Paneer SideEffects| చాలా మంది శాకాహారులు పనీర్ అంటే ఇష్టంగా తింటారు. కొందరైతే ప్రతిరోజు తినే వారున్నారు. పనీర్ తినడం వల్ల ఎముకలకు బలం, వేగంగా జీర్ణక్రియ, కండరాల వృద్ధికి ప్రోటీన్ లభిస్తుంది. చర్మం, గుండె ఆరోగ్యానికి ఉపయోగకరం కావడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే, అధికంగా తింటే లాక్టోజ్ ఇన్టాలరెన్స్ లేదా మూత్రాశయ సమస్యలు ఉన్నవారికి అజీర్తి, ఉదరం ఉబ్బరం అంటే గ్యాస్ సమస్య, మూత్రపిండాలపై ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. అందుకే పనీర్ తినడంలో కూడా సమతుల్యత పాటించాలి.
పోషకాహార నిపుణుల ప్రకారం.. రోజుకు 100-200 గ్రాములు పనీర్ తినాలి. దీనికంటే ఎక్కువ తింటే డేంజర్.
పనీర్ లో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మినరెల్స్ ఎముకలు, పళ్ళను బలంగా ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అవసరం. ఇది ఆస్టియోపోరోసిస్ (బలహీన ఎముకల) వంటి ఎముకల సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
పనీర్లో అధిక ప్రోటీన్ ఉంటుంది. ఇది శాకాహారులకు ప్రోటీన్ కలిగిన ఉత్తమ ఆహారాలలో ఒకటి. ఇది కండరాల నిర్మాణం, మరమ్మత్తు వాటి బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత పనీర్ తినడం చాలా ఫలదాయకం.
పనీర్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఇది అనవసరమైన స్నాక్స్, జంక్ ఫుడ్ తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా, క్యాలరీలు తక్కువగా ఉండి, బరువు నియంత్రణలో సహాయకరంగా ఉంటుంది.
పనీర్ జీర్ణశక్తిని మెరుగుపరచగలదు. అయితే, ఇది సరిగ్గా వండిన పనీర్ కు వర్తిస్తుంది. కానీ పనీర్ సరిగా వండకపోయినా లేదా అధిక మోతాదు జీర్ణక్రియలో సమస్యలను కలిగించవచ్చు.
పనీర్లో ఉండే మోనోఅన్సాచురేటెడ్, పాలీఅన్‌సాచురేటెడ్ కొవ్వులు, పొటాషియం వంటి ఖనిజాలు గుండె ఆరోగ్యానికి మంచివి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. తక్కువ కొవ్వు ఉన్న పనీర్ ఎంపిక చేయడం మరింత మంచిది.
పనీర్ లో విటమిన్ ఏ ఉంటుంది. ఈ విటమిన్ కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది కంటి చూపుని మెరుగుపరచడంతో పాటు, రాత్రి వేళ కంటిచూపు తగ్గడం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
అధిక మోతాదులో పనీర్ తినడం వల్ల, ముఖ్యంగా సరిగా వండని పనీర్ అయితే, ఆహారం సరిగా జీర్ణం కాదు, పైగా కడుపు ఉబ్బడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.
పనీర్ పాల నుంచి తయారు అవుతుంది. కాబట్టి, ఇది లాక్టోజ్ కలిగి ఉంటుంది. లాక్టోజ్ ఇన్టాలరెన్స్ ఉన్న వ్యక్తులు దీనిని తినడం వల్ల వాపు, వాయువు, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కోవచ్చు.
పనీర్ లో అధిక మోతాదులో ప్రోటీన్, కాల్షియం ఉంటాయి. ఇవి మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించగలవు. ముఖ్యంగా ఇప్పటికే మూత్రపిండాల సమస్యలు ఉన్న వ్యక్తులు అధికంగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి.
ఫ్యాటీ లివర్, షుగర్ వ్యాధి, లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి రోగాలు ఉన్న వ్యక్తులకు, ప్రతిదినం పనీర్ తినడం వల్ల ఇబ్బందులు ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
ప్రయోజనాలు పొందడానికి మితంగా తినడం చాలా ముఖ్యం. రోజుకు 100-200 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు.
అధిక కొవ్వు సేవించకుండా ఉండటానికి తక్కువ కొవ్వు ఉన్న పనీర్ లేదా స్కిమ్డ్ మిల్క్ తో చేసిన పనీర్ ను ఎంచుకోండి.
మీ అన్ని పోషక అవసరాలకు పనీర్ మీద మాత్రమే ఆధారపడకండి. మీ ఆహారంలో ప్రోటీన్, పోషకాలు కలిగిన ఇతర ఫుడ్స్‌ని కూడా చేర్చండి.
మీ ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోండి:
మూత్రపిండాల సమస్యలు, డెయిరీ అలెర్జీలు, లేదా లాక్టోజ్ ఇన్టాలరెన్స్ ఉన్న వ్యక్తులు పనీర్ ను రోజూ తినాలనుకుంటే ముందుగా డాక్టర్‌ని సంప్రదించాలి.
Also Read: 102 సంవత్సరాల లేటు వయసులో బలమైన గుండె.. ఆ వృద్ధుడి సీక్రెట్ ఏంటో తేల్చేసిన వైద్యులు!