BigTV English

Ghee For Skin: నెయ్యితో మీ అందం రెట్టింపు అవడం పక్కా !

Ghee For Skin: నెయ్యితో మీ అందం రెట్టింపు అవడం పక్కా !

Ghee For Skin: నెయ్యిలో అనేక అనేక పోషకాలు ఉంటాయి. నెయ్యి శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. నెయ్యి తినడం వల్ల రక్తపోటు, అజీర్తి, మలబద్ధకం, బలహీనమైన కీళ్లు, పీసీఓఎస్ సమస్యలు కూడా తగ్గుతాయి. గుండె ఆరోగ్యానికి , నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు వంటి వాటికి నెయ్యి ఔషధంగా పనిచేస్తుంది. ఇండియన్ కిచెన్‌లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.


నెయ్యి కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మంపై ఉన్న వాపు, మంటలు, అలర్జీలతో పాటు ఎన్నో చర్మ సమస్యలను ఇది తగ్గిస్తుంది. మనం తరచుగా వాడే బ్యూటీ క్రీముల్లో కూడా నెయ్యిని వినియోగిస్తారని చాలా మందికి తెలియదు. నెయ్య తినడమే కాకుండా ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మ పోషణ:
నెయ్యిలో ఒమేగా కొవ్వు ఆమ్లాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి హాని చేసే ప్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. అంతే కాకుండా చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. నెయ్యి తేమను అందించి ఆరోగ్యకమైన మెరిసే చర్మాన్ని మీ సొంతమయ్యేలా చేస్తుంది. డల్ స్కిన్ ఉన్న వారి వారు నెయ్యిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.


 మృదువైన చర్మం:
నెయ్యిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మానికి నెయ్యి రాయడం వల్ల పొడిబారిన చర్మం కూడా మృదువుగా మారుతుంది. అంతే కాకుండా కాంతివంతంగా తయారవుతుంది. ఆంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియర్ గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా పిగ్మంటేషన్ సమస్యను కూడా నెయ్యి తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చర్మ స్థితిస్థాపతను కూడా పెంచుతుంది. అందమైన క్లియర్ స్కిన్ కావాలనుకునే వారు నెయ్యిని ఆహారంలో భాగంగా చేసుకోవడం అవసరం.

హైడ్రేషన్:
విటమిన్ ఏ, ఫ్యాటీ యాసిడ్లు నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా దురద, దద్దుర్లు అలర్జీల వంటి సమస్యల నుంచి కూడా రక్షిస్తాయి. చర్మం యొక్క రోగనిరోధక వ్యవస్థను ఇది కాపాడుతుంది. వీటితో పాటు చర్మానికి మంచి పోషణను ఇస్తుంది.

పగిలిన పెదవులు:
సున్నితమైన, మృదువైన భాగాలలో పెదవులు కూడా ఒకటి. శరీరంలో ముఖంపై ఉండే పెదవులు అందంగా కనిపిస్తే ముఖానికి మరింత అందం పెరుగుతుంది. పగిలిన పెదవులపై గోరువెచ్చని నెయ్యిని రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పొరలు, పొరలుగా కనిపించే పెదవులపై చర్మాన్ని నెయ్యితో స్క్రబ్ చేస్తే చక్కటి పెదాలు మీ సొంతం చేసుకోవచ్చు.

Also Read: గ్లోయింగ్ స్కిన్ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !

డార్క్ సర్కిల్స్:
అందంన్ని అమాంతం మింగేసే డార్క్ సర్కిల్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు నెయ్యిని కళ్ళ చుట్టూ తరచుగా రాసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. చర్మం కింద ఒత్తిడి వల్ల ఏర్పడే నల్లటి వలయాలను నెయ్యి దూరం చేస్తుంది. అంతే కాకుండా మెరిసే చర్మానికి ఇది ఉపయోగపడుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×