Valentine’s Day 2025 Wishes: వాలెంటైన్స్ డే ప్రేమికులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ప్రేమికులు తమ భావాలను వ్యక్తపరుస్తారు. అంతే కాకుండా కొంతమంది తాము ప్రేమించే వారికి గిఫ్టులను కూడా ఇస్తారు. వాలెంటైన్స్ డే అనేది ప్రేమ, అభిరుచిని తెలియజేసే రోజు. వాలెంటైన్స్ డే సందర్భంగా మీరు మీ భాగస్వామికి కొన్ని ప్రత్యేకమైన మెసేజ్, కోట్స్ కూడా పంపించవచ్చు. ఈ కోట్‌లు ప్రేమ, అభిరుచి, అనుభూతిని వ్యక్తపరుస్తాయి. ఇవి మీ ప్రేమికుల హృదయాన్ని గెలిచేలా చేస్తాయి కూడా. మరి మీ మనస్సులోని భావాలను క్రింద ఉన్న ఏ కోట్స్ సరిపోతాయో చూసేయండి.
1. నువ్వు లేని ఈ క్షణం ఓ యుగంలా ఉంది..
యుగమంతా ఎదురు చూస్తా.. నీతో గడిపే క్షణం కోసం
హ్యాపీ వాలెంటైన్స్ డే !
2. ప్రకృతిలో పంచభూతాల సాక్షిగా
సాగరంలోని ప్రతి నీటి బిందువు సాక్షిగా
పువ్వులోని మకరందం సాక్షిగా
మైమరచి పాడే కోకిల సాక్షిగా
నేను నీ వాడిని .. హ్యాపీ వాలెంటైన్స్ డే !
3. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు
మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ
హ్యాపీ వాలెంటైన్స్ డే !
4. నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉంటే,
అది నువ్వు నా జీవితంలోకి రావడమే.
హ్యాపీ వాలెంటైన్స్ డే !
5. నిన్ను చూసిన క్షణం నన్ను నేను మరచిపోయాను
నువ్వు నాకు సొంతమైతే చాలనుకున్నాను..
అందుకే వేయి జన్మలకైనా నీ ప్రేమ కోసం నిరీక్షిస్తుంటాను
హ్యాపీ వాలెంటైన్స్ డే !
6. మరచిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదు, నా జీవితం
వదిలేయడానికి నువ్వు వస్తువు కాదు, నా ప్రాణం
పక్కన పెట్టడానికి నువ్వు పరాయి దానివి కాదు ,నా ఆత్మవి
గుర్తు రాకుండా ఉండటానికి నువ్వు బొమ్మవి కాదు, నా ప్రేమవి
హ్యాపీ వాలెంటైన్స్ డే !
7. ఉదయించే సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తే..
నీరాక నా జీవితంలో వెలుగు నింపింది
హ్యాపీ వాలెంటైన్స్ డే !
8. నన్ను నీ కళ్లలో పెట్టుకోకు కన్నీళ్లలో కొట్టుకుపోతాను
హృదయంలో దాచుకో.. ప్రతి స్పందనలా గుర్తుంటాను.
హ్యాపీ వాలెంటైన్స్ డే !
9. కన్నీళ్లు తుడిచే వారు కాదు..
కన్నీళ్లు రాకుండా చూసే వాళ్లు ప్రేమికులు
హ్యపీ వాలెంటైన్స్ డే !
10. నిజమైన ప్రేమికులు ఎప్పటికీ విడిపోరు
ఒక వేళ విడిపోతే అది ప్రేమ అనిపించుకోదు
హ్యపీ వాలెంటైన్స్ డే !
11. పరిస్థితులను బట్టి మారిపోయేది ప్రేమ కాదు
పరిస్థితుల్ని అర్థం చేసుకునేది అసలైన ప్రేమ
హ్యపీ వాలెంటైన్స్ డే !
12. కలగా మిగిలిపోతున్న నా జీవితంలో
వెలుగై వచ్చావు,
ఆనందాల హరివిల్లులను కురిపించావు
హ్యపీ వాలెంటైన్స్ డే !
13. ప్రాణంతో ఉన్న ప్రతీ క్షణం
నిన్ను మరువను
మరిచిన మరుక్షణమే
ప్రాణంతో ఉండను
హ్యపీ వాలెంటైన్స్ డే !
14. మదిలో మెదిలే తొలి ఊహకు రూపం నువ్వు
మౌనం పలికిన తొలి పలుకువు నువ్వు
హ్యపీ వాలెంటైన్స్ డే !
Also Read: వాలెంటైన్స్ డే రోజు మీ ప్రేమను మరింత బలంగా.. మార్చే బెస్ట్ గిఫ్ట్స్ !
15. విడిపోయే కాలం ఎంత విరహం అయినా..
భరించాల్సిన కాలం బయపెడుతున్నా
నీ ప్రేమను ఊపిరిగా చేసుకుని..
నీ కోసమే బ్రతికి ఉంటున్నా..
హ్యపీ వాలెంటైన్స్ డే !
16. నీ చూపు నన్ను పులకరించేలా చేసింది
నీ శ్వాస నన్ను మైమరపింపచేసింది
నీ మాట నన్ను అలరింపచేసింది
నీ ఊహ నన్ను కట్టిపడేసింది
కానీ ..
నీ ప్రేమ నన్ను జీవించేలా చేస్తోంది !