BigTV English

Trump Assassination Attempt: ట్రంప్‌పై దాడి చేసిన షూటర్ వివరాలు.. అతని తండ్రి ఏమన్నాడంటే..?

శనివారం సాయంత్రం పెన్సిల్ వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఉండగా.. ఆయనపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ రక్షణ సిబ్బంది వెంటనే అతడిని గుర్తించి ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆ షూటర్ చనిపోయాడు.

Trump Assassination Attempt: ట్రంప్‌పై దాడి చేసిన షూటర్ వివరాలు.. అతని తండ్రి ఏమన్నాడంటే..?

Trump Assassination Attempt Update: శనివారం సాయంత్రం పెన్సిల్ వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఉండగా.. ఆయనపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ రక్షణ సిబ్బంది వెంటనే అతడిని గుర్తించి ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆ షూటర్ చనిపోయాడు.


అమెరికా విచారణ ఏజెన్సీ చనిపోయిన షూటర్ గురించి వివరాలు విడుదల చేసింది. ఆ షూటర్ పేరు థామస్ మేథ్యూ క్రూక్స్. పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్క్ లో నివాసి. అయితే అందరూ అనుకున్నట్లు ఆ షూటర్ ట్రంప్ వ్యతిరేక పార్టీకి చెందిన వాడు. ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ సమర్థకులలో ఒకడు. బెథెల్ పార్క్ హై స్కూల్ నుంచి 2022లో డిగ్రీ పూర్తి చేసిన థామస్ బాగా చదివే వాడని.. మంచి విద్యార్థి అని పిట్స్ బర్ట్ ట్రిబూన్ రిపోర్ట్ తెలిపింది. అతనికి ఒకసారి 500 డాలర్ల ఫై స్టార్ అవార్డ్ కూడా లభించింది. 2022లో అతని గ్రాడుయేషన్ వేడుక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

గతంలో క్రూక్స్ రిపబ్లికన్ పార్టీలో ఓటర్‌గా పేరు కూడా నమోదు చేసుకున్నాడు. అయితే క్రూక్స్ ఇంతవరకు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. రాబోయే ఎన్నికలలో అతనికి ఓటు అర్హత ఉండేది. కానీ క్రూక్స్ ట్రంప్ పై ఎందుకు దాడి చేశాడో కారణం తెలియలేదని ఎఫ్‌బిఐ అధికారులు తెలిపారు. పైగా 2021లో క్రూక్స్ బైడెన్ ఎన్నికల ప్రచార ఏజెన్సీకి 15 డాలర్లు విరాళం కూడా ఇచ్చాడని సమాచారం.


Also Read: అబ్రహం లింకన్ నుంచి డోనాల్డ్ ట్రంప్ వరకు.. తుపాకీ దాడులకు గురైనవాళ్లు వీరే

క్రూక్స్ ట్రంప్ పై ఎందుకు దాడి చేశాడని.. అతని తండ్రి మాథ్యూ క్రూక్స్ (53) అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ఇప్పటి వరకు తన కొడుకు ఇలా ఎందుకు చేశాడో తెలీదని. తాను కూడా పోలీసుల విచారణ వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన తెలిపారు.

ట్రంప్ పై జరిగిన హత్యాయత్నంలో ఆయన కుడిచెవిపై భాగానికి బుల్లెట్ గాయమైంది. ఒక వ్యక్తి మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు.

Tags

Related News

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Afghanistan: బస్సులో చెలరేగిన మంటలు.. 71 మంది సజీవదహనం!

Russia Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తా! జెలెన్‌స్కీతో ట్రంప్ సంచలన భేటీ..

Congo Massacre: కాంగోలో దారుణం.. వెంటాడి మరీ 52 మందిని చంపేశారు

Big Stories

×