Mehndi Tips: ఏ పండుగ అయినా లేదా వివాహం వంటి ఏదైనా ప్రత్యేక సందర్భం అయినా, ఇంట్లోని ఆడపిల్లలు, మహిళలు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఆహ్లాదకరమైన సువాసనతో కూడిన మెహందీ మీ అందాన్ని పెంచడమే కాకుండా మొత్తం రూపానికి కూడా అందాన్ని ఇస్తుంది. మతపరంగా కూడా మెహందీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే పెళ్లి సమయంలో కూడా మెహందీ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైన భాగం. పెళ్లి అనేది వధువు, లేదా వరుడికి గోరింటాకు పెట్టకుండా ఏంటే సంపూర్తిగా అనిపించదు.
ప్రతి స్త్రీ ముఖ్యంగా వధువు తన చేతులకు పెట్టుకున్న గోరింటాకు బాగా పండాలని అంతే కాకుండా.. చేతులకు గోరింట ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటుంది. ఈ రోజు మనం ఇంట్లోనే తయారు చేసుకునేందుకు కొన్ని చిట్కాలను చెప్పబోతున్నాం, తద్వారా మీ గోరింట కూడా చాలా రోజుల పాటు మీ చేతుల అందాన్ని పెంచుతుంది.
గోరింటాకు రంగు ముదురు రంగులోకి మారేందుకు చాలా మంది రకరకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఇలాంటి చిట్కాలు ఏవీ అంత ప్రభావవంతంగా అనిపించవు. అందుకే గోరింటాకు మంచి ముదురు రంగులోకి రావడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోరింటాకు చేతలు నుంచి తీసివేసిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ అవసరం. దాదాపు 24 గంటల పాటు దానిపై నీళ్లు అంటకుండా చూసుకోవాలి. ఇది చాలా కష్టమైన పని. అందుకే కేర్ ఆయిల్ , బామ్ అప్లై చేయడం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా మెహందీ చేతులపై రక్షిత పొర ఏర్పడుతుంది. దీని కారణంగా మెహందీ చేతులతో నీటిని తాకినా కూడా ఎలాంటి నష్టం ఉందడు. అంతే కాకుండా గోరింట చాలా కాలం పాటు చేతులకు ఉంటుంది.ఇందుకు అవసరమైన ఔషధతైలం, నూనెను మీరు సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, కాబట్టి వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెహందీ ఎర్రగా మారాలంటే ఏం చేయాలి ?
మెహందీ ఎక్కువ రోజులు ఉండాలంటే ఇంట్లోనే క్రీమ్ తయారు చేసుకుని వాడటం మంచిది. ఇందుకోసం మీకు కొబ్బరి నూనె, బాదం నూనె, 1 విటమిన్ ఇ క్యాప్సూల్స్ అవసరం అవుతాయి. కొబ్బరి నూనె, బాదం నూనెలు సమాన మోతాదులో తీసుకుని పాన్‌లో వేసి వేడి చేయండి. 2నిమిషాల తర్వాత గ్యాస్ ఆప్ చేసి చల్లారిన తర్వాత దీనిలో విటమిన్ ఇ క్యాప్సూల్ కలపండి. దీనిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ క్రీమ్‌ను మెహందీ తొలగించిన తర్వాత చేతులకు పూర్తిగా అప్లై చేయండి. దీనిని రోజులొో 2-3 సార్లు చేతులకు అప్లై చేసుకోవచ్చు. దీంతో గోరింటాకు రంగు ముదురు రంగులోకి మారి చాలా రోజులు ఉంటుంది.
Also Read: కొబ్బరి నూనెతో.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం
చేతులకు ఊరగాయ నూనె:
గోరింట తీసివేసిన తర్వాత, మీరు మీ చేతులకు మీ ఇంట్లో ఉంచిన పుల్లని ఊరగాయ నూనెను కూడా రాసుకోవచ్చు. ఇదే కాకుండా, దేశీ నెయ్యి, ఆవాల నూనె , కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు. ఇవి మీ చేతులపై అడ్డంకిని సృష్టిస్తాయి, దీని కారణంగా గోరింటాకుపై ప్రభావం చూపవు. అంతే కాకుండా మెహందీ ఎక్కువ రోజులు ఉంటుంది.