Hsense e7s tv: ప్రస్తుత రోజుల్లో ఓటీటీ కంటెంట్, లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, హై-ఎండ్ వీడియో గేమ్స్ ఆడే వారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో చిన్న స్క్రీన్ల కంటే 55, 65-అంగుళాల పెద్ద స్మార్ట్ టీవీలకు మార్కెట్లో మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ ట్రెండ్‌ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హిసెన్స్ ఇండియన్ మార్కెట్ లోకి తన లేటెస్ట్ E7S హై-క్యూఎల్ఈడి మినీఎల్ఈడి టీవీ లైనప్‌ని తీసుకొచ్చింది. ప్రీమియం డిస్ ప్లే టెక్నాలజీని సామాన్య వినియోగదారులకు అందుబాటు ధరలో అందించడమే లక్ష్యంగా ఈ సిరీస్ ని డిజైన్ చేశారు.
హిసెన్స్ ఈ కొత్త E7S సిరీస్ ని రెండు ఆకర్షణీయమైన స్క్రీన్ సైజుల్లో పరిచయం చేసింది. ఇందులో.. బేస్ వేరియంట్ అయిన 55-అంగుళాల మోడల్ ధర రూ. 42,900 నుంచి ప్రారంభమవుతుంది.ఇక మరింత పెద్ద స్క్రీన్ తో హోమ్ థియేటర్ ఫీల్ కోరుకునే వారి కోసం తెచ్చిన 65-అంగుళాల మోడల్ ధర సుమారు రూ. 56,900 రేంజ్లో అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా మినీ-ఎల్ఈడి, క్యూఎల్ఈడి టెక్నాలజీ ఉన్న.. టీవీలు చాలా ఖరీదు ఉంటాయి. కానీ హిసెన్స్ ఈ ధరల్లోనే ప్రీమియం ఫీచర్లను ఇవ్వడం విశేషం.
ఈ టీవీ సిరీస్ లో మెయిన్ హైలైట్ దీని మినీ-ఎల్ఈడి బ్యాక్ లైట్ టెక్నాలజీ. సాధారణ ఎల్ఈడి టీవీలతో పోలిస్తే.. మినీ-ఎల్ఈడి డిస్ ప్లే లో బ్రైట్ నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే డార్క్ సీన్లలో ..బ్లాక్ లెవల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. హై-క్యూఎల్ఈడి టెక్నాలజీ తోడవడంతో.. రంగులు మరింత సహజంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 4K అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ తో పాటు డాల్బీ విజన్, హెచ్ డీఆర్ సపోర్ట్ ఉండటం వల్ల సినిమాలు చూస్తున్నప్పుడు ప్రతి ఫ్రేమ్ చాలా షార్ప్‌గా, రియలిస్టిక్ గా ఉంటుంది.
మంచి విజువల్స్ తో పాటు అదిరి పోయే ఆడియో ఉంటేనే.. ఎంటర్ టైన్ మెంట్ పూర్తి అవుతుంది. ఇందుకోసం హిసెన్స్ E7S సిరీస్ లో.. పవర్ ఫుల్ స్పీకర్ సెటప్ తో.. పాటు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని ఇచ్చారు. ప్రత్యేకంగా సబ్ వూఫర్ సపోర్ట్ ఉండటం వల్ల బాస్ ఎఫెక్ట్ బాగుండి, ఎక్స్ టర్నల్ సౌండ్ బార్ లేకపోయినా.. మంచి ఆడియో ఫీల్ కలుగుతుంది. అలాగే గేమర్స్ కోసం హై రిఫ్రెష్ రేట్ మోడ్, ఆటో లో లేటెన్సీ మోడ్ , వేరియబుల్ రిఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. దీని వల్ల యాక్షన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు స్క్రీన్ ల్యాగ్ లేకుండా స్మూత్‌గా పని చేస్తుంది.
Also Read: రూ.9,666కే బ్రాండెడ్ స్మార్ట్ టీవీ!ఈ టీవీ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఈ స్మార్ట్ టీవీలు లేటెస్ట్.. స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంటి పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్ అన్నీ.. ఇందులో ఈజీగా వాడుకోవచ్చు. వాయిస్ కంట్రోల్ రిమోట్ సపోర్ట్ ఉండటం వల్ల మీకు కావాల్సిన సినిమాలు లేదా షోలను మాట్లాడి సెర్చ్ చేయెచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, మల్టిపుల్ హెచ్ డీఎంఐ పోర్ట్ లు,యూఎస్ బీ పోర్ట్ లు ఇందులో ఉన్నాయి. స్లిమ్ బెజెల్ లెస్ డిజైన్ వల్ల ఇది చాలా మోడ్రన్ లుక్ అందిస్తుంది.
రూ.42,900 ప్రారంభ ధరతో 55-అంగుళాలు, 65-అంగుళాల సైజుల్లో మినీ-ఎల్ఈడి, హై-క్యూఎల్ఈడి ఫీచర్లను తీసుకురావడం ద్వారా హిసెన్స్ మిడ్-రేంజ్ స్మార్ట్ టీవీ సెగ్మెంట్ లో గట్టి పోటీనిస్తోంది. తక్కువ బడ్జెట్ లో ..పెద్ద స్క్రీన్, లేటెస్ట్ డిస్ ప్లే టెక్నాలజీ కావాలనుకునే.. వారికి ఈ కొత్త సిరీస్ ఒక మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.