BigTV English

Rashid Khan : రషీద్ ఖాన్ ఇజ్జత్ తీసిన మార్ష్.. గుజరాత్ టీం నుంచి ఔట్

Rashid Khan : రషీద్ ఖాన్ ఇజ్జత్ తీసిన మార్ష్.. గుజరాత్ టీం నుంచి ఔట్

Rashid Khan :  ఐపీఎల్ అద్భుతమైన బౌలర్లలో రషీద్ ఖాన్ ఒకరు. ప్రస్తుతం రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. అయితే  ఈ సీజన్ లో మాత్రం అంతగా ప్రదర్శన కనబరచలేదు. ఇవాళ లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్.. రషీద్ వేసిన తొలి ఓవర్ లోనే 25 పరుగులు చేశాడు. వరుసగా 646441 తో విధ్వంసం సృష్టించాడు. ఈ ఏడాది ఇప్పటివరు అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్ రషీద్ ఖానే కావడం గమనార్హం. మరోవైపు ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ 56 బంతుల్లో సెంచరీ చేయడం విశేషం. ఇక రషీద్ ఖాన్ చెత్త బౌలింగ్ అని.. తాను ఇజ్జత్ తీసుకున్నాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. 


Also Read :  Athiya Shetty : KL రాహుల్ ఇంట్లో గొడవలు.. ఆ టార్చర్ భరించలేక అతియా షాకింగ్ నిర్ణయం !

ఒకప్పుడు అద్భుతంగా బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ ఈ సీజన్ లో ఇలా బౌలింగ్ చేయడమేంట్రా..? అని చర్చించుకుంటున్నారు పలువురు క్రికెట్ అభిమానులు. దీంతో వచ్చే సీజన్ లో అసలు రషీద్ ను గుజరాత్ తీసేస్తుందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడాడు రషీద్ ఖాన్. ఆ తరువాత గుజరాత్ టైటాన్స్ లో కీలక పాత్ర పోషించాడు. రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షోతో ఒకసారి గుజరాత్ టైటాన్స్ టైటిల్ కూడా సాధించింది. ఈ సీజన్ లో మరీ ఫైనల్ లో రషీద్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.  ఇక గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడితే.. వాటిలో 9 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్ ల్లో మాత్రం ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.


లక్నో బ్యాటర్లు బాదుడే.. బాదుడు.. 

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం 7వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించిన తరువాత లక్నో బ్యాటర్లు బ్యాట్ ని ఝులిపిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు 235 పరుగులు చేసింది. చివరి ఓవర్ లో కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన రెండు సిక్సులు బాదాడు. చివరి ఓవర్ మొదటి బంతికే సిక్స్ బాదాడు పంత్. వాస్తవానికి పంత్ ప్రారంభంలో ఫామ్ లో కనిపించలేదు. కానీ చివరి మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా బ్యాట్ చేసి అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్ లో 64 బంతుల్లో 117 పరుగులు చేశాడు ఓపెనర్ మిచెల్ మార్ష్. అందులో 8 సిక్సులు, 10 ఫోర్లు ఉండటం విశేషం. మరోవైపు ఓపెనర్ మాక్రమ్ 24 బంతుల్లో 36 పరుగులు చేయగా.. నికోలస్ పూరన్ 27 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రిషబ్ పంత్ 6 బంతుల్లో 16 పరుగులు చేశాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్ల కి 235 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు ఇవాళ అంతగా బౌలింగ్ చేయలేదు. సాయి కిషోర్ బౌలింగ్ లో మార్క్రమ్, అర్షద్ ఖాన్ బౌలింగ్ లో మిచెల్ మార్ష్ మినహా మిగతా బౌలర్లు అంతా వికెట్లు తీయడం విఫలం చెందారు. దీంతో లక్నో బ్యాటర్లు రెచ్చిపోయి భారీ స్కోర్ చేశారు.

Related News

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

Big Stories

×