E-Paper
Advertisement

బిగ్ బాస్ హౌస్ లో శివ కుమార్.. కర్వాచౌత్ చేసుకున్న ప్రియాంక..నెటిజన్స్ ఫైర్!

బిగ్ బాస్ హౌస్ లో శివ కుమార్.. కర్వాచౌత్ చేసుకున్న ప్రియాంక..నెటిజన్స్ ఫైర్!
Advertisement

Priyanka Jain: ప్రియాంక జైన్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటిగా మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్ తో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా సందడి చేశారు. ఇక బిగ్ బాస్ తర్వాత ప్రియాంక పలు సిరీస్ లలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే ప్రియాంక నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా కర్వ చౌత్ వేడుకలకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు.

పెళ్లి కాకుండానే ఈ పూజలు ఏంటి?

సాధారణంగా కార్వా చౌత్ పెళ్లయిన దంపతులు జరుపుకునే వేడుక. ఈ వేడుకను ఉత్తరాది రాష్ట్రాలలో పెళ్లయిన దంపతులు జరుపుకుంటారు. అయితే ప్రియాంక జైన్ సైతం నార్త్ అమ్మాయి కావడంతో ఈమె కూడా ఆచార వ్యవహారాలను పాటిస్తున్నారు. అయితే పెళ్లి కాకుండానే ఈమె ఈ ఆచార వ్యవహారాలను పాటించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈమె గత కొంతకాలంగా నటుడు శివకుమార్ తో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి కాకుండానే వీరిద్దరూ ఒకే చోట ఉండడంతో కూడా ఎన్నో విమర్శలు వస్తున్నాయి అంతేకాకుండా ఇద్దరు కలిసి పెళ్లి కాకుండానే ఎన్నో వ్రతాలు హోమాలు జరుపుకుంటున్నారు.

శివ్ ఫోటోతో కర్వా చౌత్ వేడుకలు..

Advertisement

తాజాగా శివకుమార్ బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే ఆయన హౌస్ లో ఉన్నటువంటి ఒక ఫోటోని టీవీలో చూస్తూ ఈమె కర్వా చౌత్ వేడుకలను జరుపుకోవడం గమనార్హం. ఇలా హౌస్ లో ఉన్నటువంటి ప్రియుడి ఫొటోతో ఈమె ఈ వేడుకను జరుపుకోవడం పట్ల ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈ వీడియో పై విభిన్న రీతిలో విమర్శలు వస్తున్నాయి. కొంతమంది సూపర్, సో స్వీట్ అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం.. పెళ్లి కాకుండా ఇలా వ్రతాలు చేసుకోవడం ఏంటి.. నీ ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు.

?rpxt=MWRsaGZ2NWI4Y2JjOQ%3D%3D

Advertisement

పెళ్లి కాకుండా ఇలాంటి వ్రతాలు చేస్తూ మన ఆచార సాంప్రదాయాలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దయచేసి మన సాంప్రదాయ వ్యవహారాలను విచ్ఛిన్నం చేయద్దు. ప్రతి పూజ వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. మీరిద్దరూ లవర్స్ అనే విషయం మాకు తెలుసు అది మేము ఒప్పుకుంటాము కానీ పెళ్లి కాకుండానే ఇలా చేయడం మంచిది కాదు అంటూ ఈమె తీరుపై నేటిజన్స్ మండిపడుతున్నారు. అయితే గతంలో కూడా వీరిద్దరూ కలిసి ఎన్నో హోమాలు వ్రతాలు చేసినప్పుడు ఇలాంటి వ్యతిరేకత వచ్చినప్పటికీ ప్రియాంక మాత్రం వీటిని లెక్కచేయకుండా తనకు నచ్చిన విధంగానే తనకు కాబోయే భర్తతో కలిసి పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఈమె కర్వా చౌత్ జరుపుకోవడంతో మరోసారి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

Also Read: ‘జైలర్ 2’ కంటే ముందే రజినీ, హృతిక్ కలిసి నటించిన మూవీ ఏమిటో తెలుసా?

Related News

డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను..నా వల్ల కాలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రీతూ!

పెళ్లి పీటలెక్కాల్సిన శివ.. ప్రియాంకను మోసం చేస్తున్నాడా?ముఖేష్ షాకింగ్ కామెంట్స్!

కష్టపడ్డా అమన్ కి దక్కని ఫలితం.. కంటెస్టెంట్స్ సపోర్టు కూడా లేదా?

“బాసింగ బలాలు” పాటకి 11 లక్షలు ఖర్చుపెడితే ఎంత వచ్చిందో తెలుసా?

ఈ వారం కూడా వర్షిణి సేఫ్.. డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే?

‘బ్రహ్మముడి’ అప్పు సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసిందా..?

Podarillu Today Episode : చక్రీ ని తిట్టిన కన్నా.. కన్నీళ్లు తెప్పించే సీన్.. నారాయణ పై కొడుకులు ప్రేమ..

Big Stories

Advertisement
×