E-Paper
Advertisement

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!
Advertisement

Fastrack Revoltt XR1: ప్రస్తుత కాలంలో చేతికి వాచ్ పెట్టుకోవడం అంటే కేవలం సమయం చూడటమే కాదు, అదొక స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారిపోయింది. అందులోనూ స్మార్ట్‌ వాచ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో ప్రతి ఒక్కరూ వీటిని ఇష్టపడుతున్నారు. యూత్ లో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ప్రముఖ బ్రాండ్ ఫాస్ట్‌ట్రాక్, తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో గ్యాజెట్లను అందిస్తూ వస్తుంది. ఈ కోవలోనే వచ్చిన ‘Fastrack Revoltt XR1’ స్మార్ట్‌వాచ్ ప్రస్తుతం టెక్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ. 1,699 ధర కేటగిరీలో లభిస్తుండటంతో కాలేజ్ స్టూడెంట్స్ నుంచి ఆఫీస్ గోయర్స్ వరకు అందరూ దీని వైపు ఆకర్షితులవుతున్నారు. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.స్టైలిష్ లుక్ , సూపర్ ఫీచర్లతో వస్తున్న ఈ వాచ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

స్టైలిష్ డిజైన్, డిస్‌ప్లే:

ఈ స్మార్ట్‌ వాచ్ చూడటానికి చాలా ప్రీమియంగా, మోడర్న్ లుక్‌లో ఉంటుంది. దీని పెద్ద డిస్‌ ప్లే కలర్‌ఫుల్‌గా , క్లియర్‌గా సమాచారాన్ని అందిస్తుంది. ఎండలో బయటికి వెళ్లినప్పుడు కూడా స్క్రీన్ మీద ఉన్న విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీని డిజైన్ చాలా లైట్‌ వెయిట్‌గా ఉండటం వల్ల చేతికి పెట్టుకున్నప్పుడు ఎలాంటి బరువు అనిపించదు. రోజంతా వాడినప్పటికీ చాలా సౌకర్య వంతంగా ఉంటుంది.

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్:

Advertisement

ఈ బడ్జెట్‌లో లభించే అతిపెద్ద హైలైట్ బ్లూ టూత్ కాలింగ్ సపోర్ట్. ఫోన్ తీయకుండానే వాచ్‌ ద్వారా నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు, అంతే కాకుండా రిసీవ్ చేసుకోవచ్చు. ఇందులో.. బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ , స్పీకర్ ఇవ్వడం వల్ల ఆడియో క్లారిటీ చాలా బాగుంటుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ జేబులో నుంచి తీయకుండానే.. మాట్లాడే సౌలభ్యం దీని ద్వారా లభిస్తుంది.

హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్:

ఆరోగ్య స్పృహ ఉన్న వారికి ఈ స్మార్ట్‌ వాచ్ ఒక మంచి ట్రైనర్‌లా పని చేస్తుంది. ఇందులో.. హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్) లెవెల్స్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి ముఖ్యమైన హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే రకరకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం వల్ల రన్నింగ్, వాకింగ్, వర్కౌట్లు చేసే టప్పుడు మన ఫిట్‌నెస్ డేటాను కచ్చితంగా ట్రాక్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ క్వాలిటీ కావాలా? ఈ ఇయర్ బడ్స్‌ ట్రై చేయండి!

బ్యాటరీ బ్యాకప్, ఇతర ఫీచర్లు:

ఒక సారి ఛార్జ్ చేస్తే.. ఈ వాచ్ రోజంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేస్తుంది. సాధారణ వాడకంలో.. దీని బ్యాటరీ లైఫ్ చాలా సంతృప్తికరంగా ఉంటుంది. వాట్సాప్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు, కాల్ అలర్ట్‌లు అన్నీ మన చేతికే అందుతాయి. దీనిలో వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండటం వల్ల వర్షంలో తడిచినా లేదా చెమట పట్టినా ఎలాంటి సమస్య ఉండదు.

మొత్తంగా చూస్తే.. రూ. 1,699 బడ్జెట్‌లో బ్లూటూత్ కాలింగ్, స్టైలిష్ లుక్ ,హెల్త్ ఫీచర్లు కలిగిన వాచ్ కావాలనుకునే వారికి ఈ మోడల్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది నిజంగా వాల్యూ  -ఫర్-మనీ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు.

Related News

మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

మంచి వ్యక్తుల ఈ అలవాట్లే వారి బలహీనతలు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌లతో సతమతమవుతున్నారా? స్ట్రెస్ తగ్గేందుకు 5 నిమిషాలు ఇలా చేయండి!

వాడిన టీ బ్యాగ్స్ పారేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే.. వాటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

మొదటి పరిచయంలోనే అందరికీ నచ్చాలంటే ఈ 5 లక్షణాలు తప్పనిసరి.. మీలో ఉన్నాయా?

Big Stories

Advertisement
×