E-Paper
Advertisement

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. ఆటోను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. ఇద్దరు దుర్మరణం!

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. ఆటోను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. ఇద్దరు దుర్మరణం!
Advertisement

Korukonda Accident: తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ ఓ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన ఎలా జరిగిందంటే..

Advertisement

రాజనగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామాల సరిహద్దు సమీపంలో ఉన్న గుర్రాల బొమ్మ వద్ద ఈ ఘటన జరిగింది. గోకవరం నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఆటో బూరుగుపూడి వైపు వెళ్తోంది. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా బూరుగుపూడి వైపు నుంచి వస్తున్న ఒక గ్యాస్ లారీ అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది.

అక్కడికక్కడే ఇద్దరి మృతి..

Advertisement

ఢీకొట్టిన తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరు తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే కన్నుమూశారు. మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో, స్థానికులు వెంటనే స్పందించి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు ..

సమాచారం అందుకున్న కోరుకొండ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

https://x.com/bigtvtelugu/status/2116077068576489648?a=GLVNvLPtiEBvfQL1IME&s=20

Tags

Related News

గుంటూరు మేయర్‌ అభ్యర్థి, నా చెల్లిని గెలిపించాలని ఓటర్లకు నటుడు జగపతిబాబు విజ్ఞప్తి

‘ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాల్సిందే’.. ఏపీ ప్రభుత్వానికి షర్మిల అల్టిమేటం!

గ్యాస్ వినియోగదారులకు రిలీఫ్.. సిలిండర్ల డెలివరీకి OTP నుంచి మినహాయింపు

తుఫాను బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు.. ఉచితంగా నిత్యావసరాలు, రూ.3 వేలు సాయం

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు

ఏపీకి దెబ్బ మీద దెబ్బ.. దూసుకొస్తున్న మరొక తుఫాను, వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు

అర్నబ్ తుపాను తాకిడికి అతలాకుతలమైన కోనసీమ.. రైతుల కళ్లల్లో కన్నీళ్లు!

Big Stories

Advertisement
×