E-Paper
Advertisement

అన్నం తిన్నాక టీ తాగడం మంచిదా? కాదా? సైన్స్ ఏం చెబుతోంది?

అన్నం తిన్నాక టీ తాగడం మంచిదా? కాదా? సైన్స్ ఏం చెబుతోంది?
Advertisement

Drinking Tea After Meals: మనదేశంలో చాయ్ లవర్స్‌కి కొదువ లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మందికి అడుగడుగునా టీ కావాల్సిందే. అయితే.. కొంతమందికి మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం ముగించిన వెంటనే వేడి వేడిగా ఒక కప్పు చాయ్ తాగే అలవాటు ఉంటుంది. అలా తాగితే తిన్న అన్నం త్వరగా అరుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ.. మెడికల్ సైన్స్ ,ఆరోగ్య నిపుణుల ప్రకారం తిన్న వెంటనే టీ తాగడం అస్సలు మంచిది కాదంటున్నారు. ఆ అలవాటు వల్ల వచ్చే లాభనష్టాల గురించి  తెలుసుకుందాం.

భోజనం తర్వాత టీ తాగడం:

మన ఇంట్లో పెద్దవాళ్లు చాలా మంది తిన్న తర్వాత ఒక కప్పు చాయ్ పడితే గానీ ఆ తృప్తి రాదబ్బా అంటూ ఉంటారు. అయితే.. ఈ అలవాటు శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాల గ్రహణ శక్తిని పూర్తిగా దెబ్బతీస్తుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. టీ ఆకులలో టానిన్లు , పాలిఫెనాల్స్ అనే రసాయన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. మనం తిన్న ఆహారంలో, ముఖ్యంగా పప్పులు, ఆకుకూరలు వంటి శాఖాహారంలో.. ఉండే ఐరన్‌ను ఈ టానిన్లు బంధిస్తాయి. దీని వల్ల మన శరీరం ఆహారంలోని ఐరన్‌ను సరిగ్గా గ్రహించలేదు. ఫలితంగా శరీరంలో.. రక్తం తగ్గిపోవడం, ఎనిమియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Advertisement

దీంతో పాటు తిన్న వెంటనే టీ తాగడం వల్ల జీర్ణక్రియపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. టీలో ఉండే కెఫీన్ వల్ల కడుపులో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. తిన్న వెంటనే ఇది జరగడం వల్ల జీర్ణక్రియ మందగించి, గుండెల్లో మంట, గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా అసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా.. టీ లోని టానిన్లు మనం తిన్న ఆహారంలోని ప్రోటీన్లను గట్టిపడేలా చేస్తాయి. దీనివల్ల మన జీర్ణవ్యవస్థ ఆ ప్రోటీన్లను అరిగించుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.

అయితే ఇందులో కొన్ని పాజిటివ్ విషయాలు కూడా ఉన్నాయి. నిజానికి చాయ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మరియు రోగనిరోధక శక్తికి మంచిదే. చైనా, జపాన్ వంటి దేశాలలో భోజనం తర్వాత గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగే సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వారు పాలు, చక్కెర లేని చాలా లైట్ టీలను మాత్రమే తాగుతారు. ఇది జీర్ణ క్రియకు కొంతవరకు సహాయపడుతుంది. కానీ మన దేశంలో తాగే పాలు, ఎక్కువ చక్కెరతో కూడిన స్ట్రాంగ్ మసాలా టీల వల్ల లాభాల కంటే.. నష్టాలే ఎక్కువగా జరుగుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Advertisement

మీకు టీ తాగడం చాలా ఇష్టమైతే.. ఆరోగ్యం పాడవకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అన్నం తిన్న వెంటనే స్ట్రాంగ్ పాలు, చక్కెర ఉన్న టీ తాగడం పూర్తిగా ఆపేయాలి. భోజనానికి, టీ తాగడానికి మధ్య కనీసం 45 నుంచి 60 నిమిషాల గ్యాప్ ఇవ్వడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఐరన్ టాబ్లెట్స్ వేసుకునే.. మహిళలు భోజనం తర్వాత టీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీలైతే మధ్యాహ్నం భోజనం తర్వాత సాధారణ టీకి బదులుగా అల్లం టీ, పుదీనా టీ లేదా లేమన్ గ్రీన్ టీ వంటి హెర్బల్ ఆప్షన్స్ ఎంచుకోవడం బెస్ట్.

భోజనం తర్వాత టీ తాగడం అనేది ఆ క్షణానికి నాలుకకు ఎంతో హాయిగా అనిపించినా.. లాంగ్ రన్‌లో అది మన శరీరానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి.. తిన్న వెంటనే చాయ్ కప్పు పట్టుకోకుండా.. ఒక గంట పాటు ఓపిక పట్టండి. ఆ తర్వాత ఎంచక్కా మీ ఫేవరెట్ టీని తాగి ఎంజాయ్ చేయండి.

Related News

డోపమైన్ కోసం డేటింగ్.. ప్రేమలో కొత్తదనం కోరుకుంటున్న జెన్ జీ యువత

పిల్లలు హైట్ పెరగడం లేదా? రోజూ ఈ 5 యోగాసనాలు వేయండి.. ఆగకుండా ఎత్తు పెరుగుతారు

అసలు జ్ఞాన దంతాలతో ఉపయోగం ఉందా? వీటిని ఎప్పుడు తొలగించాలి

ఆ దేశంలో అంతా రివర్స్.. ప్రజలకు కరెంట్ బిల్లు చెల్లిస్తున్న ప్రభుత్వం.. ఎలాగంటే

నమ్మకానికి మారుపేరు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టాల్లో తోడుగా నిలబడే స్నేహితులు

ఎంత సంపాదించినా పేదరికంలోనే ఉంటారు.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?

వేగంగా ముసలిబారుతున్న మెదుడు.. మీరు చేస్తున్న ఈ తప్పులే కారణం

ప్రేమ లేదా ఫ్రెండ్‌షిప్.. చాటింగ్‌లో ఈ చిన్న సంకేతాలు కనిపిస్తే పట్టేయండి

Big Stories

Advertisement
×