Abhivan Singh..సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల ఆత్మహత్యలు ఒక్కసారిగా అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుంటే, మరికొంతమంది కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక ఇక్కడ ప్రముఖ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ఒక్కసారిగా సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. మరి ఆయన ఎవరు? అసలు ఏం జరిగింది ?అనే విషయం ఇప్పుడు చూద్దాం.
భార్య వేధింపులు తట్టుకోలేక సింగర్ ఆత్మహత్య..
జగ్గర్నాట్ గా ప్రసిద్ధి చెందిన ఒడియా రాపర్ అభినవ్ సింగ్ (Abhivan Singh) ఆత్మహత్య చేసుకున్నారు. వైవాహిక జీవితంలో తలెత్తిన విభేదాలు, భార్య మోపిన తప్పుడు ఆరోపణలతో మానసికంగా కృంగిపోయిన అభినవ్ సింగ్.. తీవ్ర మనస్థాపం చెంది ప్రాణాలు తీసుకున్నారు. బెంగళూరులోని కడుబీసనహళ్లి లో తన అపార్ట్మెంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి , మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అభినవ్ సింగ్ విషం తాగి ఆత్మహత్య చేసుకోవడంతో భార్య , ఆమె కుటుంబీకులు చేసిన మెంటల్ టార్చర్ వల్లే తన కుమారుడు చనిపోయాడు అని అభినవ్ సింగ్ తండ్రి బిజయ్ మారతహళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫిర్యాదులో అభినవ్ భార్యతో పాటు మరో 10మంది పేర్లు చేరిక..
అభివన్ సింగ్ తండ్రి బిజయ్ ఇచ్చిన ఫిర్యాదులో అభివన్ సింగ్ ఆత్మహత్యకు కారణమైన ఆయన భార్యతో పాటు మరో పదిమంది పేర్లు జత చేయించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. భార్య, ఇతరులు మానసికంగా హింసించడం వల్లే అభివన్ చనిపోయాడని ఆయన తండ్రి ఆరోపిస్తున్నారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
ఇకపోతే అభివన్ సింగ్ తండ్రి బిజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అభినవ్ భార్య వేధింపుల వల్లే ప్రాణాలు తీసుకున్నాడా ? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అభివన్ మరణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పవచ్చు. ఇది చూసిన చాలామంది నెటిజెన్స్ భార్య బాధితుల జాబితాలోకి నువ్వు కూడా వచ్చి చేరావా అంటూ కామెంట్లు చేస్తున్నారు అంతేకాదు అభివన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలి అని కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.
అభివన్ కెరియర్..
అభివన్ సింగ్ విషయానికి వస్తే.. జగ్గర్నాట్ అనే రంగస్థలం నామంతో అభివన్ సింగ్ ఒడియాలో భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ఆయన పాడిన “కటక్ ఆంథంమ్” అనే పాట సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. దీంతో ఆయన పాపులారిటీ కూడా పెరిగిపోయింది. అంతేకాదు ఈయన “అర్బన్ లోఫర్” అనే మొదటి హిప్ హాప్ లేబుల్ ను కూడా స్థాపించాడు.అభివన్ సింగ్ బెంగళూరులో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.