BigTV English

Pushpa 2 : ‘ పుష్ప 2’ నుంచి శ్రీలీల పోస్టర్ వచ్చేసింది.. ఈసారి ఐటమ్ సాంగ్ తో మాస్ ట్రీట్ పక్కా..

Pushpa 2 : ‘ పుష్ప 2’ నుంచి శ్రీలీల పోస్టర్ వచ్చేసింది.. ఈసారి ఐటమ్ సాంగ్ తో మాస్ ట్రీట్ పక్కా..

Pushpa 2 : పాన్ ఇండియా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప సినిమా నేషనల్ వైడ్ రిలీజ్ అయ్యింది.. స్టోరీ నచ్చడంతో అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపించడం సినిమాకు ప్లస్ అయ్యింది. అలాగే ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ లో ఊరమాస్ లుక్ లో బన్నీ కనిపిస్తున్నాడని ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ను చూస్తే అర్థమవుతుంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండటం తో సినిమా పై హైప్ ను క్రియేట్ చేసేలా ఒక్కో అప్డేట్ ను వదులుతున్నారు. తాజాగా పుష్ప 2 ఐటమ్ సాంగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.


పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ లో హీరోయిన్ సమంత స్టెప్పులు వేసింది. పుష్ప 2 లో యంగ్ బ్యూటీ శ్రీలీల ను దించారు. గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. షూటింగ్ నుంచి ఓ ఫోటో కూడా లీక్ అయింది. తాజాగా మూవీ యూనిట్ అధికారికంగా శ్రీలీల పోస్టర్ ని రిలీజ్ చేసారు. పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ లో ది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల చేస్తుందని పుష్ప టీమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. నిన్నటీ వరకు కన్ఫ్యూజన్ ఉన్న దీనిపై క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

శ్రీలీల డ్యాన్స్ అదరగోడుతుంది అని ఆల్రెడీ ప్ర్రూవ్ చేసుకుంది. అల్లు అర్జున్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరు. దీంతో వీరిద్దరి కాంబోలో మాస్ ఐటెం సాంగ్ రాబోతుందంటే ఏ రేంజ్ లో స్టెప్పులు వేస్తారో ఈ ఇద్దరు చూడాలి.. మొదటి పార్ట్ లోని సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు వస్తున్న సాంగ్ అంతకు మించి ఉంటుందని టాక్ అప్పుడే నెట్టింట ప్రచారం జరుగుతుంది.. శ్రీలీల మార్క్ ను ఈ మూవీలో చూడొచ్చు.. అల్లు అర్జున్, శ్రీలీల మాస్ స్టెప్పులను ఎప్పుడెప్పుడు చూస్తామా అని బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.


ఇక ఎలా ఉంటుందో డిసెంబర్ 5 న తెలుస్తుంది. ఈ సినిమాను మొదటి ఆగస్టు 15 న రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు డైరెక్టర్ సుక్కు.. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా డిసెంబర్కు పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా, సాంగ్స్ మాత్రం భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇదే క్రేజ్ టాక్ రిలీజ్ అయ్యాక ఉంటుందేమో చూడాలి.. దాదాపుగా రూ. 500 కోట్ల తో సినిమా రూపొందుతుంది. 1000 కోట్ల టార్గెట్ తో థియేటర్లలోకి రాబోతుంది. ఏ మాత్రం రాబడుతుందో చూడాలి..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×