E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

టిమ్స్‌లో 122 ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ పూర్తి వివరాలు ఇవే!

టిమ్స్‌లో 122 ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ పూర్తి వివరాలు ఇవే!
Advertisement

TIMS Sanath Nagar Recruitment 2026:తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే.. నిరుద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ‘తెలంగాణ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (TIMS)సనత్‌నగర్ బ్రాంచ్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి సరికొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 122 టెక్నీషియన్ ,అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి, అర్హతలు ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న 122 పోస్టులలో ల్యాబ్ టెక్నీషియన్లు, థియేటర్ అసిస్టెంట్లు, వివిధ రకాల మెడికల్ లాబొరేటరీ స్టాఫ్‌తో పాటు ఆఫీస్ మేనేజ్‌మెంట్ చూసుకునే అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు సంబంధించి అభ్యర్థుల విద్యార్హతలు కూడా వేర్వేరుగా నిర్ణయించారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు, సంబంధిత సబ్జెక్టులలో డిప్లొమా, డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.

Advertisement

ఈ నోటిఫికేషన్ యొక్క అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. దీనికి ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ ఫారమ్‌ను స్పష్టంగా పూర్తి చేసి, మీ విద్యార్హతల సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు, అవసరమైన ఇతర జిరాక్స్ కాపీలను జత చేయాలి. ఆ తర్వాత పూర్తి చేసిన అప్లికేషన్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న గడువు తేదీ లోపు TIMS సనత్‌నగర్ కార్యాలయంలో నేరుగా గానీ లేదా పోస్ట్ ద్వారా గానీ అందజేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.

Related News

రేపే.. తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్

సీయూఈటీ-యూజీ ప్రవేశ ఫలితాలు.. జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎమ్మెల్యే కూతురు దేవినా

విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 30లోపు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 538 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

నీట్ రీ-టెస్ట్‌లో ఆసక్తికర విషయాలు.. మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లు, 24 మంది అరెస్ట్

సీబీఎస్ఈ 12వ తరగతి.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఏపీ వైద్య శాఖలో..529 స్టాఫ్ నర్స్,ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Big Stories

×