BigTV English

Shanthi’s husband Madhan Press meet: శాంతికి పుట్టిన మగబిడ్డ ఎవరికి పుట్టాడో తేల్చాలి: భర్త మదన్

Shanthi’s husband Madhan Press meet: శాంతికి పుట్టిన మగబిడ్డ ఎవరికి పుట్టాడో తేల్చాలి: భర్త మదన్

Shanthi’s husband Madhan press meet: శాంతికి పుట్టిన మగ బిడ్డ ఎవరికి పుట్టాడో తేల్చాలి అని దేవాదాయశాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్ మాట్లాడుతూ.. ‘నేను గిరిజన వ్యక్తిని. లా చదివిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. 2013లో నంద్యాల జిల్లాకు చెందిన శాంతిని పెళ్లి చేసుకున్నా. శాంతిది, నాది ఒకే సామాజిక వర్గం. 2015లో మాకు కవల పిల్లలు పుట్టారు. చిన్నప్పటి నుంచి నాకు విప్లవ భావాలు ఎక్కువ. శాంతిని ఎడ్యుకేషన్ పరంగా ప్రోత్సహించాను. ఇద్దరం కలిసి ఓ ఇల్లు కూడా కొనుకున్నాం. శాంతిని చిన్నతనంలో వాళ్ల నాన్న వదిలేశాడు. ఆమె కుటుంబ పరిస్థితి చూసి కూడా పెళ్లి చేసుకున్నా. 2020లో దేవాదాయశాఖలో శాంతికి ఉద్యోగం వచ్చింది. శాంతికి ఉద్యోగం వచ్చాక.. పీహెచ్ డీ చేసేందుకు నేను అమెరికా వెళ్లాను. కరోనా సమయంలో మళ్లీ నేను ఇండియాకు వచ్చాను. శాంతి ఒత్తిడితో మళ్లీ అమెరికా వెళ్లాను. నా భార్య శాంతి బిహేవియర్ విచిత్రంగా ఉండేది. తీరు మార్చుకోవాలని చాలాసార్లు హెచ్చిరించాను’ అని అన్నారు.


‘విజయసాయి రెడ్డిని నాకు శాంతినే పరిచయం చేసింది. విల్లా కొనేందుకు విజయసాయిరెడ్డి డబ్బులు ఇచ్చాడు. విజయసాయి రెడ్డితో నేను కూడా ఫొటోలు దిగా. రూ. 4 కోట్లతో విజయవాడలో విల్లా కొనాలని శాంతి అన్నది. విజయసాయిరెడ్డికి ల్యాండ్ విషయంలో హెల్ప్ చేశానంటూ శాంతి చెప్పింది’ అంటూ మదన్ పేర్కొన్నారు.

Also Read: వైసీపీ భూ దందాలు, వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల


‘2020 సెప్టెంబర్ లో విజయసాయిరెడ్డి రూ. కోటి ఇచ్చారు. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా. విజయసాయిరెడ్డిని నేను చాలా నమ్మాను. డబ్బుల గురించి శాంతిని అడిగితే విజయసాయిరెడ్డికి సాయం చేయడంతో ఇచ్చారని అని చెప్పింది. నేను అమెరికా వెళ్లాక.. శాంతి గర్భం దాల్చింది. ఎలా అయ్యావు అని అడిగితే చెప్పుతో కొడతా అని తిట్టింది. డెలివరీ కోసం శాంతి విశాఖ వెళ్లింది. బాబు పుట్టిన దగ్గర నుంచి శాంతి నన్ను దూరం పెట్టింది. శాంతి గర్భం దాల్చాక విజయసాయిరెడ్డికి నేను మెస్సేజ్ చేశాను. శాంతికి పుట్టిన మగబడ్డను నాకు చూపించలేదు. ఐవీఎఫ్ చేయించుకున్నా అని.. మా బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. భర్త లేకుండా ఐవీఎఫ్ ఎలా చేస్తారు. ఈ ఏడాది జనవరిలో శాంతిని ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ గురించి అడిగితే చెప్పలేదు. గట్టిగా అడిగితే విజయసాయిరెడ్డి పేరు చెప్పింది. విజయసాయిరెడ్డికి పిల్లలు లేరు.. అందుకే ఆయన కోసం మగబిడ్డను కన్నానని చెప్పింది’ అని ఆయన చెప్పారు.

Also Read: అత్యాచార నిందితుల్ని వదలం.. బాధితుల కుటుంబాలకు పరిహారం : హోంమంత్రి అనిత

‘ఐవీఎప్ బేబినా.. ఫిజికల్ గా కలిసి బేబిని కన్నారో తెలియదు. ఈ విషయం తెలిశాక.. నా గుండెలు పగిలేలా ఏడ్చాను. విజయసాయిరెడ్డితో బిడ్డను కన్నాను నన్ను వెళ్లిపోవాలని శాంతి అన్నది. మూడు నెలల నుంచి నన్ను శాంతి టార్చర్ చేస్తుంది. బేబి వివరాల్లో తండ్రి పేరు నా పేరు పెట్టారు. కే షీట్ గురించి అడిగితే తెల్లారే వివరాలు మార్చారు. తెల్లారే నా పేరు తీసేసి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పేరు మార్చారు. శాంతితో నేను విడాకులు తీసుకోలేదు. 2016లో శాంతికి నేను విడాకులు ఇవ్వలేదు. 2024 జూన్ 11న విడాకుల డాక్యుమెంట్ మీద సంతకం పెట్టా’ అంటూ మదన్ పేర్కొన్నారు.

‘2020 వరకు శాంతితో నేను కలిసే ఉన్నాను. నా ఇద్దరు పిల్లలు ప్రస్తుతం శాంతి దగ్గరే ఉన్నారు. ప్రతి నెలా పిల్లల కోసం డబ్బులు పంపిస్తున్నా. సుభాష్ రెడ్డిని శాంతి పెళ్లి చేసుకోలేదు. శాంతికి పుట్టిన మగబిడ్డతో తనకు సంబంధం లేదని సుభాష్ చెప్పాడు. పుట్టిన బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయాలి. డీఎన్ఏ టెస్టుకు నేను సిద్ధం.. విజయసాయిరెడ్డి సిద్ధమా..? డీఎన్ఏ టెస్ట్ ద్వారా బిడ్డ ఎవరికి పుట్టారో ప్రూవ్ చేయాలి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్టుకు రావాల్సిందే. ఆయన కాదు అని తేలితే మీడియా సాక్షిగా క్షమాపణ చెబుతా. నన్ను చంపేస్తారంటూ శాంతి బెదిరించింది’ అంటూ మదన్ మోహన్ పేర్కొన్నారు.

Tags

Related News

Pawan Kalyan: రాయలసీమ అభివృద్ధిపై.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: సీఎం చంద్రబాబు సూపర్ న్యూస్.. వారికి దసరా రోజున అకౌంట్లలోకి రూ.15వేలు

Jagan: మళ్లీ దొరికిపోయిన జగన్.. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ నిజాలు బయటపెట్టిన టీడీపీ

AP Dasara Holidays 2025: విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు

Minister Lokesh: రియల్ టైమ్ గవర్నెన్స్‌లో మంత్రి లోకేష్.. నేపాల్‌లో తెలుగువారితో వీడియో కాల్

AP Govt Plan: ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై నో ఆఫీసు, నేరుగా ఇంటికే

Big Stories

×