BigTV English

Six Pack Body : సిక్స్ ప్యాక్ కోసం చేయాల్సిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి ?

Six Pack Body : సిక్స్ ప్యాక్ కోసం చేయాల్సిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి ?

Food and Exercise for Sixpack Body : సినిమాల్లో స్టార్ హీరోల సిక్స్ ప్యాక్ బాడీలను చూసి తాము కూడా అలా తమ శరీరాన్ని మలుచుకోవాలని పురుషులు తాపత్రయం పడుతూ ఉంటారు. వేలకు వేలు డబ్బులు ఖర్చు చేసి జిమ్ లో చేరి వర్కౌట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే సరైన ట్రైనర్ అద్వర్యంలో వర్కౌట్స్ చేస్తూ, దానికి తగ్గట్టుగా సరైన ఆహారం తీసుకుంటూ సిక్స్ ప్యాక్ రావాలంటే ఎలాంటి వ్యాయామాలు చెయ్యాలి, ఎలాంటి ఆహరం తీసుకోవాలి అనేది ఇప్పుడు వివరంగా చూడబోతున్నాము. ఈ సిక్స్ ప్యాక్ శరీరం కోసం చాలా కఠినమైన శ్రమ, పట్టుదల తో పాటు, క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలి. ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం పడకుండా, సరైన క్రమపద్ధతిలో సిక్స్ ప్యాక్ కోసం చేయాల్సిన వ్యాయామాలు ఏమిటో ఒకసారి చూద్దాం.


ప్రతీ రోజు మన శరీరం లోని రెండు కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అంటే వారంలో ఒక కండరానికి సంబంధించిన వర్కౌట్ ప్రతీ రోజు రెండు సార్లు చేసేలా మీ ప్రణాళిక ఉండాలి.

అత్యధిక మంది అప్పర్, లోయర్ బాడీ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అయితే మా సలహా ఏమిటంటే మీ అత్యధిక సమయం కార్డియో వర్కౌట్స్ చెయ్యడానికి కేటాయించండి. కార్డియో చెయ్యడం వాళ్ళ మీ శరీరం లోని కొవ్వు వేగంగా కరిగి సిక్స్ ప్యాక్ కి అనుగుణంగా తయారు అయ్యేందుకు తోడ్పడుతుంది. రెగ్యులర్ వ్యాయామం తో పాటు రోజుకి 20 నుండి 40 నిమిషాల పాటు కార్డియో చెయ్యడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి.


Also Read : ధనియాలతో ఫుల్ బెనిఫిట్స్.. 15 రోజుల్లోనే బరువు తగ్గడం ఖాయం

కార్డియో తో పాటుగా అబ్‌డామినల్(పొట్ట) కు సంబంధించిన వర్కౌట్ కూడా మీ రోజువారీ వ్యాయమ ప్రణాళిక లో కచ్చితంగా ఉండాలి. వారం లో కనీసం 5 రోజులు అబ్‌డామినల్ వర్కవుట్ చెయ్యాల్సిందే. క్రంచెస్, బ్రిడ్జెస్ తో పాటుగా ప్లాంక్ వర్కౌట్స్ చెయ్యడం వల్ల మీ పొట్ట వేగవంతంగా తగ్గి సిక్స్ ప్యాక్ కి తగ్గట్టుగా తయారు అవుతుంది.

సిక్స్ ప్యాక్ త్వరగా వృద్ధి చెందేందుకు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అత్యవసరం. ఈ పద్దతి ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. అంటే వ్యాయామం సమయం లో మధ్యలో మధ్యలో మనం తీసుకునే విరామం సమయం చాలా స్వల్పంగా ఉండాలి. అలా చేస్తే హార్ట్ రేట్ పెరగడంతో పాటు శరీరంలోని కొవ్వు స్థాయి త్వరగా తగ్గుతుంది.

సరైన సమయంలో మంచి నీళ్లు తాగడం తప్పనిసరి. మన శరీరంలోని ఉష్ణోగ్రతని క్రమబద్దత చెయ్యడం తో పాటుగా, మలినాలను బయటకి పంపడంలో నీటిదే ప్రధాన పాత్ర. రోజుకి మూడు నుండి నాలుగు లీటర్ల మంచి నీరుని తాగడం తప్పనిసరి.

సిక్స్ ప్యాక్ రావాలంటే వ్యాయామంతో పాటుగా మనం తీసుకునే ఆహరం ఎలా ఉండాలి? ఎలాంటి ఆహారాన్ని మనం దూరం చేసుకోవాలి అనేది తెలియాలి అని ముందే మనం మాట్లాడుకున్నాం కదా. అవి ఏమిటో ఒకసారి వివరంగా చూద్దాం.

Also Read : బట్టతల రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి

సిక్స్ ప్యాక్ రావాలంటే ముందుగా మనం చేయాల్సిన పని జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్,చిప్స్ క్రాకర్ వంటి ఆహారాలను దూరం చెయ్యడం. వీటికి బదులుగా ప్రోటీన్ ఆధారిత ఆహరం అధికంగా తీసుకోవాలి. దీని వలన శరీరం లో కొవ్వు బాగా తగ్గి కేవలం కండరాలు ఒక క్రమపద్ధతిలో వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా వ్యాయామం పూర్తి అయిన వెంటనే నిర్దేశించిన సమయంలోగా ప్రోటీన్ ను తీసుకోవాలి. దీని వలన కండరాల్లో ఉండే టిష్యూస్ త్వరగా రికవరీ అవుతాయి.

అలాగే పౌల్ట్రీ ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, పప్పుధాన్యాలు, పండ్లు, కాయగూరలు తినాలి. ఎందుకంటే వీటిల్లో ప్రోటీన్ శాతం అత్యధికంగా ఉంటుంది. అలాగే ప్రాసెస్డ్ కార్బ్స్ ను కూడా పూర్తిగా మానేసి, జిటబుల్ సలాడ్స్ , అలాగే ఫైబర్ ఉండే ఆహారాన్ని మీ రోజువారీ ఆహార పట్టికలో చేర్చుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, సిక్స్ ప్యాక్ అనేది మీరు తీసుకునే ఆహరం మీద 80 శాతం ఆధారపడి ఉంటుంది. కేవలం 20 శాతం మాత్రమే అందులో వ్యాయామం కి చోటు దక్కుతుంది. కాబట్టి డైట్ అనేది తప్పనిసరి.

Tags

Related News

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Big Stories

×