BigTV English

Waterborne Diseases: వర్షాకాల వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

Waterborne Diseases: వర్షాకాల వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

Waterborne Diseases: వేసవితో పోలిస్తే వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ వర్షపు నీటితో అనేక వ్యాధులు వస్తాయి. సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. జాగ్రత్తలు పాటించకపొతే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అందుకే రుతుపవనాలు మారిన వెంటనే కొన్ని విషయాలపై జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
వర్షాల వల్ల కలుషిత నీటికుంటలో, కాలువల్లో, ఇంటి పరిసరాల్లో నీరు చేరడం వల్ల నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 80% వ్యాధులు నీటి ద్వారానే వ్యాపిస్తాయి. ఇలా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులకు వాటర్ బర్న్ వ్యాధులు అంటారు.నిల్వ ఉన్న నీరు దోమలకు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలకు సంతానోత్పత్తి ప్రదేశం తయారవుతుంది. ఇవి వేగంగా పెరిగి వ్యాధులకు కారణమవుతాయి. వర్షాకాలంలో కలరా, టైఫాయిడ్ వంటి అనేక వ్యాధుల వ్యాప్తి పెరుగుతుంది. అంతేకాకుండాఈ సీజన్‌లో స్కిన్ ఇన్‌ఫెక్షన్లు కూడా చాలా వరకు పెరుగుతాయి.
తేమ కారణంగా:
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వైరస్ ,బ్యాక్టీరియాలు పెరుగుతాయి. దీంతో వైరల్ ఫీవర్, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో దోమలు కుట్టడం ద్వారా డెంగ్యూ, మలేరియా టైపాయిడ్ తో పాటు గాలి ద్వారా వ్యాపించే జబ్బులు జలుబు, గొంతునొప్పి వంటివి వస్తాయి.
వార్ బర్న్ వ్యాధులు నివారించడానికి మార్గాలు:


  • వర్షాకాలంలో బ్యాక్టీరియాలు, వైరస్‌లు మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఎప్పుడు కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. గోరువెచ్చని నీరు తాగాలి. ఫిల్టర్, వాటర్ ప్యూరిఫైయర్ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీళ్ల బాటిళ్లు తీసుకెళ్లడం మంచిది. రోడ్డు పక్కన లేదా ఎక్కడపడితే అక్కడ ఉన్న నీటిని తాగకండి.
  • వర్షాకాలంలో ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంతవరకు స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోండి. పానీపూరీలు, మసాలా పూరీలు, పావుబాజీ వంటి స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
  • తినడానికి ముందు చేతులు కడుక్కోవాలి.ఏదైనా తినడానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.ఈ చిన్న అలవాటు మిమ్మల్ని ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడుతుంది.
  • పండ్లు, కూరగాయలను ఈ సీజన్‌లో తప్పకుండా కడగాలి. బండి మీద వర్షపునీటి కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంటికి వచ్చిన వెంటనే మంచి నీటితో శుభ్రంగా కడగడం గుర్తుంచుకోవాలి.
  • దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వస్తాయి. దోమలు కుట్టకుండా ఉండాలంటే దోమతెరలు వాడటం మంచిది. నిద్రపోయేటప్పుడు ఫుల్ స్లీవ్స్ ధరించండి .
  • పోషకాహారం ఆహారం తినడం మంచిది. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఇవి వ్యాధులు రాకుండా నివారిస్తాయి.  అంతే కాకుండా చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే వాటిని తొలగించండి.


Related News

Stress And Heart attack: స్ట్రెస్ ఎక్కువైతే.. హర్ట్ ఎటాక్ వస్తుందా ?

Health Benefits: ఈ ఒక్క చపాతీ తింటే చాటు.. ఆ సమస్యలన్నీ మాయం

Magnesium Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? జాగ్రత్త

Healthy Looking Skin: ఆరోగ్యవంతమైన చర్మం కోసం.. ఎలాంటి చిట్కాలు పాటించాలి ?

Sleep: తగినంత నిద్ర ఎందుకు ముఖ్యమంటే ?

Drink For Hair Fall: ఈ డ్రింక్స్‌తో.. హెయిర్ ఫాల్‌కు చెక్

Big Stories

×