Boiled egg varieties: ప్రోటీన్ కోసం రోజూ ఉడికించిన గుడ్లు తినడం హెల్త్ కి సూపర్ కానీ, ఒకేలా తింటే.. కొన్ని రోజులకు బోర్ కొట్టడం ఖాయం! జిమ్‌కి వెళ్లేవాళ్లయినా, వెయిట్ లాస్ డైట్ లో ఉన్నా, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ హడావిడిలో ఉన్నా బాయిల్డ్ ఎగ్స్ మన ఫస్ట్ ఛాయిస్. కొంచెం క్రియేటివిటీ, సింపుల్ ఇంగ్రీడియంట్స్ వాడితే.. అదే ఉడికించిన గుడ్లతో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ని ఇంట్లోనే తెచ్చుకోవచ్చు. బోర్ కొట్టకుండా.. బాయిల్డ్ ఎగ్స్ ని ఈజీగా, టేస్టీగా తినడానికి బెస్ట్ ఐడియాస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
1. సౌత్ ఇండియన్ మసాలా ఎగ్ రోస్ట్ :
ఉడికించిన గుడ్లకు చిన్నగా గాట్లు పెట్టి పక్కన ఉంచుకోవాలి. పాన్ లో కొంచెం నూనె లేదా నెయ్యి వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లి పాయ, కరివేపాకు వేయించాలి. అందులో కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత గుడ్లు వేసి లో ఫ్లేమ్ లో రెండు నిమిషాలు టాస్ చేస్తే, మసాలా అంతా గుడ్లకు పట్టి స్పైసీగా, ఘాటుగా అద్భుతంగా ఉంటుంది.
2. ట్రెండీ ఎగ్ సలాడ్ బౌల్:
లైట్ గా, హెల్దీగా తినాలనుకునే.. రోజుల్లో ఎగ్ సలాడ్ బెస్ట్ ఆప్షన్. ఉడికించిన గుడ్లను చిన్న ముక్కలుగా కట్ చేసి, అందులో దోసకాయ ముక్కలు, టమాటో, ఉల్లిపాయ, స్వీట్ కార్న్ కలపాలి. పైన కొంచెం నిమ్మరసం, చాట్ మసాలా లేదా మిరియాల పొడి, కొత్తిమీర చల్లితే రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఈవెనింగ్ స్నాక్ కి లేదా లంచ్ లో సైడ్ గా ఇది సూపర్ గా సెట్ అవుతుంది.
3. స్ట్రీట్ స్టైల్ బాయిల్డ్ ఎగ్ చాట్:
బయట చాట్ బండ్ల మీద తినే ఫీలింగ్ కావాలంటే.. బాయిల్డ్ ఎగ్ చాట్ ట్రై చేయొచ్చు. గుడ్డుని సగానికి కట్ చేసి, పైన సన్నని ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, కొద్దిగా చాట్ మసాలా, కారం, ఉప్పు వేయాలి. చివరగా కొంచెం నిమ్మరసం పిండితే, పుల్లపుల్లగా, కారంగా నాలుకకు సూపర్ కిక్ ఇస్తుంది. పది నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ స్నాక్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది.
4. క్రీమీ ఎగ్ స్ప్రెడ్ లేదా శాండ్ విచ్ ఫిల్లింగ్:
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ని హడావిడి లేకుండా రిచ్ గా మార్చాలంటే.. ఎగ్ స్ప్రెడ్ బాగుంటుంది. ఉడికించిన గుడ్లను మెత్తగా మాష్ చేసి, కొంచెం చిక్కని పెరుగు లేదా హంగర్డ్ కర్డ్, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర కలపాలి. దీన్ని బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టి శాండ్ విచ్ లా తింటే చాలా క్రీమీగా, టేస్టీగా ఉంటుంది. టోస్ట్ చేసిన బ్రెడ్ తో తింటే క్రంచీనెస్ కూడా యాడ్ అవుతుంది.
5. గార్లిక్ బటర్ ఎగ్ బైట్స్:
వెల్లుల్లి, వెన్న ఫ్లేవర్ ఇష్టపడే వారికి ఇది నెక్స్ట్ లెవెల్ ఐడియా. చిన్న పాన్ లో.. కొంచెం వెన్న వేసి, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి మంచి.. సువాసన వచ్చే వరకు వేయించాలి. అందులో.. కట్ చేసిన బాయిల్డ్ ఎగ్స్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో లేదా కొత్తి మీర వేసి లైట్ గా వేయించాలి. తక్కువ టైమ్ లోనే హోటల్ స్టైల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది.
అలాగే రోజూ తినేటప్పుడు.. ఎగ్ ని పూర్తిగా గట్టిగా కాకుండా, మధ్యలో పచ్చ సొన కొంచెం సాఫ్ట్ గా ఉండేలా కూడా ఉడికించుకోవచ్చు. ఒక్కో రోజు ఒక్కో స్టైల్ ఫాలో అయితే మీ ప్రోటీన్ రూటీన్ అస్సలు బోర్ కొట్టదు.