Pushpa 2 Movie : మరి కొన్ని రోజుల్లో ది మోస్ట్ అవెయిటెడ్ మూవీ థియేటర్స్‌లోకి రాబోతుంది. డిసెంబర్ 4 రాత్రి నుంచే పుష్ప 2 పండగ స్టార్ట్ కాబోతుంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో బెన్‌ఫిట్ షోల ద్వారా డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే థియేటర్స్ లోకి రాబోతుంది పుష్ప 2. అయితే ఈ సినిమా నుంచి కొన్ని విషయాలు బయటికొచ్చాయి. వాటిని అసలు మిస్ చేసుకోవద్దని చెబుతున్నారు. అందులో ఓ రొమాంటిక్ సీన్ కూడా ఉంది. అది ఏంటో ఇప్పుడు చూద్ధాం…
సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ ఘాటు ఎక్కువ ఉండటం ఈ మధ్య మనం చూస్తున్నాం. ఈ ఏడాది వచ్చిన టాప్ సినిమాల్లో మంచి రొమాంటిక్ సీన్ ఏది అంటే.. అందరు ఫస్ట్ చెప్పేది యానిమల్. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నాతో కానీ, తృప్తి దిమ్రితో కానీ, హీరో రణవీర్ కపూర్ చేసిన రొమాన్స్ ఇప్పటికీ కూడా మర్చిపోవడం లేదు.
రష్మిక కెరీర్‌లో ఫస్ట్ టైం…
ఇప్పుడు మరోసారి అలాంటి ఘాటు ఎక్కువ ఉన్న రొమాంటిక్ సీన్ లోడ్ అవుతుందని తెలుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 మూవీలో ఈ సీన్ ఉండబోతుంది. అల్లు అర్జున్, రష్మిక మధ్య ఈ సీన్ ఉంటుందట. రష్మిక కెరీర్‌లోనే టాప్ రొమాంటిక్ అంటే ఇక నుంచి పుష్ప 2 అనే ఆన్సర్ వచ్చేలా ఆ సీన్ ఉందని తెలుస్తుంది.
అసలు మిస్ చేయొద్దు…
పుష్ప 2 సినిమాలో అసలు మిస్ చేయకుండా చూడాల్సినవి కొన్ని సీన్స్ ఉన్నాయట. అందులో ఈ రొమాంటిక్ సీన్ కూడా ఒకటి అంటున్నారు. అల్లు అర్జున్ – రష్మిక మధ్య వచ్చే ఈ రొమాంటిక్ సీన్‌కు థియేటర్ లో ఫ్యాన్స్ నుంచి వచ్చే రచ్చ కూడా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంతలా హైప్ క్రియేట్ అవుతున్న ఈ సీన్ ఎన్ని నిమిషాలు ఉంటుందో, సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
భారీగా పెరిగిన టికెట్ ధరలు…
కాగా, కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెన్ ఫిట్ షోలతో పాటు టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఈ అనుమతుల వల్ల డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ పుష్ప 2 మూవీ ఒక రోజు ముందుగానే థియేటర్స్ లోకి రాబోతుంది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే బెన్ ఫిట్ షోల ద్వారా పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక టికెట్ ధరలను కూడా భారీగా పెంచారు.
ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.
డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటల షోకు టికెట్ ధర సింగిల్ స్క్రీన్‌లో 1121 రూపాయలు ఉండగా, మల్టీ ప్లెక్స్‌లో 1239 రూపాయలు ఉండబోతుంది.
అలాగే డిసెంబర్ 5 నుంచి మొదటి నాలుగు రోజులు సింగిల్ స్క్రిన్స్ లో 354 రూపాయలు ఉంటే, మల్టీ ప్లెక్స్ లో 531 రూపాయలు ఉండబోతుంది.
తర్వాత వచ్చే 5 నుంచి 12 రోజులకు సింగిల్ స్క్రిన్స్ లో 300 రూపాయలు. మల్టీ ప్లెక్స్‌లో 472 రూపాయలు
ఇక రిలీజ్ డేట్ తర్వాత 13 నుంచి 29 రోజుల వరకు సింగిల్ స్క్రిన్స్ లో టికెట్ ధర 200 రూపాయలు ఉంటే, మల్టీ ప్లెక్స్‌లో 354 రూపాయలు ఉంటుంది.