Kannada Actress: కన్నడ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన వారిలో నటుడు దర్శన్(Darshan) ఒకరు. ఈయన గత కొద్ది నెలల క్రితం రేణుక స్వామిని(Renuka Swamy) హత్య చేసి జైలుకు వెళ్లడంతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇలా ఈయన తప్పు చేసి జైలుకు వెళ్లినప్పటికీ ఈయన అభిమానులు మాత్రం ఆయన చేసిన తప్పును గుర్తించకుండా తన తప్పును ప్రశ్నించిన వారిపై పెద్ద ఎత్తున భూతులతో రెచ్చిపోతున్నారు. తాజాగా నటి రమ్య(Ramya) పై దర్శన్ అభిమానులు(Darshan Fans) తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేయడమే కాకుండా నిన్ను రే* చేసి చంపేస్తామంటూ ఆమె పట్ల బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
బెదిరిస్తున్న దర్శన్ అభిమానులు…
తాజాగా నటి రమ్య ఇదే విషయం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో తాను దర్శన్ రేణుక స్వామిని చంపడం గురించి మాట్లాడిన నేపథ్యంలోనే ఆయన అభిమానులు తనని టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా నన్ను అత్యాచారం చేసి చంపుతామని, దర్శన్ రేణుక స్వామిని కాకుండా నిన్ను హత్య చేసి చంపి ఉంటే బాగుండేది అంటూ తనపై విమర్శల దాడి చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ విమర్శలు చూసినప్పుడు తనకు చాలా బాధ కలుగుతుందని రమ్య వెల్లడించారు.
సరైన చట్టాలు లేవు…
ఇక తన గురించి ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన వారు ఎవరు? ఏంటి? అనే విషయాల గురించి అన్ని ఆధారాలు సేకరించామని ఈ ఆధారాలతో తాను పోలీసులను ఆశ్రయించి వారికి సరైన విధంగా సమాధానం చెప్పబోతున్నానని రమ్య వెల్లడించారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా మహిళా ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ కొంత మంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్న వారిపట్ల చర్యలు తీసుకోవడానికి సరైన చట్టాలు లేకపోవడంతోనే ఎవరికి భయం లేకుండా పోయిందని రమ్య ఈ ఘటనపై చాలా ఘాటుగా స్పందించారు. అతి త్వరలోనే తన గురించి ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
సరిదిద్దుకోలేని తప్పు చేసిన దర్శన్…
దర్శన్ రేణుక స్వామిని హత్య చేసిన సమయంలో ఆ ఘటన గురించి రమ్య స్పందిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న దర్శన్ తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసారు అంటూ ఆ ఘటన గురించి అప్పట్లో రమ్య స్పందిస్తూ దర్శన్ చేసిన తప్పును కేవలం తప్పు అని మాత్రమే చెప్పినందుకు దర్శన్ అభిమానులు తనని టార్గెట్ చేశారని తెలుస్తోంది. మరి రమ్య చేసిన ఈ వ్యాఖ్యలపై దర్శన్ అభిమానుల స్పందనం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలో సెలబ్రిటీల పట్ల ఎంతోమంది ఈ విధమైనటువంటి వ్యక్తిగత దాడులకు పాల్పడుతూ సెలబ్రిటీలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
Also Read: Kaantha Teaser: ఇది శాంత కాదు.. కాంత… ఆడియన్స్‌కు ఇది నచ్చుతుందా ?