E-Paper
Advertisement

PAK vs BAN : మళ్లీ పుంజుకున్న పాకిస్తాన్.. బంగ్లాపై ఘన విజయం

PAK vs BAN : మళ్లీ పుంజుకున్న పాకిస్తాన్.. బంగ్లాపై ఘన విజయం
Advertisement

PAK vs BAN : పాకిస్తాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. నాలుగు వరుస పరాజయాల తర్వాత, పాక్ క్రికెట్ బోర్డు పునాదులే కదిలిన తర్వాత టీమ్ అంతా కలిసికట్టుగా ఆడి సాధించిన విజయంగా ఈ గెలుపును అభివర్ణించవచ్చు. కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

బంగ్లాదేశ్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు తంజిద్ హాసన్, లిటన్ దాస్ వచ్చారు. అయితే మొదటి ఓవర్ 5 బంతికి తంజిద్ హాసన్ డక్ అవుట్ గా వెనుతిరిగాడు. తర్వాత 2 ఓవర్లు గడిచాయో లేదో ఫస్ట్ డౌన్ వచ్చిన హుస్సేన్ షాంతో (4) అవుట్ అయ్యాడు. 6 ఓవర్లు ముగిసేసరికి మూడో వికెట్ కూడా బంగ్లాదేశ్ కోల్పోయింది. రహీమ్ (5) అవుట్ అయ్యాడు. 3 వికెట్ల నష్టానికి 23 పరుగులతో బంగ్లాదేశ్ విలవిల్లాడింది.

Advertisement

ఈ దశలో ఓపెనర్ లిటన్ దాస్ (45), మహ్మదుల్లా (56) జట్టుని ఆదుకున్నారు. నెమ్మదిగా ఒకొక్క పరుగుతీస్తూ జట్టు స్కోరుని ముందుకి నడిపించారు. తర్వాత లిటన్ దాస్ అవుట్ కాగానే కెప్టెన్ షకీబ్ ఆల్ హాసన్ (43) చేసి మహ్మదుల్లాకి అండగా నిలిచాడు. తర్వాత మెహిదీ హాసన్ (25) తప్ప చెప్పుకోదగ్గ స్కోర్లు ఎవరూ చేయలేదు. చివరికి 45.1 ఓవర్లలో 204 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యింది. పాకిస్తాన్ బౌలింగ్ లో షహీన్ ఆఫ్రిది 3, ఇఫ్తికార్ అహ్మద్ 1, హరిస్ రవూఫ్ 2, మహ్మద్ వసీమ్ 3, ఉసామా మిర్ 1 వికెట్టు తీసుకున్నారు.

ఛేజింగ్ కి దిగిన పాకిస్తాన్ ఓపెనర్లు ఇద్దరూ మంచి కసితో ఆడారు. 21 ఓవర్ల వరకు వికెట్టు పడలేదు. జట్టు స్కోర్ 128 పరుగుల వద్ద అబ్దుల్లా షఫీఖ్ (68) అవుట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజామ్ ఎక్కువ సేపు నిలబడలేదు. కేవలం 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బహుశా పాక్ ఓటములకు ఫెయిల్యూర్ అంతా తన మీదే పడటంతో ఆ ఒత్తిడితోనే ఆట మీద కాన్సంట్రేషన్ దెబ్బతిని త్వరగా అయిపోయాడని అంటున్నారు.

Advertisement

సెకండ్ డౌన్ వచ్చిన రిజ్వాన్ 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ దశలో సెంచరీ చేస్తాడనుకున్న ఫకర్ జమాన్ 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తను ఈ మ్యాచ్ లో ఫోర్లు కన్నా సిక్స్ లు ఎక్కువ కొట్టడం విశేషం. మొత్తం 7 సిక్స్ లు, 3 ఫోర్లతో 74 బంతుల్లో ఈ పరుగులు చేశాడు. చివర్లో ఇఫ్తికార్ అహ్మద్ వచ్చి 17 పరుగులు చేసి గెలుపు ఖరారు చేశాడు. 32.5 ఓవర్లలోనే పాక్ 205 లక్ష్యాన్ని సాధించడం విశేషం. మూడు మ్యాచ్ లు గెలిచి 6 పాయింట్లతో తిరిగి 5 వ స్థానానికి చేరుకుంది.

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×