Hearing Unit Centre: ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలామంది పుట్టుకతోనే చెవిటి వాళ్లు అవ్వడం లేదా వృద్ధాప్య కారణాలవల్ల సరిగ్గా వినిపించకపోవడం లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు అలాంటి వారి కోసం ఒక గొప్ప క్లినిక్ ను ప్రారంభించడం జరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో హియరింగ్ క్లినిక్ లకు సంబంధించి ప్రముఖ నెట్వర్క్ అయినటువంటి డబ్ల్యూ ఎస్ ఆడియాలజీ ఆధ్వర్యంలో.. ప్రఖ్యాత విశ్వసనీయ బ్రాండ్ రెక్స్టన్ తో కలిసి విజయవాడ, ఏలూరు రోడ్ లో విజయ టాకీస్ దగ్గర అధునాతన హియరింగ్ సెంటర్ హియర్ జోన్ ను ప్రారంభించారు. ఈ ఆధునిక హియరింగ్ ఎయిడ్ సెంటర్ యూనిట్ సౌకర్యం ఆడియో మెట్రీ, టిమ్పానోమెట్రీ , హియరింగ్ ఎయిడ్ ట్రయల్ తో పాటూ ఫిట్టింగ్ ప్రోగ్రామింగ్ సర్వీసింగ్ వంటి ప్రత్యేక సేవలను కూడా క్లినిక్ అందించనుంది. వీటిని వివిధ రకాల ఉపకరణాలతో పాటు సమగ్రమైన ఆడియో లాజికల్ సేవలను అందించడానికి కూడా సిద్ధంగా ఉంది.
వినికిడి లోపం ఉన్నవారికి రెక్స్టన్ అద్భుత సాధనం ..
ముఖ్యంగా ఈ అత్యాధునిక రెక్స్టన్ స్టోర్ అనేది.. వినికిడి లోపం ఉన్నవారికి అధిక నాణ్యత సేవలతో, ఆధునిక వినికిడి సంరక్షణను సూచిస్తుంది. ముఖ్యంగా ఇంటరాక్టివ్ సెషన్స్ తో పాటూ వినూత్న ఉత్పత్తులు, నిపుణుల ఆడియో లాజికల్ సలహాలను ఒకే వేదికగా అనుసంధానిస్తూ వినికిడి సంరక్షణ సేవలకు కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుందని క్లినిక్ నిర్వాహకులు తెలిపారు . ఇక స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా మా సేవలను రూపొందించడానికి మా బృందం శ్రద్ధగా పనిచేస్తుందని, ఈ ప్రారంభంతో హియర్ జోన్ విజయవాడకు అధునాతన డయాగ్నస్టిక్ సౌకర్యాలను, ప్రపంచంలోని అతి సూక్ష్మమైన అధునాతన వినికిడి సహాయ పరిష్కారాలతో కలిపి సరికొత్త వినికిడి సంరక్షణను అందిస్తుంది అని తెలిపారు.
వినికిడితో అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించడమే లక్ష్యం..
ఈ సందర్భంగా హియర్ జోన్ ఎండి శ్రీ కె.గణేష్ మాట్లాడుతూ.. ” హియర్ జోన్ లో మేము కేవలం ఒక క్లినిక్ గా మాత్రమే కాకుండా వినూత్నమైన సేవలతో ముందుకు వెళ్తాం. పారదర్శకత, నమ్మకం, సాంకేతికత అనే స్తంభాలపైన నిర్మించబడింది. వినికిడి ఆరోగ్యం కోసం మాది ఏకైక విశ్వసనీయ గమ్యస్థానం. ముఖ్యంగా మా వద్దకు వచ్చే ప్రతి వ్యక్తికి వినికిడి ఆనందం, జీవితకాల సేవను అందించడమే మా లక్ష్యం. ముఖ్యంగా మా సేవలను విజయవాడలోనే కాకుండా అన్ని ప్రాంతాలలో అంతకుమించి హియరింగ్ కేర్ గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు అడుగు వేస్తున్నాము” అంటూ తెలిపారు.
వినికిడి లోపంతో వచ్చే సమస్యలను అధిగమించాలి..
ఆ తర్వాత WS ఆడియాలజీ ఇండియా సీఈవో , మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అవినాష్ పరార్ మాట్లాడుతూ.. “వినికిడి లోపం నేడు ప్రజలలో అత్యంత సాధారణ ఇంద్రియ లోపం గా మారిపోయింది. వినికిడి లోపంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం చూపడమే మా ప్రధాన లక్ష్యం. చికిత్స చేయని వినికిడి లోపం సామాజిక, మానసిక , శారీరక పరిణామాలను కలిగి ఉంటుంది. ఈ స్టోర్ ప్రారంభంతో వినికిడి పరికరాల గురించిన అంచనాలను తిరిగి రూపొందించేలా, విజయవాడ ప్రజలు చర్య తీసుకునేలా కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామంటూ” తెలిపారు.
హియరింగ్ ఎయిడ్ సెంటర్ కి పునాది ఎక్కడ పడిందంటే?
ఇకపోతే ఈ హియరింగ్ ఎయిడ్ సెంటర్ 1980లో చెన్నైలోని నుంగంబాక్కంలోని ఒక చిన్న ప్రదేశంలో శ్రీ ఎన్ ఎస్ కృష్ణమూర్తి స్థాపించారు. 1967 నుండి 1979 వరకు 12 సంవత్సరాల రేడియో ఇంజనీరింగ్ నేపథ్యంగా భారతదేశ మంతటా ప్రయాణించారు. 1970 చివర్లో ఎన్ఎస్కే భారతదేశ ప్రజలను పాతకాలపు వినికిడి పరికరాలతో వారి వినికిడిని పెరుగుపరచడానికి అలాగే వినికిడి పరిసరాలు అవసరం ఉన్న వ్యక్తులను చేరుకోవడానికి 42 రోజుల పర్యటన కోసం ప్రయాణించి, చెన్నైలో ప్రత్యేకమైన హియరింగ్ ఫిట్టింగ్ సెంటర్ ను ప్రారంభించారు..
WS ఆడియాలజీ గురించి..
WS ఆడియాలజీ విషయానికి వస్తే.. 2019లో సివాంటోస్, వైడెక్స్ సంయుక్తంలో WS ఆడియాలజీ ప్రారంభం అయ్యింది. పినికిడి లోపం ఉన్న వారి జీవితాన్ని అద్భుతంగా మార్చి , శబ్దాలను వినడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో అలాగే మార్గదర్శకత్వం వహించడంలో 140 సంవత్సరాల అనుభవాన్ని మిళితం చేస్తుంది. 130 కి పైగా మార్కెట్లలో ఆదరణ పొందుతోంది. అంతేకాదు డబ్ల్యు.ఎస్ ఆడియాలజీ ఇప్పటివరకు 12,500 పైగా మందిని నియమించింది.
రెక్స్టన్ విషయానికి వస్తే..
రెక్స్టన్ విషయానికి వస్తే.. WSA లో భాగమైన రెక్స్టన్ ప్రసిద్ధి చెందిన ప్రపంచ హియరింగ్ హియర్ బ్రాండ్. వినికిడికి సంబంధించిన సేవలను ఇది అందిస్తుంది. ఇంట్లో, పనిలో, విశ్రాంతి సమయంలో, వ్యాయామం తదితర సమయాలలో ఎప్పుడైనా సరే మీరు రెక్స్టన్ ఉపయోగించవచ్చు.