Valentine’s day Gift Ideas: ఫిబ్రవరి 7 నుండి ప్రారంభం అయ్యే వాలంటైన్ వీక్ చాలా ప్రత్యకమైంది. ముఖ్యంగా వాలెంటైన్స్ డే కోసం యువతి, యువకులు చాలా ఎదురు చూస్తుంటారు. ఈ రోజు తమ ప్రేమను భాగస్వామికి తెలియజేయడంతో పాటు మంచి సర్ ఫ్రైజ్ గిఫ్టులను కూడా ప్లాన్ చేస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వాలెంటైన్స్ డే కోసం ప్రేమికులకు గిఫ్టులు ఇవ్వడానికి మార్కెట్ లో అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. మీ ప్రేమను వ్యక్త పరచడానికి అంతే కాకుండా మీరు ప్రేమించే వారికి ఇష్టమైన వస్తువులను గిఫ్ట్ ఇచ్చి సర్ ఫ్రైజ్ చేయండి.
పర్ఫ్యూమ్ , వాచ్ కాంబో:
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పర్ఫ్యూమ్ వాడుతున్నారు. అంతే కాకుండా స్మార్ట్ వాచ్ కూడా ఉపయోగిస్తున్నారు. మీరు ప్రేమించే వారికి ఈ రెండు గిఫ్టులు ఇవ్వడం మంచి ఆలోచన. ఏదైనా షాపులో ఇలాంటి ఆకర్షణీయమైన కాంబో ఉంటే తప్పకుండా కొని ఇవ్వండి.
కాంబో గిఫ్ట్:
మీరు ప్రేమించే వారికి కాంబో ప్యాక్ లో బెల్ట్, పర్స్ , పర్ఫ్యూమ్ ఉన్న గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయండి. ఇలాంటి గిఫ్టు ఇవ్వడం వల్ల మంచి ఆలోచన ఎందుకంటే. ఇందులో ఉండే వస్తువులను వారు రోజూ ఉపయోగించే అవకాశం ఉంటుంది. వాడినప్పుడల్లా మీరు వారికి గుర్తుకు వస్తారు.
కుషన్ కవర్:
మీరు మీ లవర్‌కి కుషన్ కవర్ కూడా గిఫ్టుగా ఇవ్వవచ్చు. ఎల్లప్పుడూ మీ భాగస్వామికి మిమ్మల్ని ఇవి గుర్తుచేస్తాయి. ఎరుపు రంగులో ఉన్న కుషన్ కవర్స్ బహుమతిగా ఇవ్వడం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. మీ భాగస్వామి యొక్క ఫోటో, కోట్స్ తో కూడిన కుషన్ కూడా తయారు చేయించి ఇవ్వవచ్చు. ఇలాంటి గిఫ్టులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ అందమైన బహుమతి మీ ప్రేమను మరింత బలంగా చేస్తుంది.
టెడ్డీ బేర్:
మీరు మీ లవర్స్‌కి ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని అనుకుంటే మీరు రెడ్ టెడ్డీ బేర్ లను కూడా ఇవ్వవచ్చు. ఏ షాపులో నైనా ఇలాంటి టెడ్డీలు వివిధ సైజుల్లో అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు గులాబీలను ఇచ్చి ప్రపోజ్ చేస్తే.. వాలెంటైన్స్ డే ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
గులాబీ లైట్:
గులాబీ లైట్ ఇవ్వడం ద్వారా మీరు మీ ప్రేమ జీవితాన్ని మరింత ప్రకాశవంతంగా చేసుకోవచ్చు. ఇది మూసి ఉన్న గాజు కూజాలో LED లైట్లతో కూడి కృత్రిమ గులాబీని కలిగి ఉంటుంది. మీ భాగస్వామికి ఎర్ర గులాబీని ఇవ్వడం ద్వారా మీరు వారిని ప్రత్యేకంగా సర్ ఫ్రైజ్ చేయవచ్చు.
Also Read: రాత్రి పూట లేట్‌గా నిద్రపోతున్నారా ? ఈ వ్యాధులు రావడం ఖాయం
మొబైల్ ఫోన్ బహుమతి:
మీకు బడ్జెట్ సమస్య లేకపోతే మీరు మీ లవర్ కి మొబైల్ ఫోన్ కూడా గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. మొబైల్ ఫోన్లు ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. ఇదిలా ఉంటే అమ్మాయిలు ముఖ్యంగా గోల్డ్, సిల్వర్ నగలు ధరించడానికి ఇష్టపడతారు కాబట్టి చిన్న చిన్న ఆభరణాలు ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.