BigTV English

Dandruff Control Tips: చుండ్రు సమస్యతో విసిగిపోయారా ? ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి

Dandruff Control Tips: చుండ్రు సమస్యతో విసిగిపోయారా ? ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి

Dandruff Control Tips: ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. జుట్టు రాలడానికి చుండ్రు కూడా ప్రధాన కారణం. తరుచుగా తల స్నానం చేస్తున్నా, రకరకాల షాంపూలు వాడుతున్నా కూడా ఈ సమస్య శాశ్వతంగా తొలగిపోదు. దీనివల్ల జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. చుండ్రును తగ్గించుకోవడానికి తరుచూ తలస్నానం చేసినా ఫలితం ఉండదు. తలస్నానం చేసిన మరుసటి రోజే జుట్టు జిడ్డులా తయారవుతుంది.


ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి చుండ్రు సమస్యతో పాటు జుట్టు రాలే సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు గడ్డిలా తయారవడానికి కారణం మాడు మీద ఎక్కువ నూనెలు విడుదల కాకపోవడం. ఇది పొడి చర్మం లాంటి ఒక రకమైన సమస్యకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ సమస్య వయస్సు పెరిగే కొద్దీ కనిపిస్తుంది. 40 ఏళ్ల పైబడిన వారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది.
కారణాలు ఇవే..
అతిగా తలస్నానం చేయడం, రసాయనాలతో కూడిన షాంపూలు వాడటం,స్టైలింగ్ ఉత్పత్తుల వాడకం, హీట్ స్టైలింగ్ పరికరాలను వాడటం, డ్రైయర్‌తో జుట్టును ఆరబెట్టడం, ఎండలో బాగా తిరగడం వంటి కారణాలతో తలపై నూనెలు విడుదల కావు. కొన్నిసార్లు ఈ సమస్య వంశ పారంపర్యంగా కూడా రావడంతో జుట్టు రాలే సమస్యలు మరింత పెరుగుతుంది. అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీని ద్వారా జుట్టు రాలే సమస్యను మనం కొంత వరకు తగ్గించుకోవచ్చు.
జుట్టు ఆరోగ్యంగా ఉండటం కోసం ఇలా చేయండి..
జుట్టు గడ్డిలా మారుతున్నప్పుడు దానిని తగ్గించడం కోసం, ఆరోగ్యంగా ఉండటానికి వారానికి రెండుసార్లకు మించి తలస్నానం చేయకూడదు. అలాగే తలస్నానం చేసే ముందు తప్పకుండా ఆలివ్, కొబ్బరి నూనెలతో మర్దనా చేసుకోవాలి. తర్వాత కండిషనింగ్ చేసుకోవాలి. అలాగే కెమికల్స్ లేని హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించాలి. హెన్నా, కలరింగ్ ఉత్పత్తులను అస్సలు వాడకూడదు. అలాగే వారానికొకసారి హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మాస్క్ ఇలా తయారు చేసుకోండి..
హెయిర్ మాస్క్‌ను సహజంగా తయారు చేసుకుంటే మంచిది. ఇందుకోసం ఒక కప్పులో కొద్దిగా ఆలివ్ నూనెను తీసుకుని దీన్ని జుట్టుకు అప్లై చేసుకోండి. ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి పోషణ లభిస్తుంది. సల్ఫేట్, పారాబెన్, ఫార్మాల్డిహైడ్, హెక్సా క్లోరోఫిన్ వంటివి లేని షాంపూలను ఉపయోగించండి. సిలీనియం డైసల్ఫైడ్, ట్రీ ట్రీ ఆయిల్ ఉన్న ఉత్పత్తులను వాడటం వల్ల చుండ్రు పోవడమే కాకుండా కేశాలు మెరుస్తాయి.

Also Read: పెన్ మరకలను తొలగించడానికి అద్బుతమైన చిట్కాతో చెక్


ఫుడ్ బెస్ట్..
హెయిర్ ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారాన్ని డైట్‌ లో భాగంగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. చేపలు, గుడ్లు పాలకూర, జామ, సిట్రస్ వంటివి డైట్‌లో చేర్చుకోండి. వీలైతే వంటల్లో ఆలివ్ నూనెను ఉపయోగించడం మంచిది.

Tags

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×