E-Paper
Advertisement

గుమ్మడి వడియాలు..పక్కా కొలతలతో ఇలా చేయండి!

గుమ్మడి వడియాలు..పక్కా కొలతలతో ఇలా చేయండి!
Advertisement

Gummadi vadiyalu:మన తెలుగు సంప్రదాయ వంటకాల్లో వడియాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో.. ఎండలు బాగా కాసే సమయంలో.. ప్రతి ఇంట్లో వడియాలు పెట్టడం ఒక అందమైన సంప్రదాయం. అందులోనూ రుచిలో, ఎంతో ప్రత్యేకమైనవి గుమ్మడి వడియాలు. పప్పు చారు, సాంబార్ లేదా రసం అన్నంలో వేడి వేడిగా వేయించుకున్న గుమ్మడి వడియాన్ని నంచుకుని తింటే.. ఆ రుచిని మాటల్లో వర్ణించలేం. సంవత్సరమంతా నిల్వ ఉండే.. ఈ గుమ్మడి వడియాలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

బూడిద గుమ్మడికాయ –1 మీడియం సైజు

Advertisement

మినపప్పు లేదా మినప గుండ్లు –1 కప్పు

పచ్చిమిర్చి – 6 నుంచి 8

Advertisement

అల్లం ముక్క – చిన్నది

జీలకర్ర – 1 టేబుల్ స్పూన్

ఇంగువ – చిటికెడు

ఉప్పు – రుచికి తగినంత

తయారీ విధానం:

ముందు రోజు రాత్రే మినపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. కనీసం 4 నుంచి 6 గంటల పాటు పప్పు నానితే రుబ్బడానికి ఈజీగా ఉంటుంది.

1.మరుసటి రోజు ఉదయం బూడిద గుమ్మడికాయ చెక్కు తీసి, లోపలి గింజల భాగం తొలగించి, గుజ్జును తురుముకోవాలి. ఈ తురుములో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చేతితో గట్టిగా పిండి ఆ నీటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గుమ్మడి నీటిని పారబోయకుండా, మినపప్పు రుబ్బేటప్పుడు నీళ్లకు బదులుగా వాడుకుంటే వడియాలకు అద్భుతమైన రుచి వస్తుంది.

2.ఇప్పుడు మిక్సీ లేదా గ్రైండర్‌లో నానబెట్టిన మినపప్పు వేసి, గుమ్మడికాయ నుంచి తీసిన నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా, నునుపుగా రుబ్బుకోవాలి. పిండి మరీ జారుగా కాకుండా.. వడియాలు వేయడానికి వీలుగా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి.

3.రుబ్బిన మినప్పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, అందులో పిండిని గారెల పిండిలా బాగా గిలకొట్టాలి. ఇలా గిలకొట్టడం వల్ల పిండిలోకి గాలి చేరి, వడియాలు వేయించినప్పుడు గుల్లగా, కర కరలాడుతూ వస్తాయి. ఆ తర్వాత ఇందులో తురుముకున్న గుమ్మడి గుజ్జు, కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఇంగువ, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలపాలి.

ఎండలో ఆరబెట్టే పద్ధతి:

వడియాలు వేయడానికి ఎండ బాగా కాసే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. డాబా లేదా వరండాలో.. శుభ్రమైన కాటన్ క్లాత్ లేదా ప్లాస్టిక్ షీట్ పరచాలి. పిండిని చిన్నచిన్న ముద్దలుగా ..తీసుకుంటూ వరుసగా వడియాలు వేయాలి. మరీ పెద్దవిగా కాకుండా.. మీడియం సైజులో వేసుకుంటే త్వరగా, సమానంగా ఎండుతాయి.

Also Read: 10 నిమిషాల్లో స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా..పిల్లలకు ఇష్టమైన ఈజీ స్నాక్!

వడియాలను కనీసం రెండు నుంచి మూడు రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. మొదటి రోజు.. సాయంత్రం అయ్యే సరికి వడియాలు కొద్దిగా గట్టిపడతాయి. అప్పుడు వాటిని బట్ట లేదా షీట్ నుంచి నెమ్మదిగా తీసి ప్లేట్‌లో వేసి మళ్లీ ఎండలో పెట్టాలి. పూర్తిగా తేమ పోయి, గట్టిగా, కరకరలాడే స్థితికి వచ్చే వరకు ఎండబెట్టాలి.

బాగా ఎండిన గుమ్మడి వడియాలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. తినాలనుకున్నప్పుడు ఫ్యాన్ లో నూనె వేడి చేసి, మీడియం మంట మీద వడియాలను బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పు, సాంబార్, టమాటో రసం లేదా పెరుగన్నంతో వీటిని తింటే అద్భుతంగా ఉంటుంది.

Related News

కేఫ్ స్టైల్ క్రీమీ మష్రూమ్ శాండ్‌విచ్..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి!

అమ్మమ్మల కాలం రుచితో రామ్ముల్కాయల చారు..వేడివేడి అన్నంలోకి అద్భుతం!

10 నిమిషాల్లో స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా..పిల్లలకు ఇష్టమైన ఈజీ స్నాక్!

కొబ్బరి లేకపోయినా పర్లేదు.. ఈ ఒక్క పద్ధతిలో చట్నీ చేస్తే ఇడ్లీ, దోశలు ఇంకాస్త ఎక్కువే తింటారు!

ఇంట్లోనే క్రిస్పీ వెజిటబుల్ కట్లెట్స్.. ఈవెనింగ్ స్నాక్‌గా అదిరిపోతాయి!

రెడ్ సాస్ పాస్తాకు అసలైన ఇటాలియన్ రుచి రావాలంటే ఇలా చేయండి!

ఫ్లిప్ కార్ట్ సేల్‌లో వాషింగ్ మెషీన్లు, ఫ్రిడ్జ్‌లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×