E-Paper
Advertisement

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్..!

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్..!
Advertisement

Comrade Kalyan:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు శ్రీ విష్ణు (Sree Vishnu) హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీవిష్ణు.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కామ్రేడ్ కళ్యాణ్. మహిమా నంబియార్ హీరోయిన్గా నటించిన షైన్ టామ్ చాకో, రాధికా శరత్ కుమార్, సత్య, ముక్కు అవినాష్, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వం వహించారు. సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నవ్వులు పూయించిన ఈ సినిమా ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి రావడంతో ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన కామ్రేడ్ కళ్యాణ్..

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నెల కూడా కాకుండానే మూడు వారాలలోపే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా అక్టోబర్ 30న అనగా నేటి నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా సినిమా అందుబాటులోకి వచ్చింది. మొత్తానికైతే సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ఈ సినిమా.. ఇటు ఓటీటీ లవర్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

కామ్రేడ్ కళ్యాణ్ మూవీ స్టోరీ..

Advertisement

సినిమా స్టోరీ విషయానికి వస్తే.. 1991 దశకంలో ఆంధ్ర – ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో ఈ కథ సాగుతుంది. పెద్దగా చదువుకోని తాడికొండ కళ్యాణ్ (శ్రీ విష్ణు) ఒక గ్రామంలో థియేటర్ ను అద్దెకు తీసుకొని నడుపుతూ ఉంటాడు. అదే సమయంలో అడవుల్లోని నక్సలైట్ దళాలను ఏరి వేసేందుకు ఐపీఎస్ అధికారి జార్జ్ కుట్టి (షైన్ టామ్ చాకో ) ప్రత్యేకంగా నియమితుడు అవుతాడు. దీంతో మాస్టార్ నేతృత్వంలోని దళానికి, జార్జ్ కుట్టికి మధ్య పోరు కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో సితార (మహిమా నంబియార్) అనే ఒడియా అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామానికి వస్తుంది . ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లి సరస్వతమ్మను (రాధికా శరత్ కుమార్) ను కాపాడిన సితారను చూసి కళ్యాణ్ ప్రేమలో పడతారు. ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడతాడు. అయితే సితార కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న కళ్యాణ్.. ఎలాగైనా సరే వారిని ఆ కష్టాల నుండి బయట పడేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు దుబాయ్ బాబు (సత్య) సహాయంతో ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. కానీ ఆ నిర్ణయం కళ్యాణ్ జీవితాన్ని మార్చేస్తుంది. సాధారణంగా థియేటర్ నడుపుకునే కళ్యాణ్ కాస్త కామ్రేడ్ కళ్యాణ్ గా మారిపోతాడు.. పైగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా తయారవుతాడు. ఇక అసలు అడవుల్లోని నక్సలైట్ దళాలకు.. కళ్యాణ్ కి ఉన్న సంబంధం ఏమిటి? కామ్రేడ్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? సితార తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడేశారా? ఆ తర్వాత అతని జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అనేది సినిమా కథ.

also read:‘కల్ట్’ మూవీ రివ్యూ..R-రేటెడ్ మూవీ మెప్పించిందా?

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిన మరికొన్ని చిత్రాలు..

Advertisement

ఇకపోతే ఈ చిత్రంతోపాటు మీర్జాపూర్ మూవీస్, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఆది సాయికుమార్ SI యుగంధర్, సందీప్ కిషన్ , జేసన్ సంజయ్ కాంబినేషన్లో వచ్చిన సిగ్మా, కీర్తి సురేష్, రాధిక ఆప్టే కలయికలో వచ్చిన అక్క సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్నాయి. అలాగే జీవి ప్రకాష్ కుమార్, కయాదు లోహర్ కాంబినేషన్లో వచ్చిన ఇమ్మోర్టల్ చిత్రం సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

మిస్సింగ్‌ కేసులో బయటపడే తలలేని శవం… ట్విస్టులతో మతిపోగొట్టే తెలుగు సిరీస్

ఓటీటీలోకి వచ్చేసిన ఫహాద్ నాన్‌స్టాప్ ఫన్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’… తెలుగులోనూ స్ట్రీమింగ్

శవాన్ని కూడా వదలని సైకో… వరుస హత్యలతో పోలీసులకే వణుకు పుట్టించే థ్రిల్లర్

42 ఏళ్ల బంధానికి టాటా… గుహలోకి వెళ్ళి 20 ఏళ్ల యంగ్ కపుల్ గా రీఎంట్రీ… ఫాంటసీ రొమాంటిక్ సిరీస్ తెలుగులోనే

లగ్జరీ ఫ్లాట్‌ అద్దెకిచ్చే అందమైన అమ్మాయి… కలల ఇల్లు కాస్తా భయంకరమైన పీడకలగా మారితే… తమిళ హర్రర్ మూవీ తెలుగులో

ఓటీటీలోకి అడుగు పెట్టిన సీఎం విజయ్ కొడుకు ఫస్ట్ మూవీ… ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movies : ఓటీటీ లవర్స్ కు పునకాలే .. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Big Stories

Advertisement
×