BigTV English

Significance of Eating Onion: నెల రోజులు ఉల్లిపాయలు తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

Significance of Eating Onion: నెల రోజులు ఉల్లిపాయలు తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

Significance of Eating Onion: వంటలో ఉల్లిపాయలు ముఖ్యమైన పదార్థంగా నిలుస్తాయి. వివిధ పోషక విలువలతో పాటు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే ఉల్లిపాయలు వంటలకు స్పెషల్ టెస్ట్ అందిస్తాయి. ప్రతి రోజు మనం వాడుకునే రకరకాల కూరల నుంచి బిర్యానీలు, స్నాక్స్ వంటి ఆహార పదార్థాల్లో ఉల్లిపాయలు లేకపోతే దానికి అంతగా రుచి రాదు. కాకపోతే ఉల్లిపాయలతో వచ్చిన చిక్కేంటంటే అవి తిన్న తర్వాత నోటి నుంచి వచ్చే వాసన చాలా చికాకుగా ఉంటుంది. ఆ ఒక్క కారణంతోనే ఉల్లిపాయలకు కొంత మంది దూరంగా ఉంటారు.


ఒక నెల పాటు ఉల్లిపాయలు తినడం మానేస్తే ఏం జరుగుతుందని మీరెప్పుడైనా ఆలోచించారా..? ఆనియన్స్‌కు దూరంగా ఉంటే శరీరానికి మంచి జరుగుతుందా ? లేక చెడు జరుగుతుందా? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయలకు నెల రోజుల పాటు దూరంగా ఉండడం వల్ల మలబద్ధకం నుంచి కంటిచూపు వరకు చాలా సమస్యలు వస్తాయంటే మీరు నమ్ముతారా సీనియర్ డైటీషియన్లు నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం.. ఉల్లిపాయల్లో మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.


Also Read: Dandruff Control Tips: చుండ్రు సమస్యతో విసిగిపోయారా ? ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి

ఉల్లిపాయల్లో ఎక్కువ మొత్తంలో లభించే విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా కణాల ఎదుగుదలకు, ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడతాయి. ఉల్లిపాయల్లో అలిసిన్,క్వెర్సెటిన్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్యాన్సర్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు,ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి తగ్గించడానికి సహాయపడతాయి.

నెల రోజులు ఉల్లిపాయలకు దూరంగా ఉంటే ఏం జరుగుతుంది.

ఉల్లిపాయలు తినడం నెల రోజులు మానేస్తే శరీరంలో పెద్దగా మార్పులు జరగకపోవచ్చు. కానీ చిన్నచిన్న మార్పులు కచ్చితంగా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయల్లో జీర్ణవ్యవస్థకు అవసరమైన డైటరీ ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం వల్ల మలబద్ధకంతో పాటు జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా ఉల్లిపాయలు తినకపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.

Also Read: వర్షాకాల వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

ఉల్లిపాయలు తినకపోతే మాంగసీస్, పొటాషియం వంటి ఖనిజాలతోపాటు విటమిన్ సి, విటమిన్ బి6, పోలేట్ లోపాలు తలెత్తుతాయి. ఫలితంగా శరీరంలో అలసట పెరుగుతుంది. రక్తం గడ్డకట్టడం లాంటి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. కాబట్టి ఉల్లిపాయలు తినడం మనేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

Tags

Related News

Stress And Heart attack: స్ట్రెస్ ఎక్కువైతే.. హర్ట్ ఎటాక్ వస్తుందా ?

Health Benefits: ఈ ఒక్క చపాతీ తింటే చాటు.. ఆ సమస్యలన్నీ మాయం

Magnesium Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? జాగ్రత్త

Healthy Looking Skin: ఆరోగ్యవంతమైన చర్మం కోసం.. ఎలాంటి చిట్కాలు పాటించాలి ?

Sleep: తగినంత నిద్ర ఎందుకు ముఖ్యమంటే ?

Drink For Hair Fall: ఈ డ్రింక్స్‌తో.. హెయిర్ ఫాల్‌కు చెక్

Big Stories

×