Diwali Gifts Under 3000: దీపావళి పండగ వచ్చిందంటే కొత్త బట్టలు, స్వీట్లు, బహుమతుల సందడి మొదలవుతుంది. అయితే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఏ గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఈసారి సంప్రదాయ బహుమతులకు బదులుగా రోజూ ఉపయోగపడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను ఎంచుకుంటే బాగుంటుంది. అది కూడా రూ.3,000 లోపు బడ్జెట్‌లోనే. ప్రముఖ బ్రాండ్ boAt నుంచి అందుబాటులో ఉన్న కొన్ని గ్యాడ్జెట్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
పాటలు వినడం, ఇంట్లో చిన్న పార్టీలు చేసుకోవడం ఇష్టపడేవారికి boAt Stone 350 Pro మంచి గిఫ్ట్. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు వాటర్ రెసిస్టెన్స్ సదుపాయం ఇందులో ఉంది. దీని అసలు ధర రూ.4,990 కాగా, ఆఫర్‌లో రూ.1,699కే లభిస్తోంది. చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లలో మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ప్రయాణాల్లో, ఆఫీస్ కాల్స్ సమయంలో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. boAt Airdopes Prime 512 ఇయర్‌బడ్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. దీని అసలు ధర రూ.4,990 కాగా, డిస్కౌంట్‌లో రూ.1,399కే అందుబాటులో ఉంది. చెమట, నీటి తుంపర్ల నుంచి రక్షణ ఉన్నప్పటికీ నీటిలో ముంచకూడదు.
Also Read: 40 గంటల బ్యాటరీ బ్యాకప్.. ఫ్రీ గానా సబ్‌స్క్రిప్షన్‌తో Noise Buds R1 Gaana Edition లాంచ్!
ప్రయాణాల్లో ఫోన్ బ్యాటరీ అయిపోతే పవర్ బ్యాంక్ ఎంతో అవసరం. boAt Energyshroom PB300 Pro ఇయర్‌బడ్స్ 10,000mAh కెపాసిటీతో వస్తుంది. దీని అసలు ధర రూ.3,499 కాగా, ఆఫర్‌లో రూ.1,299కే లభిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌కు బ్యాకప్ ఛార్జింగ్ అందించేందుకు ఇది మంచి ఎంపిక.
స్టైలిష్ గ్యాడ్జెట్స్ ఇష్టపడేవారికి boAt Storm Call 4 స్మార్ట్‌వాచ్ నచ్చుతుంది. పెద్ద డిస్‌ప్లే, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని అసలు ధర రూ.4,990 కాగా, ఆఫర్ ధర రూ.1,599. డైరెక్ట్ టైప్-సి ఛార్జింగ్ సదుపాయం మరో ఆకర్షణ. కొనుగోలు చేసే ముందు డిస్‌ప్లే స్పష్టతను పరిశీలించండి.
మీ బడ్జెట్‌కు తగ్గ గిఫ్ట్ ఎంచుకోవాలంటే అవతలి వ్యక్తి అవసరాలను గుర్తుంచుకోండి. మ్యూజిక్ ప్రియులకు స్పీకర్, కాల్స్ ఎక్కువ మాట్లాడేవారికి ఇయర్‌బడ్స్, ప్రయాణికులకు పవర్ బ్యాంక్, ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారికి స్మార్ట్‌వాచ్ సరైన ఎంపికలు. అయితే ఆఫర్ ధరలు మారవచ్చు. కొనుగోలు చేసే ముందు తాజా ధరలు, ఫీచర్లు, వారంటీ వివరాలను అధికారిక విక్రయ వేదికలో తనిఖీ చేయడం మర్చిపోవద్దు.
Also Read: వావ్.. ఏకంగా 7 ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు, యాపిల్ లవర్స్‌కు పండగ లాంటి ఆఫర్!