BigTV English

Breakfast for weight Loss : బరువు తగ్గాలంటే ఉదయం ఈ టిఫిన్‌ చేయండి

Breakfast for weight Loss : బరువు తగ్గాలంటే ఉదయం ఈ టిఫిన్‌ చేయండి

Breakfast for weight Loss : మానవ శరీరంలోని కండరాలు ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలంటే ప్రొటీన్‌ చాలా ముఖ్యం. ఉదయం వ్యాయామం చేసేవారికి భారీ వర్కవుట్‌ తర్వాత ప్రొటీన్‌ చాలా అవసరం. ఎముకలు, కండరాలను, కీళ్లను బలోపేతం చేయడంలో వీటి పాత్ర కీలకం. అందుకే మన బాడీకి సరిపడా ప్రొటీన్లు తీసుకోవడం చాలా ముఖ్యం.


ఒక వ్యక్తి ఎన్ని కిలోల బరువు ఉంటారో అన్ని గ్రాముల ప్రొటీన్లు శరీరానికి అవసరం. ఉదయం మన అల్పాహారంలో అధిక ప్రొటీన్‌ ఉన్నవాటిని తీసుకుంటే ఆ రోజంతా బాగా పనిచేస్తారని నిపుణులు అంటున్నారు. ఉదయం నిద్రలేచిన 2 గంటల్లో టిఫిన్‌ చేయాలి. కొందరు ఉదయం టిఫన్‌ సరిగా చేయరు.

దీంతో తలనొప్పి,మైగ్రేన్‌లు కూడా వస్తాయి. మరికొందరు బరువు తగ్గడానికి ఉదయం అల్పాహారం మానేస్తారు. బరువు తగ్గాలనుకునే వారికి ప్రొటీన్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రొటీన్‌ రిచ్‌ బ్రెక్‌ఫాస్ట్‌ తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని అంటున్నారు. సాధారణంగా మనం ఉదయం ఇడ్లీ, పూరీ, దోశ, వడ ఇలాంటివి తింటుంటాం.


కానీ ప్రొటీన్‌ రిచ్ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని పొషకాహార నిపుణులు అంటున్నారు. రాజ్మా, పెసర్లు, శెనగల మొలకలు కలిపి 5 నిమిషాల్లో మొలకల చాట్‌ చేసుకోవచ్చు. కాస్త మీకు టేస్ట్‌ కావాలంటే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం యాడ్‌ చేసుకుంటే సరిపోతుంది. ఉడికించిన కోడిగుడ్లు ఆరోగ్యానికి మేలు అని అందరికీ తెలుసు కానీ చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడరు.

లైట్లీ ఫ్రైడ్‌ ఎగ్‌లోనూ ప్రొటీన్‌ పుష్కలంగా ఉంటుంది. దీన్ని రెడీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నల్ల మిరియాలు, పాలు, గుడ్లు, వెన్నతో దీన్ని చేసుకోవచ్చు, కావాలంటే కొన్న కూరగాయలు కూడా ఇందులో వేసుకోవచ్చు. బేసన్ చీలాను నార్త్‌ ఇండియన్స్‌ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే దీన్ని శనగపిండి దోశ అనొచ్చు. దీన్ని శనగపిండి, సగ్గుబియ్యం, చిజ్‌తో చేస్తారు. దీన్ని పోషకాల గని అంటారు. ఈ బేసెన్‌ చీలాను పెరుగు, ఊరగాయతో తినొచ్చు.

పెసరపప్పు కిచిడీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెసరపప్పు, బియ్యం, ఎన్నో రకాల కూరగాయలు వేసి ఈ కిచిడీని తయారు చేస్తారు. ఈ కిచిడీలో ప్రొటీన్‌ పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల పెసరపప్పులో 22 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. ప్రొటీన్‌ అధికంగా ఉండే మరో ఆహారం పన్నీ బుర్జీ.. దీని రుచి కూడా అదిరిపోతుంది. పిల్లలు కూడా దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. పన్నీర్‌లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు.

Related News

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Big Stories

×