E-Paper
Advertisement

మిగిలిన అన్నంతో ఇలా చేయండి.. ప్లేట్ ఖాళీ కావడం గ్యారంటీ!

మిగిలిన అన్నంతో ఇలా చేయండి.. ప్లేట్ ఖాళీ కావడం గ్యారంటీ!
Advertisement

Masala Rice:రోజు రెగ్యులర్‌గా, రొటీన్‌గా అవే మళ్లీ మళ్లీ వండి బోర్ కొట్టేస్తుందా?అయితే ఇడ్లీ, దోశ, చపాతీ చేసి విసుగు వస్తుందా?అయితే మీకోసం ఈరోజు సరికొత్తగా, చాలా ఈజీగా అయిపోయే మసాలా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

స్కూల్‌కి వెళ్లే పిల్లలే కాకుండా, ఆఫీస్‌లకు వెళ్లే వాళ్లు కూడా టిఫిన్ బాక్స్‌లో తీసుకెళ్లేందుకు ఇది బెస్ట్ ఆప్షన్.

మసాలా రైస్‌కు కావాల్సిన పదార్థాలు

  • బియ్యం – 2 కప్పులు
  • నెయ్యి – 2 చెంచాలు
  • జీలకర్ర – 1 పెద్ద చెంచా
  • ఉల్లిపాయలు – 2
  • టమాటాలు – 2 లేదా 3
  • పచ్చిమిర్చి – 1 లేదా 2
  • పెసరపప్పు – కొద్దిగా
  • కారం పొడి – తగినంత
  • మసాలా పొడి లేదా గరం మసాలా – కొద్దిగా
  • ఉప్పు – తగినంత
  • కొత్తిమీర – కొద్దిగా

ముందుగా అన్నాన్ని సిద్ధం చేసుకోండి

Advertisement

ముందుగా బియ్యం ఉడికించుకుని అన్నాన్ని  విడిగా ఉండేలా సిద్ధం చేసుకోవాలి.ఇంట్లో మిగిలిన అన్నం ఉంటే అదే వాడినా సరిపోతుంది.

మసాలా ఎలా తయారు చేయాలి?

ఇప్పుడు ఒక బాణలిలో నెయ్యి వేసి వేడి అయ్యాక జీలకర్ర వేయాలి.వెంటనే ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి బాగా మెత్తబడే వరకు ఉడికించాలి.

పెసరపప్పుతో రుచి రెట్టింపు

Advertisement

ఇప్పుడు కారం పొడి, మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.తర్వాత పెసరపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పప్పు ఉడికే వరకు మూత పెట్టాలి.పప్పు పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉంటేనే రుచి ఇంకా బాగుంటుంది.

అన్నంతో కలిపి వేయిస్తే రెడీ

ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసి మెల్లగా కలపాలి.అన్నానికి మసాలా మొత్తం బాగా పట్టేలా రెండు మూడు నిమిషాలు సన్నని మంటపై వేయించాలి.చివరగా కొత్తిమీర చల్లితే వేడి వేడి మసాలా రైస్ రెడీ.

టిఫిన్ బాక్స్‌కు బెస్ట్ ఆప్షన్

ఈ మసాలా రైస్ స్కూల్‌కి వెళ్లే పిల్లలకు, ఆఫీస్‌కి వెళ్లే వాళ్లకు బెస్ట్ ఆప్షన్.ఉదయం త్వరగా అయిపోతుంది. మధ్యాహ్నం వరకు కూడా టేస్ట్ అలాగే ఉంటుంది.పెరుగు, రైతా లేదా అప్పడంతో తింటే మరింత బాగుంటుంది.

ఇంకా టేస్ట్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

కొద్దిగా జీడిపప్పు, వేరుశెనగలు వేయించి కలిపితే క్రంచీ టేస్ట్ వస్తుంది.క్యారెట్, బఠానీ, బీన్స్ లాంటి కూరగాయలు కూడా వేసుకోవచ్చు.చివర్లో కొద్దిగా నిమ్మరసం పిండితే ఫ్లేవర్ మరింత పెరుగుతుంది.

ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది

రోజూ ఒకే రకం టిఫిన్లతో బోర్ కొట్టేస్తే.. ఈసారి ఈ మసాలా రైస్ ట్రై చేయండి.తక్కువ సమయంలో రెడీ అవుతుంది.. రుచి కూడా అదిరిపోతుంది.మరి మీరూ ఒకసారి ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా!

also read:ఉదయం గంటలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఎలా రెడీ చేయాలి?..

Tags

Related News

సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

మంచి వ్యక్తుల ఈ అలవాట్లే వారి బలహీనతలు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌లతో సతమతమవుతున్నారా? స్ట్రెస్ తగ్గేందుకు 5 నిమిషాలు ఇలా చేయండి!

వాడిన టీ బ్యాగ్స్ పారేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే.. వాటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Big Stories

Advertisement
×