Tejeswi Madivada : టాలీవుడ్ యాక్టర్ తేజెస్వి మదివాడ పేరు తెలియని వాళ్ళు ఉండరు. 2013లో వచ్చిన మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ ద్వారా నటిగా మారింది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా మూవీ ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ లో నటించింది.. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్‌క్రీం’, దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘కేరింత’, ’సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాల్లో నటించి ఈమె మరింత ఫేమస్ అయ్యింది.. ఈ మధ్య బోల్డ్ బ్యూటీ ట్యాగ్ ను అందుకుంది. ఇక అడపాదడపా సినిమాలతో ఆడియన్స్ ను పలకరిస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అలాగే పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఈమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె రొమాన్స్ గురించి అదిరిపోయే స్టేట్మెమెంట్ ఇచ్చింది. సినిమాల్లో ప్రతి సన్నివేశాన్ని చేసే టైం లో చాలా సార్లు రిహారసల్స్ చెయ్యాలి. ఇమిటేటింగ్ సీన్స్, కిస్సింగ్ సీన్స్ చేసేటప్పుడు హీరోయిన్స్ ఇబ్బందుల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది. షూటింగ్ లో డైరెక్ట్ గా ముద్దు పెట్టుకుంటారా అని యాంకర్ ప్రశ్నించగా.. నీకు నేను షేక్ అందిస్తున్నాను. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు.. కాస్త ఏదైనా ఫీలింగ్ ఉండొచ్చు. కానీ, కంటిన్యూగా చేస్తే అందులో ఫీలింగ్ ఏముంటుంది. ఒక్క ముద్దు సీన్ చెయ్యడానికి 10 రోజులు టైం పడుతుంది. అన్ని సార్లు చెయ్యడం వల్ల ఫీలింగ్స్ ఉండవు అక్కడ కూడా ఫీల్ అయినట్లు నటించాలని మొహమాటం లేకుండా చెప్పేసింది.. సినిమా వాళ్ళకు అలవాటు అయిపోతుంది.. కాబట్టి సిగ్గు లాంటివి ఉండవు. అందుకే అ సీన్లు అంటే పర్వాలేదు అంటారని చెప్పకనే చెప్పేసింది..
ఆడ, మగ శృంగారం చెయ్యడం వల్లే మనం పుట్టాము. అది లేకుండా లైఫ్ లేదు. అలాగే మనం బట్టలేకుండానే పుట్టాం. కానీ మనం నేకెడ్ ఉండడానికి ఎందుకు అలా ఆలోచిస్తాం అనేది నాకు అర్థం కావడం లేదు. ఇండియాలో వీటీపై ఎక్స్పోజర్ లేదు. చిన్నప్పుడు టీవీలలో రొమాంటిక్ సీన్స్ వస్తే.. పేరెంట్స్ కళ్ళు మూసేవారు. కొంతమంది పిల్లలు అయితే.. అక్కడనుండి వెళ్ళిపోయే వారు. దీంతో పిల్లలలో కుతూహలం ఏర్పడుతుంది. అదే చిన్నప్పుడు నుండి అలవాటు చేస్తే.. అలాంటి ఫీలింగ్స్ ఉండవు కాదా’ అంటూ తేజస్వి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక నేను ఇండియాలో కాకుండా.. అమెరికాలో పుట్టి ఉంటే.. చిన్నప్పటినుండి నన్ను బికినీలు వేసుకొని ఇచ్చేవారు. ఏదైనా ప్రోగ్రాంలో బికినీ వేసుకున్న అంతా పట్టించుకునే వారు కాదు. కానీ, ఇండియాలో అలా వ్యవహరిస్తే కుదరదు కదా.. బోల్డ్ అంటే కనిపించడమా లేదా అలా ఉండటమా అర్థం కాదు అని ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. తనకు బ్యాడ్ నేమ్ ఉంది. కానీ ఆ పేరుతో నాకు అవసరం లేదు.. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అవుతున్నా అని చెప్పింది. మొత్తానికి ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..