BigTV English

Car Sales Decline in June: ఇలా అయిందేంటి.. భారీగా క్షీణించిన జూన్ 2024 కార్ సేల్స్.. ఇదిగో లిస్ట్!

Car Sales Decline in June: ఇలా అయిందేంటి.. భారీగా క్షీణించిన జూన్ 2024 కార్ సేల్స్.. ఇదిగో లిస్ట్!

Car Sales Decline in June 2024: ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశీయంగా కూడా ఆటో మొబైల్ మార్కెట్ బాగా అభివృద్ది చెందుతోంది. భారత దేశంలో ఆటో మొబైల్‌ రంగానికి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రముఖ కంపెనీలు సైతం తమ వాహనాలను దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. అయితే కంపెనీలు ప్రతి నెల తమ వాహనాలను విపరీతంగా సేల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటాయి. అలాగే వాటిపై వర్క్ చేసి అధిక వాహనాలను సేల్ చేసి లాభాలు అందుకుంటాయి.


ఇక ఆ సేల్‌కు సంబంధించిన రిపోర్టులను ఎప్పటికప్పుడు కంపెనీలు వెల్లడిస్తుంటాయి. ఇందులో భాగంగానే గత నెల కార్ల సేల్స్‌ రిపోర్ట్‌ను కంపెనీలు రిలీజ్ చేశాయి. అందులో చాలా కార్లు విపరీతమైన సేల్స్ నమోదు చేశాయి. కానీ మరికొన్ని మంచి పాపులర్ ఉన్న కార్లు.. గతేడాది జూన్ కంటే ఈ ఏడాది జూన్‌లో చాలా తక్కువ సేల్స్‌ను నమోదు చేశాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 2024లో సేల్స్‌లో క్షీణించిన ఎనిమిది ప్రసిద్ధ కార్లు ఇక్కడ ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్ R:


మారుతి సుజుకి వ్యాగన్ R మోడల్ జూన్ 2023లో 17,481 యూనిట్లు సేల్ చేస్తే.. 2024 జూన్‌లో కేవలం 13,790 యూనిట్ల సేల్స్‌ని నమోదు చేసింది. దీని బట్టి చూస్తే గణనీయమైన తగ్గుదలని చూసింది. ఏకంగా ఇది 21% క్షీణతను చవిచూసింది.

Also Read: జూన్‌ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్..పెరిగాయా? తగ్గాయా?

టాటా నెక్సాన్:

టాటా నెక్సాన్ కూడా భారీ తగ్గుదలని చవిచూసింది. జూన్ 2023లో 13,827 యూనిట్ల సేల్స్ జరగగా.. జూన్ 2024లో 12,066 యూనిట్లను విక్రయించింది. దీని బట్టి చూస్తే ఇది 13% తగ్గుదలని కనబరచింది.

హ్యుందాయ్ వెన్యూ:

అదేవిధంగా హ్యుందాయ్ వెన్యూ కూడా ఊహించని క్షీణతను నమోదు చేసింది. జూన్ 2023లో 11,606 యూనిట్లతో పోలిస్తే జూన్ 2024లో కేవలం 9,890 యూనిట్లను సేల్ చేసింది. ఫలితంగా 15% క్షీణితను చవిచూసింది.

గ్రాండ్ విటారా:

మారుతి సుజుకి గ్రాండ్ విటారా జూన్ 2023లో 10,486 యూనిట్లు విక్రయించగా.. జూన్ 2024లో కేవలం 9,679 యూనిట్లు మాత్రమే సేల్ చేసింది. దీని బట్టి గ్రాండ్ విటారా స్వల్ప తగ్గుదలని కలిగి ఉంది. ఏకంగా ఇది 8% తగ్గుదల నమోదు చేసింది.

మారుతీ సుజుకి ఆల్టో:

మారుతీ సుజుకి ఆల్టో జూన్ 2023లో 11,323 యూనిట్లు అమ్ముడు కాగా.. జూన్ 2024లో ఊహించని విధంగా కేవలం 7,775 యూనిట్లు సేల్ అయ్యాయి. దీనిబట్టి ఇది గణనీయమైన క్షీణతను చవిచూసింది. ఇది 31% తగ్గుదలని కలిగి ఉంది.

Also Read: చీపెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ధర తక్కువ.. రేంజ్ చాలా ఎక్కువ!

మహీంద్రా బొలెరో:

మహీంద్రా బొలెరో కూడా క్షీణతను చవిచూసింది. జూన్ 2023లో 8,686 యూనిట్లతో పోలిస్తే జూన్ 2024లో 7,365 యూనిట్లను మాత్రమే సేల్ చేసి 15% తగ్గుదలను చవిచూసింది.

హ్యుందాయ్ i20:

హ్యుందాయ్ i20 జూన్ 2023లో 6,162 యూనిట్లతో పోలిస్తే 2024 జూన్‌లో 5,315 యూనిట్లను సేల్ చేసింది. ఫలితంగా 14% క్షీణించింది.

టాటా టియాగో:

టాటా టియాగో 2023లో 8,135 యూనిట్లు అమ్ముడయ్యాయి. అలాగే జూన్ 2024లో కేవలం 5,174 యూనిట్ల అమ్మకాలతో గణనీయమైన తగ్గుదలని చూసింది. ఇది 36% క్షీణతను చవిచూసింది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×