BigTV English

Situationship: టీనేజ్ లవ్‌లో ఈ కొత్త ట్రెండ్ మీ పిల్లలకు ప్రమాదంగా మారిందా?

Situationship: టీనేజ్ లవ్‌లో ఈ కొత్త ట్రెండ్ మీ పిల్లలకు ప్రమాదంగా మారిందా?

Situationship: ఈ రోజుల్లో టీనేజర్ల మధ్య సిచుయేషన్‌షిప్‌లు హాట్ టాపిక్. ఇది రొమాంటిక్ కనెక్షన్, కానీ ‘బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్’అనే లేబుల్ లేకుండా, కమిట్‌మెంట్ లేకుండా సాగే సంబంధం. హైస్కూల్ గ్యాంగ్‌లలో ఇలాంటివే ఎక్కువ. సీరియస్ రిలేషన్‌కి ఎవరూ రెడీగా ఉండరని టీనేజర్స్ చెబుతున్నారు. చాటింగ్, ఫ్లర్టింగ్‌తో మొదలై, కలిసి టైం స్పెండ్ చేయడం, కొన్నిసార్లు హుక్ అప్‌ల వరకూ వెళ్లే ఈ రిలేషన్స్‌లో ‘మనం ఏంటి?’ అనే ప్రశ్న చాలా అరుదు. కొన్ని అఫీషియల్ రిలేషన్‌షిప్‌లుగా మారితే, మరికొన్ని కన్ఫ్యూజన్ లేదా హార్ట్‌బ్రేక్‌తో ముగుస్తాయి.


జెన్ జీ టీన్స్‌లోనే ఎందుకు?
సిచుయేషన్‌షిప్‌లు ఎక్కువగా జెన్ జీ టీన్స్‌లోనే కనిపిస్తాయి. వాళ్లు ఫ్రీడమ్, ఇండిపెండెన్స్‌ని ఇష్టపడతారు. సోషల్ మీడియా ఈ క్రేజ్‌ని మరింత పెంచింది. స్నాప్‌చాట్, ఇన్‌స్టా మెసేజ్‌లలో టీన్స్ ఒకవైపు క్లోజ్‌గా, మరోవైపు డిటాచ్డ్‌గా ఉంటూ రిలేషన్స్ నడిపిస్తారు. కమిట్‌మెంట్ లేకపోవడం వల్ల వాళ్లు తమ ఐడెంటిటీ, సెక్సువాలిటీని కొంత మేరకు ఎంజాయ్ చేస్తున్నామనే భ్రమలో బతుకుతారు. టీనేజ్ ఫాంటసీలను బాగా ఎంజాయ్ చేసే స్పేస్ పొందుతారు. కానీ, ఒకరు సీరియస్‌గా ఫీల్ అయితే, ఇంకొకరు క్యాజువల్‌గా తీసుకుంటే, అంచనాలు సరిపోక డ్రామా తప్పదు.

ప్రమాదకరమా?
సిచుయేషన్‌షిప్‌లు సాధారణంగా హానిచేయవని సైకాలజిస్ట్‌లు చెప్తున్నారు, కానీ అస్పష్టత వల్ల టీన్స్‌లో యాంగ్జైటీ పెరగొచ్చు. ఉదాహరణకు, ఒకరు పార్టీలో వేరొకరితో ఫ్లర్ట్ చేస్తే, ఇంకొకరు హర్ట్ అవుతారు. బౌండరీస్ సెట్ కాకపోవడం వల్ల ఈ ఇష్యూని రైజ్ చేయలేరు. సోషల్ మీడియా ఈ ఫీలింగ్స్‌ని మరింత ఇంటెన్స్ చేస్తుంది. లైక్స్, కామెంట్స్‌ని ఓవర్‌ అనలైజ్ చేస్తూ టీన్స్ కన్ఫ్యూజ్ అవుతారు.


పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి?
సైకాలజిస్ట్‌ల సలహా ఏంటంటే, టెన్షన్‌కి బదులు క్యూరియాసిటీతో పిల్లలకు చేరువగా వెళ్లడం ఉత్తమం. సిచుయేషన్‌షిప్‌ ఎలా ఉంది? హ్యాపీగా ఉన్నావా, స్ట్రెస్‌డ్‌గా ఉన్నావా? అని అడగడం ద్వారా టీన్ మనసులో ఏం ఉందో తెలుసుకోవచ్చు. ఓపెన్ అప్ అయితే, అది వాళ్లు మీ మీద ట్రస్ట్ చూపిస్తున్నట్లు అర్థం. లెక్చర్ ఇవ్వడం, ఇంటర్‌ఫియర్ చేయడం మానేయాలి. ఈ రిలేషన్‌లో రెస్పెక్టెడ్‌గా ఫీల్ అవుతున్నావా? లేదా మీరిద్దరూ సమానంగా ఎఫర్ట్ పెడుతున్నారా? వంటి ప్రశ్నలు అడిగితే బెటర్. ప్రస్తుతం ఉన్న ఇండియన్ పేరెంట్స్ అయితే ఈ రేంజ్ ఫ్రీడమ్ ఇవ్వడం.. పిల్లలతో అంత క్లోజ్‌గా ఉండడం అనేవి జరగడం కష్టమే. కానీ, బ్రాడ్ మైండెడ్ పేరెంట్స్ ఉంటే టీనేజ్‌లో జరిగే వాటిని కాస్త కూల్‌‌గానే హ్యాండిల్ చేస్తారు.

సిచుయేషన్‌షిప్‌ మంచిదా?
సపోర్ట్ ఇవ్వడంలో జడ్జ్‌మెంట్ లేకుండా వినడం కీలకం. సిచుయేషన్‌షిప్‌ల వల్ల టీన్స్ ఇన్‌సెక్యూర్ ఫీల్ అవ్వొచ్చు, కాబట్టి క్రిటికల్ రెస్పాన్స్‌లు వాళ్లని సైలెంట్ మోడ్‌లోకి పంపొచ్చు. ఏదైనా సలహా కావాలా, కంఫర్ట్ కావాలా, లేక జస్ట్ అటెన్షన్ కావాలా? అని అడిగితే, టీన్స్ కంట్రోల్‌లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. సిచుయేషన్‌షిప్‌లు న్యూ నార్మల్ అయినా, అవి టీన్స్‌కి ఎమోషనల్ రెసిలియన్స్ బిల్డ్ చేయడానికి, రిలేషన్‌లో తమకి ఏం కావాలో అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. పేరెంట్స్ ఓపెన్ కమ్యూనికేషన్‌తో టీన్స్‌ని గైడ్ చేయాలి. అయితే అతి ఎప్పుడైనా అనర్థాలకే దారితీస్తుంది. కాబట్టి పిల్లలు తమ సో కాల్డ్ హుక్ అప్ సిచుయేషన్‌షిప్‌లో ఎంత దూరం వెళ్తున్నారనేది కూడా గమనించడం అవసరం. లేదంటే టీనేజ్‌లోనే జీవితాలు గాడితప్పే ప్రమాదం ఉంది.

Related News

Nail Biting: తరచూ గోళ్లు కొరుకుతున్నారా ? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే !

Causes Of Anger: ప్రతి చిన్న విషయానికీ కోపం వస్తుందా.. ? కారణాలివే !

Longtime Sitting: ఆఫీసులో ఎనిమిది నుంచి పది గంటలు కూర్చుంటున్నారా? అయితే ఈ వ్యాధి త్వరలోనే వచ్చేస్తుంది

Weight Loss Tips: ఉదయం పూట ఇలా చేస్తే.. ఈజీగా వెయిట్ లాస్

Strawberries: డైలీ స్ట్రాబెర్రీలు తింటే.. శరీరంలో జరిగే మార్పులివే !

Open Pores On Face: ఓపెన్ పోర్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ?

Big Stories

×