BigTV English

Green Chicken Recipe: టేస్టీగా గ్రీన్ చికెన్ ఇగురు.. ఇలా చేసేయండి, బగారా రైస్‌తో అదిరిపోతుంది

Green Chicken Recipe: టేస్టీగా గ్రీన్ చికెన్ ఇగురు.. ఇలా చేసేయండి, బగారా రైస్‌తో అదిరిపోతుంది

చికెన్‌తో చేసే వంటకాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రతిసారి చికెన్ వేపుడు, చికెన్ కూర, చికెన్ బిర్యాని తప్ప మిగతా రెసిపీలను ప్రయత్నించరు. ఇక్కడ మేము అన్నం, చపాతీ, పులావ్ ఇలా ప్రతి దానితో తినేలా గ్రీన్ చికెన్ గ్రేవీ రెసిపీ ఇచ్చాము. ఒక్కసారి ఫాలో అవ్వండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. పైగా ఇది ఎంతో పోషకాహారం కూడా.


గ్రీన్ చికెన్ గ్రేవీ రెసిపీకి కావలసిన పదార్థాలు

చికెన్ – ఒక కిలో
పసుపు – అర స్పూను
ఉల్లిపాయలు – మూడు
మిరియాల పొడి – ఒక స్పూను
జీలకర్ర పొడి – ఒక స్పూను
గరం మసాలా – అర స్పూను
పెరుగు – పావు కప్పు
కొబ్బరి పాలు – పావు కప్పు
నిమ్మరసం – మూడు స్పూన్లు
బిర్యానీ ఆకులు – ఒకటి ౌ
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – నాలుగు స్పూన్లు
కొత్తిమీర తరుగు – నాలుగు స్పూన్లు
పుదీనా తరుగు – నాలుగు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి – నాలుగు


గ్రీన్ చికెన్ గ్రేవీ రెసిపీ

⦿ చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. 2.  అందులోనే మిరియాల పొడి, నిమ్మరసం ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టాలి.
⦿ ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయల ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి బాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
⦿ ఆ నూనెలో బిర్యానీ ఆకులు, గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి.
⦿ ఈ మిశ్రమంలోనే మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ ను కూడా వేసి బాగా వేయించాలి.
⦿ ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించి పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి.
⦿ కాసేపయ్యాక పెరుగును వేసి బాగా కలపాలి.
⦿ ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి.
⦿ రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.
⦿ అలా ఉడికాక మూత తీసి కొబ్బరి పాలు వేసి బాగా ఉడికనివ్వాలి.
⦿ కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసి వేసాము.. కాబట్టి ఇది గ్రేవీ ఆకుపచ్చ రంగులోకి వస్తుంది. పైగా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ చికెన్ గ్రేవీ ఒక్కసారి తిని చూడండి. మీ ఇంటిలో అందరికి నచ్చుతుంది. పైగా దీనిలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

Also Read: పాలకూర కిచిడి వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరు, పైగా ఎంతో ఆరోగ్యం

అప్పుడప్పుడు చికెన్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చికెన్ లో సెలీనియం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మన శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించి బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి మనల్ని కాపాడుతుంది. మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా ముందుంటుంది. అలాగే చికెన్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ b6, విటమిన్ డి, జింక్, విటమిన్ బి12, ఐరన్ అధికంగా ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు చికెన్ తినడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు చికెన్ తినేవారు కూడా ఉన్నారు. ఇలా ప్రతిరోజు చికెన్ తినే అలవాటు ఉంటే 100 గ్రాములకు మించి తినకపోవడమే మంచిది. దానికి తగ్గట్టు వాకింగ్ వంటివి కూడా చేయాలి. చికెన్ ప్రతిరోజు తినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువే కానీ మితంగానే తినాలి. అధికంగా తింటే బరువు పెరిగిపోయే అవకాశం ఉంది.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×