Geranium Oil: సీజన్ ఏదైనా చర్మం, జుట్టు రెండింటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా చాలా మంది స్కిన్, హెయిర్ కేర్ కోసం వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీటితో ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ ఇలా జరగకుండా ఉండాలంటే స్కిన్, హెయిర్ కోసం ఉపయోగపడే ఆయిల్ తప్పకుండా వాడాలి. జెరేనియం ఆయిల్ చర్మం , జుట్టుకు మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. వీటిని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది.
వృద్ధాప్య సమస్యలను తగ్గించడంతోపాటు ముఖ్యంగా వెంట్రుకల స్కాల్ప్ పీహెచ్ స్థాయిని నియంత్రించే గుణం జెరేనియంలో ఉంది. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న జెరేనియం ఆయిల్ అంటే ఏమిటి ? ఆయిల్ వాడితే కలిగే మరిన్ని ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జెరేనియం ఆయిల్ :
జెరేనియం ఆయిల్ చర్మానికి చాలా మేలు చేస్తుంది.
దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఇది దక్షిణాఫ్రికాలో ఎకక్కువగా కనిపించే పువ్వు నుంచి తయారు చేస్తారు.
Geranium లేదా Pelargonium graveolens దక్షిణ ఆఫ్రికాకు చెందిన మొక్క.ఇది పుష్కలంగా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈ మొక్క యొక్క పూలు గులాబీ లాంటి వాసన కలిగి ఉంటాయి. ఈ మొక్క మూలాల నుండి పూల వరకు జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడంలో ఉపయోగపడుతుంది.
జెరేనియం నూనెను.. పూలు, ఆకులు, కాండం నుండి తయారు చేస్తారు. చర్మ సౌందర్యం కోసం వేల సంవత్సరాలుగా ఈ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. జెరేనియం నూనె చర్మం సంరక్షణకు ఉపయోగపడుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటిసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంది.దురద, జుట్టు రాలడం వంటి సమస్యలను తొలగిస్తుంది. అంతే కాకుండా మూలాల నుండి జుట్టుకు బలాన్ని అందిస్తుంది.
జుట్టుకు కలిగే ప్రయోజనాలు:
1.జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.
2.తలలో చుండ్రు , దురద నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
3.జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
4. స్కాల్ప్ యొక్క pH స్థాయిని నియంత్రిస్తుంది.
ఉపయోగించే విధానం:
జుట్టు యొక్క మంచి పోషణలో సహాయపడుతుంది: తలకు మసాజ్ చేయడానికి జెరేనియం నూనెను ఉపయోగించవచ్చు. దీని కోసం, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో 6-7 చుక్కల జిరేనియం నూనె కలపండి. తరువాత మీ జుట్టుకు మసాజ్ చేసి అరగంట పాటు అలాగే ఉంచండి. ఇప్పుడు షాంపూతో జుట్టును వాష్ చేసుకోండి.
Also Read: జుట్టు ఎక్కువగా రాలుతోందా ? అయితే వారానికోసారి ఇలా చేయండి
జుట్టుకు సీరమ్‌గా: ఒక టేబుల్‌స్పూన్ ఆర్గాన్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల అవకాడో ఆయిల్, 8 చుక్కల లావెండర్ ఆయిల్, 10 చుక్కల విటమిన్ ఇ ఆయిల్ , 10 చుక్కల జెరేనియం ఆయిల్ సీసాలో వేసి కలపండి . ఇప్పుడు హెయిర్ సీరం సిద్ధంగా ఉంది. దీనిని తకు ఉపయోగించండి.
హెయిర్ కండీషనర్‌గా: ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ,10 చుక్కల జెరేనియం నూనెను ఒక చిన్న గిన్నెలో కలపండి. తరువాత స్ప్రే బాటిల్‌లో నిల్వ చేయండి. తలస్నానం తర్వాత కండీషనర్‌గా దీనిని అప్లై చేసి 2 నుంచి 5 నిమిషాల తర్వాత నీటితో వాష్ చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.