Big Tv Kissik Talks: బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో లలో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. తెలుగులో ఈ కార్యక్రమం ఇప్పటికి పదవ సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇలా తొమ్మిది సీజన్లు ఎంతో విజయవంతంగా ప్రసారమయ్యాయి. ఇక పదవ సీజన్ కూడా దాదాపు పూర్తి కానుంది. మరొక నాలుగు వారాలలో ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ కార్యక్రమంలో విన్నర్ ఎవరు అనే విషయంపై ఇప్పటికే అందరికీ ఒక క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అగ్నిపరీక్ష ద్వారా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా పలువురు కంటెస్టెంట్లు అడుగుపెట్టారు ఇందులో రోహిత్ నాయుడు పట్నం(Rohit Naidu Patnam) కూడా ఒకరు. ఇలా సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్ తన ఆట తీరుతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక విన్నర్ రేసులో రోహిత్ కూడా ఉండబోతున్నారని ఈసారి టఫ్ కాంపిటీషన్ ఉంటుందని అందరూ భావించారు. అయితే ప్రేక్షకుల ఊహకు అందని విధంగా బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి రోహిత్ నాయుడును ఎనిమిదవ వారం హౌస్ నుంచి బయటకు పంపిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టిన మొదటి వారం నుంచి ఓటింగ్ పరంగా రోహిత్ ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు. అయితే ఎనిమిదవ వారం ఈయన డేంజర్ జోన్ లో ఉండడమే కాకుండా రోహిత్ ఎలిమినేషన్ గురించి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల అభిప్రాయం కూడా తెలుసుకోవడంతో ఎక్కువ మంది రోహిత్ ను ఎలిమినేట్ చేశారు. ఇలా రోహిత్ ఎలిమినేట్ కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా బిగ్ బాస్ వ్యవహార శైలి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా రోహిత్ నాయుడు బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big Tv Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ఎలిమినేషన్ గురించి రోహిత్ మాట్లాడుతూ తాను ఆడియన్స్ వోటింగ్ వల్ల ఎలిమినేట్ కాలేదని తెలిపారు. అది ఫేర్ ఎలిమినేషన్ అని తెలిపారు. నాగార్జున గారు అంటారు మనం హౌస్ లో ఉండాలా లేదా అనేది జనాలు డిసైడ్ చేస్తారని చెబుతారు కానీ నా విషయంలో అది కాదని తెలిపారు. బాగా ఆడే వాళ్ళందరినీ బయటకు పంపించేసి వీక్ కంటెస్టెంట్లతో ఆడాలనుకోవడం కూడా మూర్ఖత్వం అనే ఉద్దేశంలో రోహిత్ మాట్లాడారు. అయితే తన ఎలిమినేషన్ ఫేక్ అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది పూర్తి ఎపిసోడ్లో భాగంగా బిగ్ బాస్ గురించి రోహిత్ ఇంకా ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారు అనేది తెలియనుంది. ఈ కార్యక్రమం ఆదివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కానుంది.
Also Read: చిన్న కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ 10 కంటెస్టెంట్.. ఎంత ముద్దుగా ఉందో!