Cooking Tips:ఉదయం లేవగానే చాలామందికి ఎదురయ్యే పెద్ద సమస్య బ్రేక్‌ఫాస్ట్ చేయడం.. అది కూడా త్వరగా.ఎందుకంటే ఒకవైపు పిల్లలు స్కూల్‌కి వెళ్లే తొందరలో ఉంటారు. మరోవైపు భర్త ఆఫీస్‌కి రెడీ అవుతూ ఉంటాడు.
వీళ్ల అవసరాలు అన్నీ తీరుస్తూ, ఇంకోవైపు వీళ్లకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ త్వరగా చేయాలి అంటే ఒక రకంగా టెన్షన్ వచ్చేస్తుంది.ఏ రకంగా చూసినా గజిబిజి గోల.. గందరగోళమే. మరి అలాంటి టెన్షన్ ఏమీ తీసుకోకుండా త్వరగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేయాలంటే ఇదిగో ఈ చిన్న చిన్న అలవాట్లు చేసేసుకోండి.ఒక గంటలోనే రెండు పనులు చాలా చక్కగా పూర్తి చేసుకోవచ్చు.
ముందుగా తెల్లవారితే ఏం వండాలో రాత్రికే డిసైడ్ చేసుకోండి.ఎందుకంటే ఉదయం లేచాక ఏం చేయాలి.. ఏం వండాలి అని ఆలోచిస్తూ సమయాన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఏం కూర చేయాలో డిసైడ్ అయ్యాక రాత్రే ఆ కూరగాయలు కడిగి ఫ్రిజ్‌లో పెట్టేసుకోండి.ఒకవేళ పప్పు ఏమైనా వేయాలి అనుకుంటే రాత్రే ఆ పప్పు నానబెట్టేసుకోండి.ఇలా గనుక చేస్తే ఉదయం మీ పని సగానికి సగం తగ్గిపోతుంది.
ఇంకో మంచి అలవాటు ఏంటంటే.. అన్నం కుక్కర్లో పెట్టి అది ఉడికేలోపు బ్రేక్‌ఫాస్ట్ మొదలెట్టండి.ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్.. ఒక సింపుల్ లంచ్ చాలు.. ఇలా త్వరగా అయ్యేది ప్లాన్ చేసుకోండి.ఇడ్లీ, దోశ, ఉప్మా, అటుకుల ఉప్మా.. ఇలా త్వరగా అయ్యేది ఏదైనా సరే.లంచ్‌కి ఒక అన్నం, ఒక కూర, ఒక పప్పు లేదా చపాతీతో ఒక కర్రీ.. తొందర ఉన్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి.త్వరగా అయిపోతాయి.. ఆరోగ్యానికి కూడా మంచివే.
ఇక అన్నిటికన్నా ముఖ్యం కిచెన్ ఎలా ఉందన్నది.ఉప్పు కోసం ఒకచోట.. కారం కోసం ఇంకోచోట.. నూనె కోసం మరొకచోట వెతికితే సమయం మొత్తం అక్కడే గడిచిపోతుంది.అలా కాకుండా మీరు ఎక్కువగా వాడే వస్తువులన్నీ చేతికి అందేలా దగ్గరగా పెట్టుకోండి.ఇవి సింపుల్‌గా అనిపించినా.. వీటి వల్ల చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది.
ఇంకో చిన్న టిప్ ఏంటంటే.. కూరల్లో వేసే అల్లం-వెల్లుల్లి పేస్ట్ ముందుగానే ఒక వారానికి సరిపడా రెడీ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టేసుకోండి.ఇంకా చట్నీ పొడికి కావాల్సిన కొబ్బరి తురుము కూడా ముందే రెడీగా ఉంచుకోండి.ఎందుకంటే రోజూ కొత్తగా చేస్తే దానికి సమయం చాలా కేటాయించాల్సి ఉంటుంది.
ఇక ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే ఫోన్‌లో మునిగిపోకుండా ఆ సమయాన్ని వంటకు కేటాయిస్తే చాలా సమయం కలిసి వస్తుంది.పది నిమిషాలు మొబైల్ పక్కన పెట్టేస్తే.. గంట పట్టాల్సిన పని అరగంటలోనే అయిపోతుంది.
ఇక వంట అయిపోయాక వెంటనే స్టవ్, స్లాబ్, సింక్ ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకోండి.ఎందుకంటే మరుసటి రోజు ఉదయం శుభ్రమైన కిచెన్ కనిపిస్తేనే వంట చేయాలనిపిస్తుంది.
ఇలా చిన్న చిన్న అలవాట్లే పెద్ద మార్పులు తీసుకొస్తాయి.మరి ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి.. ఉదయాన్నే మీరు కూడా త్వరగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కంప్లీట్ చేస్తారు కదా!
also read :చిన్న కిచెన్‌ను పెద్దదిలా చూపించే సింపుల్ ట్రిక్స్!