E-Paper
Advertisement

గోధుమపిండితో చల్ల పునుగులు..మైదా లేకుండానే బెస్ట్ టేస్ట్

గోధుమపిండితో చల్ల పునుగులు..మైదా లేకుండానే బెస్ట్ టేస్ట్
Advertisement

Challa punugulu: ప్రస్తుతం జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ ఇంట్లోనే హెల్దీగా రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వర్షా కాలం లేదా చలికాలం సాయంత్రం వేళల్లో.. వేడివేడి పునుగులు తింటే ఆ మజాయే వేరు. అయితే రెగ్యులర్‌గా మైదాతో చేసుకునే పునుగులకు బదులుగా, ఆరోగ్యకరమైన గోధుమ పిండితో చల్ల పునుగులను ట్రై చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. అసలు నూనె పీల్చకుండా రుచికరండా ఉండే ఈ రెసిపీ తయారీ విధానం చాలా ఈజీ.

కావలసిన పదార్థాలు:

గోధుమపిండి -2 కప్పులు

Advertisement

పుల్లటి పెరుగు -1 కప్పు (పెరుగు ఎంత పుల్లగా ఉంటే పునుగులు అంత రుచిగా వస్తాయి)

జీలకర్ర -1 టీస్పూన్

Advertisement

పచ్చిమిర్చి -2 లేదా 3 (సన్నగా తరిగినవి)

వంట సోడా -చిటికెడు

ఉప్పు-రుచికి సరిపడా

నూనె-డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:

1.ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో కప్పు పుల్లటి పెరుగు వేయాలి. ఆ పెరుగులో తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా, జీలకర్ర వేసి చేతితో బాగా స్మూత్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేస్తూ.. ఉండలు లేకుండా కలుపుకోవాలి. వీలైనంత వరకు నీళ్లు కలపకుండా.. కేవలం పెరుగుతోనే పిండిని కలపడానికి ప్రయత్నించాలి.ఒక వేళ పిండి గట్టిగా అనిపిస్తే.. కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు చిలకరించుకోవాలి. పిండిని పునుగుల కన్సిస్టెన్సీ వచ్చేలా సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు చేత్తో పైకి కిందకు బాగా బీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిండిలోకి గాలి చేరి పునుగులు దూదిలా సాఫ్ట్‌గా వస్తాయి.

3.పిండిని బాగా కలుపుకున్నాక అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కావాలంటే.. కొద్దిగా కరివేపాకు వేసి కలపాలి. ఆ తర్వాత గిన్నెపై మూతపెట్టి కనీసం 1 నుంచి 2 గంటల పాటు నాననివ్వాలి. పిండి ఎంత బాగా నానితే పునుగులు అంత పర్ఫెక్ట్‌గా పొంగుతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరి పడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడి అయ్యే వరకూ ఆగాలి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, చేతిని కొద్దిగా నీళ్లతో తడుపుకుంటూ పిండిని చిన్న చిన్న పునుగులుగా నూనెలో వదలాలి.

Also Read: వెజ్ శాండ్విచ్..ఒక్క సారి తింటే టేస్ట్ మరచిపోలేరు!

3. కడాయికి సరిపడా పునుగులు వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో.. ఉంచి అటుఇటు తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల పునుగులు బయట కరకరలాడుతూ..లోపల గుల్లగా వస్తాయి. నూనె కూడా ఎక్కువగా పీల్చవు. వీటిని టిష్యూ పేపర్‌లోకి.. తీసుకుని నూనె పీల్చుకునే వరకు ఆగాలి.

అంతే టేస్టీగా, హెల్దీగా గోధుమ పిండితో తయారుచేసిన చల్ల పునుగులు రెడీ! వీటిని పల్చటి పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే రుచి అమృతంలా ఉంటుంది. ఈ ఈవెనింగ్ మీ ఇంట్లో వాళ్లకు ఇలా చేసి పెట్టి సర్ప్రైజ్ చేయండి!

Related News

ఎప్పుడూ చేసుకునే దొండకాయ ఫ్రై బోర్ కొట్టిందా?ఈసారి ఇలా ట్రై చేయండి

నిద్రలోనే పక్షవాతం రావచ్చు.. ఉదయం లేవగానే ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదు

రోజూ బ్రష్ చేస్తున్నా నోటి దుర్వాసన తగ్గడం లేదా? దీనికి కారణాలు ఇవే

కత్తెర సరిగ్గా కట్ చేయడం లేదా? ఎక్కువకాలం పదునుగా ఉండాలంటే ఇంట్లోనే ఇలా చేయండి

ఎండ లేకపోయినా బట్టలు త్వరగా ఆరిపోతాయి.. ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే సరి

‘ఐ లవ్ యూ’ చెప్పడం మాత్రమే సరిపోదు.. మీ లవర్‌కు నమ్మకం కలిగించడం చాలా ముఖ్యం

గార్డెనింగ్ టిప్స్.. మొక్కలు ఎండిపోతున్నాయా? కిచెన్‌లోని ఈ వ్యర్థాలతో ఎరువు తయారు చేయండి

Big Stories

Advertisement
×