E-Paper
Advertisement

గోరుచిక్కుడు వేపుడు ఇలా చేస్తే..అద్భుతమైన టేస్ట్

గోరుచిక్కుడు వేపుడు ఇలా చేస్తే..అద్భుతమైన టేస్ట్
Advertisement

Goru chikkudu fry recipe: కూరగాయల మార్కెట్‌కు వెళితే కచ్చితంగా.. మన కంట్లోపడే కూరగాయల్లో గోరుచిక్కుడు ఒకటి.చాలా మందికి ఇవి ఇష్టమైతే, మరికొందరు వీటిని వండటానికి కాస్త మొహమాటపడతారు. సరైన పద్ధతిలో ఉడికించి, తగిన మసాలాలు వేసి వేయిస్తే.. ఈ కూర ఇచ్చే రుచి మరే ఇతర కూర ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫైబర్, విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మన అమ్మమ్మల కాలం నాటి స్టైల్‌లో ఈ గోరుచిక్కుడు ఫ్రైని ఎలా తయారు చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం.

కావలసిన పదార్థాలు:

గోరుచిక్కుడు కాయలు – అర కేజీ (నార తీసి ముక్కలుగా తరిగినవి)

Advertisement

పల్లీలు – అర కప్పు

ఉల్లిపాయ- 1 (సన్నగా తరిగినవి)

Advertisement

పచ్చిమిర్చి -3 లేదా 4

వెల్లుల్లి రెబ్బలు -6 లేదా 7 (కచ్చాపచ్చాగా దంచినవి)

ఎండుమిర్చి -2

కారం -1 స్పూన్ (రుచికి సరిపడా)

పసుపు -అర స్పూన్

పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు)-1 స్పూన్

కరివేపాకు -రెండు రెమ్మలు

నూనె -తగినంత

ఉప్పు -రుచికి సరిపడా

తయారీ విధానం:

1.మొదటగా గోరు చిక్కుడు కాయల చివరలను తుంచి, నార ఉంటే.. తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి ఈ ముక్కలను ఉడికించాలి. ముక్కలు పూర్తిగా మెత్తగా కాకుండా.. సుమారు 80 శాతం ఉడికేలా చూసుకోవాలి. ఆ తర్వాత నీరంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి పల్లీలను దోరగా వేయించాలి. అవి వేగాక వాటిని తీసి మిక్సీ జార్‌లో వేసి, అందులో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి కూరకి అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది.

Also Read: వంకాయ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేయండి..రుచి అద్దిరిపోతుంది!

3. అదే బాండీలో మరో రెండు స్పూన్ల నూనె పోసి వేడి చేయాలి.నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి చిటపటలానివ్వాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

4. ఉల్లిపాయలు వేగాక ముందుగా.. ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలను అందులో వేయాలి. దీనికి సరి పడా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. మంటను మీడియంలో ఉంచి, కూర కొద్దిగా.. క్రిస్పీగా మారే వరకు వేయించాలి.

5. చివరిగా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పల్లీ-వెల్లుల్లి పొడిని కూరలో చల్లాలి. ఆ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలా.. మరో రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే..గుమగుమలాడే ట్రెడిషనల్ గోరుచిక్కుడు ఫ్రై రెడీ!

పప్పుచారు, సాంబార్ లేదా రసంతో ఈ గోరు చిక్కుడు ఫ్రై కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. పల్లెటూరి వంటకాల ఘుమఘుమలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని కచ్చితంగా ట్రై చేయాల్సిందే.

Related News

పల్లెటూరి స్టైల్‌లో చీరమేను చింతచిగురు కూర..చేసేయండిలా!

వెజ్ శాండ్విచ్..ఒక్క సారి తింటే టేస్ట్ మరచిపోలేరు!

పండగ రోజు ఉదయం మనం చేసే ఈ ఒక్కపని.. ఆరోగ్యాన్నే కాదు అదృష్టాన్ని కూడా తెస్తుంది!

చాణక్య నీతి.. దానధర్మాలు చేసే ముందు ఈ 7 విషయాలు గుర్తుంచుకోండి

మీ పిల్లాడు చదువు పట్ల ఆసక్తి చూపడం లేదా? తల్లిదండ్రులకు పేరెంటింగ్ కోచ్ చెప్పిన 3 చిట్కాలు

నెలసరి ముందు వచ్చే కడుపు ఉబ్బరం.. ఏయే సమస్యలకు సంకేతం కావొచ్చు?

అద్దెకు గది వెతుకుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి

Big Stories

Advertisement
×