E-Paper
Advertisement

ఎప్పుడూ చేసుకునే దొండకాయ ఫ్రై బోర్ కొట్టిందా?ఈసారి ఇలా ట్రై చేయండి

ఎప్పుడూ చేసుకునే దొండకాయ ఫ్రై బోర్ కొట్టిందా?ఈసారి ఇలా ట్రై చేయండి
Advertisement

Dondakaya curry: ప్రతిరోజూ కూర ఏం చేయాలి అనే ఆలోచన చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అందులోనూ దొండకాయ కూర చేస్తే.. పిల్లలు పెద్దలు అందరూ ముఖం చాటేస్తుంటారు. ఎందుకంటే.. ఎప్పుడూ ఒకే రకమైన రోస్ట్ లేదా ఫ్రై చేయడం వల్ల ఆ టేస్ట్ బోర్ కొడుతుంది. ఈ సారి ఆ బోరింగ్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ, దొండ కాయతో ఒక డిఫరెంట్ మసాలా స్టైల్ కర్రీని ట్రై చేయండి. హోటల్ స్టైల్‌లో అదిరి పోయే రుచితో ఉండే ఈ రెసిపీ మీ ఇంటికి వచ్చే గెస్టులను కూడా ఫిదా చేస్తుంది.

1. కావలసిన పదార్థాలు :

దొండకాయలు – అర కిలో (సన్నగా పొడవుగా తరిగినవి)

Advertisement

ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)

టమాటాలు – 2 (పేస్ట్ లేదా ముక్కలు)

Advertisement

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్

కారం – 1.5 స్పూన్లు

ధనియాల పొడి – 1 స్పూన్

గరం మసాలా – అర స్పూన్

పసుపు – చిటికెడు

జీలకర్ర, ఆవాలు – 1 స్పూన్

నూనె – సరిపడా

తరిగిన కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం:

1.ఈ కూరకి అసలైన హైలైట్ దీనికి పట్టించే స్పెషల్ మసాలా. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో గుప్పెడు పల్లీలు (వేరుశనగ గుళ్లు), కొద్దిగా ఎండుకొబ్బరి ముక్కలు, రెండు స్పూన్ల నువ్వులు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కూరకి చిక్కదనాన్ని ఇవ్వడంతో పాటు అద్భుతమైన వాసన,టేస్ట్‌ను ఇస్తుంది.

2. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె పోయాలి. నూనె వేడెక్కాక తరిగిన దొండ కాయ ముక్కలను వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ..ఉంచి దోరగా వేయించుకోవాలి. దొండకాయలు బాగా మగ్గి రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో మరి కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే.. వరకు కలపాలి. తరువాత టమాటా ముక్కలు లేదా టమాటా ప్యూరీ వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం,ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

Also Read: గోరుచిక్కుడు వేపుడు ఇలా చేస్తే..అద్భుతమైన టేస్ట్

4. మసాలా బాగా మగ్గిన తర్వాత ముందుగా.. సిద్ధం చేసుకున్న పల్లీ-నువ్వుల పొడి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఆ మసాలాలో ముందుగా వేయించి.. పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి, మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు, అర కప్పు నీళ్లు పోసి మూతపెట్టి సన్నని మంటపై 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. నూనె పైకి తేలుతున్నప్పుడు గరం మసాలా, కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.

అంతే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ లో గుమగుమలాడే దొండకాయ మసాలా కూర రెడీ! వేడి వేడి అన్నంతో పాటు రాగి సంగటి లేదా చపాతీలోకి ఇది నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ సారి దొండకాయలు తెచ్చినప్పుడు ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా కొత్త రెసిపీ ట్రై చేయండి.

Related News

గోధుమపిండితో చల్ల పునుగులు..మైదా లేకుండానే బెస్ట్ టేస్ట్

నిద్రలోనే పక్షవాతం రావచ్చు.. ఉదయం లేవగానే ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదు

రోజూ బ్రష్ చేస్తున్నా నోటి దుర్వాసన తగ్గడం లేదా? దీనికి కారణాలు ఇవే

కత్తెర సరిగ్గా కట్ చేయడం లేదా? ఎక్కువకాలం పదునుగా ఉండాలంటే ఇంట్లోనే ఇలా చేయండి

ఎండ లేకపోయినా బట్టలు త్వరగా ఆరిపోతాయి.. ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే సరి

‘ఐ లవ్ యూ’ చెప్పడం మాత్రమే సరిపోదు.. మీ లవర్‌కు నమ్మకం కలిగించడం చాలా ముఖ్యం

గార్డెనింగ్ టిప్స్.. మొక్కలు ఎండిపోతున్నాయా? కిచెన్‌లోని ఈ వ్యర్థాలతో ఎరువు తయారు చేయండి

Big Stories

Advertisement
×