E-Paper
Advertisement

ఫిట్‌నెస్ ఫ్రీక్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆరోగ్యాన్ని అసలు నిర్లక్ష్యం చేయరు

ఫిట్‌నెస్ ఫ్రీక్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆరోగ్యాన్ని అసలు నిర్లక్ష్యం చేయరు
Advertisement

Numerology Fitness| కొంతమంది ప్రతిరోజూ చురుగ్గా, ధృడంగా ఉండటానికి ఇష్టపడతారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తమ జీవనశైలిలో భాగంగా మార్చుకుంటారు.
న్యూమరాలజీ ప్రకారం.. పుట్టిన తేదీ మన వ్యక్తిత్వంతో పాటు జీవనశైలిపై కూడా కొన్ని సంకేతాలు అందిస్తుంది. కొందరు వ్యాయామానికి దూరంగా ఉంటారు.
మరికొందరు మాత్రం శారీరకంగా చురుగ్గా ఉండటాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా 5, 1, 9 మూల అంకాలు (జన్మ సంఖ్యలు) ఉన్నవారికి ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఆసక్తి ఉంటుందని న్యూమరాలజీ చెబుతోంది.

5వ మూల అంకం ఉన్నవారు ఎప్పుడూ చురుగ్గా ఉంటారు

ఏ నెలలోనైనా 5, 14 లేదా 23వ తేదీన పుట్టినవారి మూల అంకం 5 అవుతుంది. న్యూమరాలజీలో ఈ సంఖ్యను బుధుడితో అనుసంధానిస్తారు.
బుధుడు చురుకుదనం, తెలివితేటలు, కదలిక, శక్తికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ మూల అంకం ఉన్నవారు యాక్టివ్‌గా ఉండటాన్ని ఇష్టపడతారని నమ్మకం.
వారు ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడానికి ఇష్టపడకపోవచ్చు. శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండేందుకు ఎప్పుడూ యాక్టివిటీస్ చేస్తుంటారు.

5వ మూల అంకం ఉన్నవారికి కొత్త వ్యాయామాలు ఇష్టం

Advertisement

ఒకే రకమైన వ్యాయామాన్ని ప్రతిరోజూ చేయడం వారికి త్వరగా బోర్ కొట్టవచ్చు. అందుకే వారు కొత్త ఫిట్‌నెస్ కార్యకలాపాలను ప్రయత్నించడానికి ఆసక్తి చూపుతారు. డ్యాన్స్, స్పోర్ట్స్, సైక్లింగ్, రన్నింగ్ వంటి కార్యకలాపాలను వారు ఇష్టపడవచ్చు. కొత్తదనం వారి ఉత్సాహాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది.

మూల అంకం 1 ఉన్నవారు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు

1, 10, 19 లేదా 28వ తేదీన పుట్టినవారి మూల అంకం 1 మూలాంకం 1 అవుతుంది. న్యూమరాలజీ ఈ సంఖ్యను సూర్యుడితో అనుసంధానిస్తుంది.
సూర్యుడు.. శక్తి, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, ఉత్సాహానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే మూల అంకం 1 ఉన్నవారు క్రమశిక్షణతో ఉండటానికి ఇష్టపడతారని చెబుతారు.

Advertisement

వారు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని, వాటిని సాధించడానికి ప్రయత్నిస్తారు. ఫిట్‌నెస్‌ తాత్కాలిక అలవాటుగా కాకుండా జీవనశైలిగా మార్చుకోవచ్చు.

మూల అంకం 1 ఉన్నవారు వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయరు

వారు ఒకసారి వ్యాయామ షెడ్యూల్ రూపొందించుకుంటే దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తారు. ఉదయం త్వరగా లేచి వాకింగ్ లేదా రన్నింగ్ చేయవచ్చు. అలాగే తమ ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం వారి దినచర్యలో భాగం.

9వ మూల అంకం ఉన్నవారికి ఎక్కువ శక్తి

9, 18 లేదా 27వ తేదీన పుట్టినవారి మూలాంకం 9 అవుతుంది. న్యూమరాలజీ ఈ సంఖ్యను కుజుడితో అనుసంధానిస్తుంది. కుజుడు ధైర్యం, శక్తి, బలం, పట్టుదలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ మూలాంకం ఉన్నవారు కఠినమైన వ్యాయామాలను ఇష్టపడతారు.

Also Read: తల్లిదండ్రులను లవ్ మ్యారేజ్‌కు ఎలా ఒప్పించాలి? మీ కోసమే ఈ టిప్స్

మూల అంకం 9.. కఠినమైన వర్కౌట్లు ఇష్టపడతారు

జిమ్, రన్నింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటి కార్యకలాపాలు వారికి ఆకర్షణీయంగా ఉండవచ్చు. తమ సామర్థ్యాన్ని పరీక్షించే వ్యాయామాలను వారు ఇష్టపడవచ్చు. వెయిట్ లిఫ్టింగ్, కొత్త రికార్డులు సృష్టించడం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తారు. ఫిట్‌నెస్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు.

Also Read: లేడీ లక్.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను భర్త ఎంతో గారబంగా చూసుకుంటారు

మీ మూల అంకం కూడా వీటిలో ఉందా?

న్యూమరాలజీ ప్రకారం 5, 1, 9 మూలాంకాలు చురుకైన జీవనశైలితో సంబంధం కలిగి ఉంటాయి. అయితే న్యూమరాలజీ ఆరోగ్యం లేదా ఫిట్‌నెస్‌ను శాస్త్రీయంగా నిర్ణయించదు. మన ఆరోగ్యం మన అలవాట్లు, ఆహారం, వ్యాయామం, పరిసరాలపై ఆధారపడి ఉంటుంది.

కాబట్టి మీ మూల అంకం ఏదైనా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

Related News

మెరిసే చర్మం, జ్ఞాపకశక్తి, యాంటీ ఆక్సిడెంట్ ఇంకా ఎన్నో.. ఈ సూపర్ మొక్క దివ్య ఔషధం

పనీర్‌పై నిషేధం విధిస్తున్న రాష్ట్రాలు.. మీరూ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

‘ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావ్?’.. పదే పదే ఈ ప్రశ్న విని విసిగిపోయారా.. ఈ సమస్యకు పరిష్కారం ఇదే

సూదిలో దారం ఎక్కించడానికి ఇబ్బందిపడుతున్నారా? చాలా ఈజీ ఈ టిప్స్ మీ కోసమే

కొబ్బరి నీళ్లు vs ఓఆర్ఎస్.. ఆరోగ్యానికి ఏది మంచిది?

వర్షం పడుతుంటే ఏదైనా వేడిగా తినాలనిపిస్తుందా?.. ఈ స్నాక్స్ ట్రై చేయండి!

భార్యతో గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా?

Big Stories

Advertisement
×