంటాడు రామ్మూర్తి.. అది నాకు అర్థం కావడం లేదు నాన్నా.. మొన్న మీరు ఆయన కోసం అంత కోపంగా ఇంటికి వచ్చారు. తర్వాత మౌనంగా ఉండిపోయారు. ఆయన ఏమీ చెప్పడం లేదు. రాథోడ్‌ను అడిగితే నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అంటాడు. ఫ్లీజ్ అక్క విషయంలో నిజం చెప్పండి నాన్నా.. ఆ నిజం ఎంత బాధపెట్టినా నేను తట్టుకోగలను అంటుంది మిస్సమ్మ.
ఆ నిజం నీకు తెలస్తే నీ గుండె ముక్కలు అవుతుందమ్మా.. ఈ నిజం.. ఈ బాధ నాతోనే ఆగిపోవాలి అని మనసులో అనకుంటూ ఎమోషనల్ అవుతాడు రామ్మూర్తి. అక్క గురించి ఏమీ తెలియదమ్మా .. ఇది నిజం అంటాడు రామ్మూర్తి. సరే అంటూ పాలు ఇచ్చి వెళ్లిపోతుంది మిస్సమ్మ.
అమర్ ఆస్తికలు తీసుకుని ఎయిర్‌ఫోర్ట్‌కు ఎలా వెళ్లేది.. మొత్తం స్కెచ్ వేసి తన అనుచరులకు చెప్తాడు. అందరం కలిసి అమర్ కుటుంబం మీద దాడి చేస్తాం అంటాడు. అమర్ కారు ఇక్కడికి ఎలా వస్తుంది. అని అడుగుతారు. అమరేంద్ర డ్రైవర్ రాథోడే మనం చెప్పినట్టు కారు తీసుకొచ్చి ఆపేస్తాడు అని రాథోడ్‌ను తన మంత్రాలతో ట్రాప్ చేశానని చెప్తాడు ఘోర. మిగతా అఘోరాలు ఆశ్చర్యపోతారు. సరైన సమయంలో సరైన అస్త్రం ఉపయోగించావు ఘోర అంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?