Jamun Seed Benefits: వేసవి సీజన్ వచ్చిందంటే చాలు ఆ కాలంలో వచ్చే పండ్లు వేరుగా ఉంటాయి. మిగతా సీజన్‌లో అవి కనిపించవు. అందుకే వాటిని తినాల్సిందేనని పెద్దలు తరచు చెబుతారు. వాటి వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందని అంటున్నారు. అలాంటి వాటిలో నేరేడు పండు ఒకటి. పండు మాత్రమే కాదు వాటి గింజల వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో తెలుసా? వాటిపై ఓ లుక్కేద్దాం.
అధిక పోషకాలు ఉండే పండ్లలో నేరేడు ఒకటి. తెలుగులో నేరేడు పండు లేదా జామున్ అంటారు. ఇంగ్లీషులో బ్లాక్ బెర్రీ అని ముద్దగా పిలుచుకుంటారు. వేసవిలో వచ్చే నేరేడు తినడం వల్ల ఆరోగ్యానికి చాలామంచిది. తీపితో కూడిన కాస్త వగరు కూడా ఉంటుంది. అందుకే వీటిని తినడానికి ఇష్టపడతారు. అందులో ఆస్ట్రింజెంట్, యాంటీ-డ్యూరిటిక్ వంటి లక్షణాలు ఉంటాయి.
తక్కువ కేలరీలు, ఎక్కువ శక్తిని అందిస్తుంది. కేవలం పండు మాత్రమే కాదు వాటి గింజల వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయని అప్పుడప్పుడు కొంతమంది డాక్టర్లు చెబుతుంటారు. పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నేరేడు గింజలు కాలేయాన్ని శుభ్రపరస్తాయి. కిడ్నీల పని తీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
నేరేడు పండు విత్తనాలు నేరుగా తినే ఓపిక ఉంటే తినవచ్చు. లేదంటే పొడి చేసుకుని తీసుకోవచ్చు. అజీర్ణం కడుపు సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచి జీర్ణక్రియ సరిగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియ కోసం కొద్ది ఉప్పుతో కలిపి తీసుకుంటే మంచిదని అంటున్నారు నిపుణులు.
ALSO READ: వేసవిలో చర్మం జిడ్డుగా ఉంటోందా? ఉదయాన్నే ఈ చిట్కాలు తప్పని సరి
నేరేడు పండు తీసుకోవడం వల్ల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమల సమస్యను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేందుకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలడం ఆగి, మరింత బలంగా తయారు అవుతుంది. అలాగే ముఖం సహజ కాంతి రావాలంటే బెర్రీల గుజ్జును ఫేస్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు.
నేరేడులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. ఆకలిని నియంత్రించి బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. రెగ్యులర్‌గా తీసుకుంటే ఇంకా మంచింది కాకుంటే అవి దొరకాలి. బరువు తగ్గాలనేవారు రోజూ అల్పాహారం కోసం బెర్రీలు తీసుకోవచ్చు.
నేరేడులో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్త పోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గించడంలో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీటిని క్రమం తప్పకుండా తినాలి. దానివల్ల కొలెస్ట్రాల్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది.
నేరేడులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. నేరేడు గింజలలో జాంబోలిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ నియంత్రించడానికి విత్తనాలను ఎండ బెట్టి పొడి చేయాలి. ఈ పొడిని ఒక స్పాన్ గ్లాసు నీటిలో కలుపుకుని తాగితే షుగర్ సులువుగా కంట్రోల్ అవుతుంది కూడా.
సూచన: అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాం. వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకుని మీ డైట్‌లో చేర్చుకోవాలి. వీటికి ‘బిగ్ టీవీ’ ఎలాంటి బాధ్యత వహించరు.