E-Paper
Advertisement

టీనేజర్లకు కాల్స్ కంటే టెక్స్టింగ్ ఎందుకు ఇష్టం?5 ఆసక్తికర కారణాలివే!

టీనేజర్లకు కాల్స్ కంటే టెక్స్టింగ్ ఎందుకు ఇష్టం?5 ఆసక్తికర కారణాలివే!
Advertisement

Teens prefer texting: ఇప్పటి టీనేజర్లు, జెన్-జీ కుర్రాళ్ల చేతిలో ఫోన్ ఎప్పుడూ ఉంటుంది కానీ, రింగ్ వస్తే మాత్రం చాలా మందికి చిన్న టెన్షన్ మొదలవుతుంది! డైరెక్ట్ గా మాట్లాడే కంటే వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ లో.. మెసేజ్ చేయడానికే వీళ్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా, తమకు నచ్చినప్పుడు, నచ్చిన విధంగా రిప్లై ఇచ్చే ఫ్రీడమ్ టెక్స్టింగ్లో దొరుకుతుంది. మరి టీనేజర్లు ఫోన్ కాల్స్ కంటే టెక్స్టింగ్ ని ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారో కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీనేజర్లు  టెక్స్టింగ్ ఇష్టపడటానికి 5 కారణాలు:

1. ఆలోచించుకుని రిప్లై ఇచ్చే టైమ్:
ఫోన్ కాల్ లో మాట్లాడుతున్నప్పుడు వెంటనే సమాధానం చెప్పాలి. ఒక్కోసారి ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తోచక తడబడే పరిస్థితి వస్తుంది. అదే టెక్స్టింగ్ లో.. అయితే మెసేజ్ చదివిన తర్వాత నెమ్మదిగా ఆలోచించి, బెస్ట్ వర్డ్స్ సెలెక్ట్ చేసుకుని రిప్లై ఇవ్వొచ్చు. ముఖ్యంగా ..కాస్త సీరియస్ విషయం చెప్పాలన్నా, ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేయాలన్నా తమ మాటలకు పర్ఫెక్ట్ షేప్ ఇవ్వడానికి టెక్స్టింగ్ వాళ్లకు ఒక సేఫ్ స్పేస్ లా అనిపిస్తుంది.

Advertisement

2. ఫోన్ కాల్ యాంగ్జైటీ:
చాలా మంది టీనేజర్లకు అన్ నోన్ నంబర్స్ లేదా సడన్ గా వచ్చే కాల్స్ అంటే.. చిన్న భయం లేదా ఇబ్బంది (కాల్ యాంగ్జైటీ) ఉంటుంది. కాల్ కనెక్ట్ అయ్యాక “హలో… ఆ చెప్పు” అని మొదలుపెట్టడం, మధ్యలో మాటలు ఆగిపోయినప్పుడు వచ్చే ఆక్వర్డ్ సైలెన్స్ వాళ్లకు అంతగా నచ్చదు. టెక్స్టింగ్ లో ఆ ఇబ్బంది అస్సలు ఉండదు. చాట్ ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు మళ్లీ స్టార్ట్ చేయాలి అనే కంట్రోల్ పూర్తిగా వాళ్ల చేతిలోనే ఉంటుంది.

3. మల్టీటాస్కింగ్ కి ఫుల్ సపోర్ట్:
టీనేజర్లు ఒకే సారి చాలా పనులు చేస్తూ ఉంటారు. గేమ్స్ ఆడుతూనో, రీల్స్ చూస్తూనో, హోంవర్క్ చేస్తూనో, లేదా మ్యూజిక్ వింటూనో.. మధ్య మధ్యలో మెసేజ్లకు రిప్లై ఇవ్వడం వాళ్లకు చాలా ఈజీ. ఫోన్ కాల్ మాట్లాడాలంటే.. ఒక చోట కూర్చోవడమో, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడమో, చుట్టూ ఉన్న సౌండ్స్ తగ్గించుకోవడమో చేయాల్సి వస్తుంది. టెక్స్టింగ్ అయితే.. తమ రూటీన్ వర్క్ కి ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్ గా సాగిపోతుంది.

Advertisement

4. ఎమోజీలు, మీమ్స్, స్టిక్కర్లతో ఈజీ ఎక్స్ ప్రెషన్:
మాటల ద్వారా చెప్పలేని ఫీలింగ్స్ ని ఒక్క ఎమోజీతో.. లేదా ట్రెండింగ్ మీమ్ తో టీనేజర్లు క్షణాల్లో చెప్పేస్తారు. సంతోషం, చిరాకు, సర్ ప్రైజ్, ఫన్నీ మూడ్..ఇలా ప్రతి ఎమోషన్ కి ఒక స్టిక్కర్ లేదా జిఫ్ రెడీగా ఉంటుంది. మాటల్లో సీరియస్ గా.. అనిపించే.. విషయం కూడా ఒక ఫన్నీ ఎమోజీ కలిపి మెసేజ్ చేస్తే లైట్ గా, కూల్ గా మారి పోతుంది. ఈ విజువల్ ఎక్స్ ప్రెషన్ వాళ్లకు చాలా కంఫర్టబుల్ గా, ట్రెండీగా అనిపిస్తుంది.

5.ప్రైవసీ, కన్వీనియన్స్:
ఇంట్లో అందరూ ఉన్నప్పుడు, క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు, లేదా పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు బిగ్గరగా మాట్లాడటం టీనేజర్లకు ఇష్టం ఉండదు. టెక్స్టింగ్ అయితే సైలెంట్‌గా, ఎవరికీ డిస్టర్బ్ చేయకుండా, తమ ప్రైవసీ కాపాడుకుంటూ మాట్లాడటానికి బెస్ట్ వే. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు మెసేజ్ చూడొచ్చు, కుదిరినప్పుడు రిప్లై ఇవ్వొచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్లే కాల్స్ కంటే టెక్స్టింగ్ నే.. వాళ్లు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.

అయితే టెక్స్టింగ్ ఎంత ఈజీగా ఉన్నా, కొన్ని సార్లు మెసేజ్ లోని టోన్ ని ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే.. ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు.. లేదా తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు చిన్న వాయిస్ నోట్ లేదా కాల్ చేయడం కూడా మంచిదే. ఏదేమైనా, మారుతున్న టెక్నాలజీ, బిజీ లైఫ్ స్టైల్ వల్ల టీనేజర్ల కమ్యూనికేషన్ స్టైల్ లో టెక్స్టింగ్ ఒక భాగమైపోయింది.

Tags

Related News

పొట్లకాయ పెరుగు పచ్చడి..వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉంటుంది!

నెల రోజుల పాటు నిల్వ ఉండే..గుంటూరు స్పెషల్ అల్లం పచ్చడి!

స్ట్రీట్ స్టైల్ మసాలా పాస్తా..ఇలా చేస్తే అదిరిపోతుంది!

భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్న యాంటీ-ఏజింగ్ విప్లవం..మరీ ఎందుకింత పిచ్చి!

గుమ్మడి వడియాలు..పక్కా కొలతలతో ఇలా చేయండి!

కేఫ్ స్టైల్ క్రీమీ మష్రూమ్ శాండ్‌విచ్..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి!

అమ్మమ్మల కాలం రుచితో రామ్ముల్కాయల చారు..వేడివేడి అన్నంలోకి అద్భుతం!

Big Stories

Advertisement
×